ప్రజావాక్కు: సమస్యలపై ప్రజా గళం

Voice of th People
Voice of th People

ఫలించని సదస్సులక్ష్యం:-సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

పుడమి పరిరక్షణకు ప్రపంచదేశాలకు దిక్సుచిలా మారుతుం దని అందరూ ఆశించిన కాప్‌-25 సదస్సు చివరకు ఉసూరు మనిపించింది. కర్బనఉద్గారాల తగ్గింపుదిశగా స్పష్టమైన మార్గ దర్శనం చేయకుండా, విధివిధానాలు, టార్గెట్లు విధించకుం డానే పైపై ప్రకటనలతో ముగిసిపోవడం పర్యావరణ ప్రేమి కులకు ఆశనిపాతంలాంటిది.భూతాపం పెరుగుదలను నియం త్రించి, మానవాళి భవిష్యత్తును పదిలం చేయడమే లక్ష్యంగా 2015లో పారిస్‌ సదస్సులో ప్రపంచదేశాల మధ్య కుదిరిన ఒప్పందానికి తుదిరూపునివ్వలాని కాప్‌-25 సదస్సు ఇస్తుం దన్న ఆశలకు అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ వంటి అగ్ర రాజ్యాలుగండికొట్టి తూతూమంత్రం చందాన సదస్సును కాని వ్వడం బాధ్యతారాహిత్యం.

సమస్యల వలయంలో ప్రభుత్వ పాఠశాలలు:-సిి.ప్రతాప్‌,శ్రీకాకుళం

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల ఉన్నతీకరణ కోసం నాడు-నేడు అన్న కార్యక్రమంచేపట్టడం ముదావహం. రాష్ట్రం లో 90శాతం పాఠశాలలు సమస్యల వలయంలో కొట్టుమిటా ్టడుతున్నాయి.బడులకు ప్రహరీగోడలు లేవ్ఞ.మరుగుదొడ్లు, తాగు నీటి సౌకర్యాలు, విద్యార్థులు కూర్చునేందుకు బెంచీలు ఉండవ్ఞ. ఫ్యాన్లు, లైట్లు ఉన్నా పనిచేయవ్ఞ. రాత్రిళ్లు పాఠశాల లు పలు అసాంఘిక కార్యకలాపాలకు వేదికలవ్ఞతున్నాయి. లక్షలాది రూపాయలు ఖరీదు చేసే పాఠశాలల ఆస్తులు తరచు గా చోరీకి, ధ్వంసానికి గురవ్ఞతున్నాయి. చాలా పాఠశాలల్లో సిబ్బంది, ఉపాధ్యాయులు లేకపోవడమో లేక సమయపాలన సాగించకపోవడమో జరుగుతోంది.

వాయిదా పడ్డ ఉరిశిక్ష:-బి.ఎన్‌.సత్యనారాయణ, హైదరాబాద్‌


న్యాయం దిక్కుతోచక రోధిస్తోంది. దాని గుర్తింపుపై, గౌర వంపై, ఉనికిపై దానికే నమ్మకం సడలుతోంది. ఏడేళ్ల క్రితం జరిగిన అతి కిరాతకమైన, రాక్షసమైన, నిర్భయ హ త్యాచార ఉదంతంలో నేరస్తులైన మృగాళ్లలో నలుగురికి రెండు సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు ధర్మాసనం ఉరి శిక్షలు విధిస్తూ తీర్పును వెలువరిస్తే ఇంతవరకు ఆ తీర్పు అమలుకాకుండా కాలాన్ని దొర్లించుకు వచ్చిన చట్టాలను తలచుకొని న్యాయం ఢీలా పడిపోయింది. అయితే ఇప్పు డుపటియాలా ఈనెల 22న ఉరితీయాలని వారెంట్‌ జారీ చేయడంతోన్యాయం శ్వాస తీసుకోవడం ప్రారంభించింది. కానీ మరలా ఇప్పుడు ఆ శిక్షలు వాయిదాపడ్డాయి.

పెరుగుతున్న అవినీతి:-ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

దేశంలో ప్రభుత్వ విభాగాలలో అవినీతి విశృంఖలంగా పెరిగి పోతుంటే అవినీతి నిరోధకశాఖ, సిబిఐ, కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు ఏం చేస్తున్నాయని సుప్రీంకోర్టు ప్రశ్నించడం సబబుగా ఉంది. జాతీయ నేరగణాంకాల బ్యూరో ప్రకారం 2015-19 మధ్యకాలంలో దేశంలో నమోదు అయిన అవినీతి కేసులలో 24శాతంవృద్ధి పెరగడం,రెవెన్యూతోపాటు పురపాలక, వైద్యం, ఇంధనం, పంచాయతీరాజ్‌, న్యాయ, విద్య, నీటి పారుదల, రవాణా లాంటి దాదాపు అన్ని విభాగాలు ఉండడం చూస్తుంటే అవినీతి జాఢ్యం లేని ప్రభుత్వ విభాగం ఒక్కటి కూడా లేద నిపిస్తోంది.అవినీతి కేసులలో తెలుగురాష్ట్రాలు 4,5 స్థానాలలో ఉండడం చూస్తుంటే క్షేత్రస్థాయిలో అవినీతి విషవృక్షం ఎలా పాతుకుపోయిందోఇట్టేఅర్థమవ్ఞతోంది.

కుక్కకాటుకు మందుల కొరత: -షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

సందుగొందులు అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ కుక్క లు విస్తారంగా తిరుగుతున్నాయి. కుక్కజాతి పెరగకుండా నిరో ధించడానికి ప్రభుత్వం ప్రయత్నించకపోవడంతో అవి మరింత వృద్ధిచెందుతున్నాయి. పాదచారులు, వాహనచోదకులను పసి పిల్లలు వృద్ధులనే తేడాలేకుండా కరవడంతో ఆస్పత్రిపాలవ్ఞతు న్నారు. కుక్క, పిల్లి, పందివంటి ఏ జంతువ్ఞ కరిచినా ఇరవై నాలుగు గంటల్లో బాధితులకు యాంటి రేబిస్‌ వ్యాక్సిన్స్‌ టీకా చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లో గత ఆరు నెలలుగా ఏ ప్రభుత్వ ఆస్ప త్రుల్లోనూ, బయట మందుల దుకాణాల్లో కూడా ఈ వ్యాక్సిన్‌ దొరకపోవడంతో ప్రతినెలా రాష్ట్రంలో వందలాది మంది చనిపో తున్నారు.ప్రభుత్వ ఆస్పత్రుల్లో విరివిగా టీకా మందులు అందు బాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

కార్యాలయాల నిర్మాణంలో జాప్యం: -యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణంలో జాప్యం జరుగుతోం ది. దీనివల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవ్ఞతున్నా రు. ప్రభుత్వ కార్యాలయాలకు పని నిమిత్తం రావడానికి ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఏ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియక సతమతమవ్ఞతున్నారు. నిర్మాణం జరుగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను సంబంధిత అధికా రులు పర్యవేక్షించి వాటికి సంబంధించిన పనులు త్వరగా అమలు అయ్యేటట్లు చూడాలి.ఇది ప్రభుత్వ బాధ్యత. ప్రజ ల సమస్యను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/