ప్రజావాక్కు

People
People

ప్రజల తీర్పు: -ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌

బిజెపి జాతీయ పార్టీ కేంద్రంలో అధికారాన్ని చెలాయిస్తున్న పార్టీ. పైగా అధికార వాంఛ ఎక్కువగా ఉన్న పార్టీ. అందుకే దేశంలో ఏమూల ఏ ఎన్నికలు జరిగినా ప్రతిష్టాత్మకంగా తీసు కునిఎలాగైనా గెలవాలని విస్తృతంగా ప్రచారంచేస్తుంది. నాలు గు నెలల క్రితం తెలంగాణా అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో కూడా ఆ పార్టీ అలానే చేసింది. గెలుపే ధ్యేయంగా పనిచేసిం ది. కేంద్ర మంత్రులు, బిజెపి పాలిత రాష్ట్రముఖ్యమంత్రులు తెలంగాణాకు వచ్చి ప్రచారం చేసారు. ప్రత్యర్థి పార్టీల వారిని దుమ్మెత్తిపోశారు. తెలంగాణాలో అధికారం మాదే అన్నట్టుగా వ్యవహరించారు. అయితే చివరికి ఏమయిందో అందరికి తెలు సు.లోక్‌సభ ఎన్నికలలోకూడా బిజెపి ఇదే ప్రయోగం చేసింది. ఆ పార్టీకి చెందిన అథిరథ మహారథులంతా తెలంగాణాకు వచ్చి ప్రచారం చేసారు. మరి ఈ లోక్‌సభ ఎన్నికలలోనైనా వారి ప్రచారం బిజెపికి ఉపయోగపడుతుందా

మంచినీటి ఎద్దడిని నివారించాలి: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

వేసవి తీవ్రతరం కాకుండానే తెలంగాణా రాష్ట్రంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. బోరుబావ్ఞలు, నేల బావ్ఞలు ఎండిపోయా యి. ప్రతి గ్రామానికి రక్షిత నీరు సరఫరా చేస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరడం లేదు.నల్గొండ జిల్లాలో అధిక శాతం గ్రామా లలో ప్రజలు ఇరవైమైళ్ల వరకు నడిచి వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. ప్రజలతోపాటు నోరులేని మూగజీవాలు కూడా నీరు దొరక్కఅష్టకష్టాలు పడుతున్నాయి.పాలేరు రిజర్వాయిర్‌ ద్వారా ఖమ్మం, నల్గొండ జిల్లాలకు మంచినీటి సరఫరా పథకానికి ఆదిలోనే హింసపాదు ఎదురయ్యింది. ఫ్లోరైడ్‌ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా సత్వరమే ప్రారంభించాలి. అంతేకాకుండా ప్రతి గ్రామానికి ఒక మినరల్‌ వాటర్‌ ప్లాంటు ఏర్పాటు చేసి ప్రజలకు తక్కువ ధరలకు సురక్షిత తాగునీరు అందించాలి.

ఉపాధి పనులు ఆపండి:-తూలుగు రమణారావు అక్కరాపల్లి

రాష్ట్రంలో రెండు,మూడు రోజులుగా ఎండ తీవ్రత ఎక్కు వగా ఉంటోంది. ప్రజలు వడదెబ్బకు గురవ్ఞతున్నారు. ముఖ్యంగా ఉపాధి పనులు చేసేవారు ఎండవేడిమిని తాళ లేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే వరకు ఉపాధి పనులను ఆపాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించి స్పందించాలి. కూలీలకు ప్రాణనష్టం జరగకుండా కాపాడాలి.

మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి: -జి.అశోక్‌,గోదూర్‌, జగిత్యాలజిల్లా

ప్రస్తుతం ఎంపిటిసి, జెడ్పిటిసిఎన్నికల్లో 50శాతం సీట్లు మహి ళలకు కేటాయించారు. ఇల్లాలు ఇంటిని ఎలా చక్కబెడుతుందో గ్రామాన్ని, మండలాన్ని సైతం అలాగే అన్ని రంగాల్లో ఆదర్శం గా తీర్చిదిద్దగలగాలి. గతంలో చాలా చోట్ల స్త్రీ పేరు మీద పురుషులే అధికారాన్ని చెలాయించి మహిళా ప్రజాప్రతినిధుల ను ఇంటికే పరిమితం చేశారు. కాని ఈసారి అలా జరగకూ డదు.రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్ల వల్ల అందిన పదవిని అలంకరించి నాయకత్వ లక్షణాలు సంపాదించుకోవాలి. అప్పు డే మహిళా రిజర్వేషన్ల స్ఫూర్తి నిలబడుతుంది. స్థానిక సమస్య ల పట్ల అవగాహన కలిగి స్వతంత్రంగా వ్యవహరించే అతివల వల్లనే గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సిద్ధిస్తుంది.

విద్యావిధానంలో మార్పురావాలి: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

పిల్లల వ్యక్తిత్వానికి బలమైన పునాది పడేది స్కూలు వయస్సు లోనే. అందుకే ఈ ఫార్మేటివ్‌ ఇయర్‌సలో పిల్లలకు క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, ప్రపంచ జ్ఞానం అలవరచ డంచాలా ముఖ్యం.ఆటపాటలు,తోటిపిల్లలతో కలిసి బృందంగా పనిచేయడం, లలిత కళలు, సృజనాత్మకత, శారీరక ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవడం వంటివి పిల్లల వ్యక్తిత్వం సమగ్రంగా రూపుదిద్దుకోవడానికి దోహదం చేస్తాయి. కాని దురదృష్టవశాత్తు నేటి కార్పొరేట్‌ విద్యావ్యాపార విధానంలో చదువ్ఞలు, ర్యాంకులు, పర్సంటేజీలే ముఖ్యమని, మిగతా అంశాలను పనికిరానివిగా భావించడం జరుగుతోంది. చదువ్ఞలో కాస్త అటు, ఇటుగా ఉన్నా తమదైన వ్యక్తిత్వంతో బాధ్యతగా, సొంతంగా తమదైన జీవితాన్ని తీర్చిదిద్దుకునేలా ఉండే విద్యావిధానం ఎంతో అవసరం.

నిరాశానిస్పృహల్లో నిరుద్యోగులు: ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

ఇకపై కేవలం 50 నిమిసాలలోనే రుణాలను ప్రస్తుతం అమలులో ఉన్నబ్యాంకింగ్‌ నిబంధనలను సరళీకృతం చేసి మంజూరు చేస్తామని గతనవంబరులో ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా ప్రకటించారు.అయితే నేటి వరకు ఆచరణ లోఉన్న ఇబ్బందులను పరిష్కరించని కారణంగా దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవ్ఞతు న్నాయి.దరఖాస్తు చేసిందిమొదలు రుణాలుమంజూరు చేసే వరకు బ్యాంకులు తీవ్రజాప్యం చేస్తున్నాయి. దీంతో నిరు ద్యోగులు నిరాశచెంది తమప్రయత్నాలను ఆపివేస్తున్నారు.