ప్రజావాక్కు

Voice of th People
Voice of th People

విషజ్వరాలతో విలవిల:-కాయలనాగేంద్ర, హైదరాబాద్‌

దోమ ఈ పేరు వినగానే ఎంతటి వారైనా హడలిపోవాల్సిందే. దీనిని చూడగానే ప్రజలకు ఒంటిలో వణుకుపుట్టి, చలిజ్వ రంతో ముచ్చెమటలు పడతాయి. ఇది చిన్న కీటకమే అయినా, దీన్ని తేలికగా తీసుకోవడానికి వీలులేదు.ఎన్నో వ్యాధులకు గురి చేసి, వందలాదిమందిని ఆస్పత్రుల పాలు చేస్తోంది. అంతేకాకుండా ఎంతో మంది రోగుల మృతికి కారణమయ్యేది కూడా ఈ చిన్న కీటకం వల్లే. దోమకాటుకు జ్వరాలు విస్తరించి ప్రజల ప్రాణాలు గాలిలో పెట్టిన దీపాల్లా మారుతున్నాయి. కనీవిని ఎరుగని రీతిలో కొత్త కొత్త రోగాలు పుట్టుకొచ్చి మానవజాతి తల్లడిల్లిపోతోంది. మురికివాడల్లో పలుకాలనీల్లో పారిశుద్ధ్యం పడకేయడంతో దోమలువిజృంభిస్తున్నాయి. దోమ ల బారిన పడేవారు ఎక్కువగా పిల్లలు, వృద్ధులు, మహిళలే ఉంటున్నారు. కీటకం చిన్నదే అని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని, తాగునీటి విష యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిదానికి ప్రభుత్వం మీద ఆధారపడకుండా మన పరిసరాలను మనమే బాగు చేసుకోవడం మన బాధ్యత.

గుమస్తాలకు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి: -ఎం.హనుమంతరావు, నర్సీపట్నం, విశాఖజిల్లా

న్యాయవాదులకు సంక్షేమనిధి నిమిత్తంఆంధ్రప్రదేశ్‌రాష్ట్ర ప్రభు త్వం100కోట్ల రూపాయలు మంజూరు చేయడం హర్షణీయం. ఆ విధంగానే గుమస్తాలకు కూడా ఎంతో కొంత సంక్షేమ నిధి, పెన్షన్‌, గృహ నిర్మాణ పథకం వగైరాలు మంజూరు చేయ గలిగితే చాలా సముచితంగా ఉంటుంది. ఇందుకు ముఖ్య మంత్రి వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలి.

మూఢనమ్మకాలు పెంచుతున్న సినిమాలు:యస్‌.పి. మల్లికార్జున సాగర్‌, నాగర్‌కర్నూలు జిల్లా

చేతబడి, బాణమతి అనేవి లేవు అని, కొందరు తమస్వార్థం కోసం ప్రజలను మోసం చేస్తున్నారని అటు ప్రభుత్వాలు, ఇటు పోలీసు అధికారులు టీవీలలో పత్రికలలో, ప్రసారమాధ్యమా లలో విస్తృత ప్రచారం చేస్తుంటారు. కానీ తెలుగు సినిమాల లో మాత్రం చేతబడి, బాణమతి, దెయ్యాలున్నాయని ప్రచా రం చేస్తూ సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తు న్నాయి. కానీ విషయంలో సెన్సార్‌ బోర్డు అధికారులు ఏమి చేస్తున్నారో తెలియదు. కానీ సినిమాల్లో దెయ్యాలు ఉన్నాయి అంటువాటి గురించి చేస్తున్న ప్రచారాలను మాత్రం సినిమాల నుండి తొలగించాలి. తెలుగు సినిమాలను సెన్సార్‌ చేసేందు కు తెలంగాణలో సెన్సార్‌ బోర్డు ఉన్నదా? లేదా?

సంక్షేమంతో సంక్షోభం!: -గరిమెళ్ల రామకృష్ణ, ఏలూరు, ప.గోజిల్లా

రాష్ట్రంలో రెవెన్యూలోటు ఆందోళనకరంగా ఉన్నట్లు నీతి ఆయో గ్‌ వైస్‌ ఛైర్మన్‌ అంటున్నారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా వేతనాలు, పింఛనులు చెల్లించడానికే సతమతమవ్ఞతు న్నట్లు గత కొద్ది నెలలుగా వింటున్నాం. అసలు ఈ విపత్కర దుస్థితి ఎందుకు వచ్చింది? పాలకులు ఓటు బ్యాంకు రాజ కీయాలతో పన్నుల రూపంలో వస్తున్న ఆదాయాన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కాకుండా పప్పుబెల్లాల్లా అర్థరహిత హామీలు ఇచ్చి, వాటిని నెరవేర్చడానికే గారిడీలు చేస్తున్నారు. ఆదాయం పెరగకుండా ఖర్చు పెంచుకుంటూపోతే లోటు ఖచ్చితంగా పెరుగుతుంది.ఇందుకు ఏ ఆర్థికశాస్త్రమో చదవనవసరం లేదు. ఏ గృహిణిని అడిగినా చెబుతుంది. పాలకులు బేషజాలకు పోకుండా అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టిపెడితేనే రాష్ట్రం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతుంది.

కించపరుస్తున్న వేషధారణలు:-పారేపల్లి సత్యనారాయణ, దేవ్ఞలపల్లి, ప.గోజిల్లా

చాలాకాలం నుంచి బాపూ వేషధారణతో బిక్షాటనే వృత్తిగా చేసుకొని కొంతమంది తిరునాళ్లలో దేవాలయ పరిసరాలలో జీవిస్తున్నారు. శరీరంనిండా వెండిరంగును తలపించే రసాయన రంగును పులుముకొని చేతిలో కర్రపట్టుకుని కదలకుండా నిలబడే ఉంటారు. అలాంటి బాపూజీ వేషధారణని చూసి నేటితరం పిలల్లకి మహనీయుల పట్ల గౌరవం పోతుంది. ఎన్నో త్యాగాలు చేసి మహనీయులుగా చరిత్రలో చిరస్థాయిగా నిలచిన వారి వేషధారణ అడుక్కోవడానికి ఉపయోగించడం చాలా బాధాకరం. ఆ రసాయన రంగులు వారి శరీరానికి హాని చేస్తుందని, జాతిపితను అగౌరవపరచినట్టేనని, అది తప్పు అని తెలియకపోవచ్చు. కావ్ఞన వారికి పోలీసువారు కౌన్సిలింగ్‌ ఇచ్చి అలాంటి వేషాలను మాన్పించాలి.

కక్ష సాధింపు చర్యలో భాగమేనా?:-ఎం.శ్రీనివాస్‌,హైదరాబాద్‌

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌పై 1984 నాటి కేసును రీ ఒపెన్‌ చేసారు. ఆ చేసేదేదో ఆయన ప్రతిపక్షనాయకుడిగా ఉన్నప్పుడే చేస్తే బాగుండేది. ఇన్ని సంవత్సరాల పాటు మాట్లా డకుండా ఊరుకుని మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో కి వచ్చిన కమల్‌నాథ్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఆయనపై ఎప్ప టికేసో తిరగతోడటం వల్ల ప్రజలలో అనుమానాలు తలెత్తుతు న్నాయి. కమల్‌నాథ్‌ని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించ డానికి, కాంగ్రెస్‌ పార్టీని అస్థిరపరచడానికి 1984 నాటి కేసుని తెరమీదకి తీసుకువచ్చిందని ప్రజలు అనుకుంటున్నారు.