ప్రజావాక్కు

Letters to The Editor
Letters to The Editor

అప్పుల భారం పెంచవద్దు:-కంభంపాటికోటేశ్వరరావు, మురళీనగర్‌, విశాఖపట్నం

రాష్ట్ర ప్రభుత్వం లెక్కకు మించి అప్పులు చేయడం రాష్ట్ర భవి ష్యత్తుకు మంచిదికాదు. ఇప్పటికే 28వేల కోట్ల రూపాయలకు పైగా అప్పుచేసి,మరలా మరో15వేల కోట్ల రూపాయల అప్పు కోసం కేంద్రాన్ని అనుమతి కోరటం సరికాదు. అసలు అప్పు ఎందుకు చేస్తున్నారు. ఆ అప్పు తీర్చే మార్గం ఏది? అభివృద్ధి కార్యక్రమాలను పక్కనపడేసి ప్రజాకర్షక పథకాలకు విచ్చ లవిడిగా విరజిమ్మటం, అందులోనూ అనేక అవకతవకలు. ఆదాయం పెరగకుండా అప్పులు చేయడం ఎంతవరకు సబబు పాలకులు ఆలోచించాలి.రాష్ట్రానికిరావలసిన బకాయిలు వసూ లు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. రాష్ట్ర ఆర్థికపరి స్థితిపై ఆర్థిక మంత్రి ఓ శ్వేతపత్రం విడుదల చేయాలి.

పెంచిన ఛార్జీలు తగ్గించాలి: -యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం

మోడీ సర్కారు విపరీతంగా పెంచిన ఉల్లి ధరలు, మొబైల్‌ ఛార్జీలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు జగన్‌ సర్కార్‌ ఆర్టీసీ ఛార్జీలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరగొట్టేందుకు సిద్ధమైం ది. ఇప్పటికే రైల్వే ఛార్జీలకు మూడురెట్లున్న ఆర్టీసీ ఛార్జీలు మరో 20 శాతం పెంచి ప్రయాణికులను బస్సు ప్రయాణానికి దూరం చేస్తుంది. రైలు మార్గం ఉన్న గ్రామాలకు నిలబడడాని కి స్థలం లేకపోయినా ప్రమాదమని తెలిసినా ఊచలతో వేలా డుతూ ప్రయాణం చేస్తున్నారే తప్ప ఖాళీగా వెళ్తున్న బస్సు ఎక్కడానికి ఎవరూ సుముఖత చూపడం లేదు. ఫలితంగా రాష్ట్రరోడ్డు రవాణాసంస్థ అప్పుల్లోకూరుకుపోతుంది. ప్రస్తుతం పెంపు ఛార్జీల వలన ప్రయాణీకులకు భారమవటంతో మరింత నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదముంది. ప్రయాణీకులకు అందుబాటులో ఉండే విధంగా టిక్కెట్‌ ధరలుంటే లాభాల బాట పట్టగలదు. ఆర్టీసీ ఛార్జీల పెంపు సరికాదు.

మోయలేని ప్రయాణభారం:-గరిమెళ్ల భారతీ దేవి, ఏలూరు, ప.గోజిల్లా

రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌.టి.సి ఛార్జీలు పెంచడం సామాన్యులపై మూలిగే నక్కపై తాటికాయపడిన చందంగా ఉంది. ఇప్పుడు అర్థాంతరంగా ఛార్జీలు పెంచవలసిన అవసరం ఏమిటో ప్రజల కు అర్థంకావడం లేదు.పాదయాత్రలలో ప్రజలపై భారం వేయ బోమనిచెప్పి,ఇప్పుడుఅధికారంలోకి వచ్చినతర్వాత వడ్డింపులు మొదలెట్టారు.గత ప్రభుత్వంనష్టాల ఊబిలో ఉన్న ఆర్‌.టి.సిని లాభాలబాట పట్టిస్తే ప్రస్తుత పాలకులు మరలా అనాలోచిత, బాధ్యతారాహిత్య చర్యలతో సంస్థను నష్టాలలోకి నెట్టారు. మోసపూరిత విధానాలతో ప్రజాగ్రహానికి గురికాక తప్పదు.

సిబిఐలో రాజకీయ జోక్యం ఉండకూడదు: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

ప్రభుత్వపరంగా రాజకీయపరంగా కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ వ్యవహారాలలో ఎవరూ జోక్యం చేసుకోకూడదని 1997 నాటి హవాలా కేసులో సుప్రీంకోర్టు కఠినమైనఆదేశాలుజారీ చేసింది. పలు సందర్భాలలో పార్లమెంటరీ స్థాయి సంఘాలు కూడా ఈ అంశంపై నివేదికలు ఇచ్చాయి. ఉగ్రవాదం, హైటెక్‌ నేరాలు పేట్రేగుతున్న నేటికాలంలో సిబిఐ సమర్థవంతంగా పనిచేయా లంటే బయటివారి జోక్యం ఉండకూడదన్నది సుప్రీంకోర్టు ఆదే శం.అయితే సిబిఐ కేంద్రంలో అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సిబిఐ స్థాపనకు ప్రభుత్వంజారీ చేసిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని గుహ వటి హైకోర్టు తీర్పునివ్వటంతో కొత్త సమస్యలకు తావిచ్చినట్ల యింది. భారత్‌లో ఉగ్రవాదం, గూఢచర్యం, నల్లధనం వంటి ఫెడరల్‌ నేరాలకు సిబిఐను పూర్తిగా బాధ్యతాపరంగా చేసి విశేష అధికారులు ఇవ్వాలి.

మాట నిలబెట్టుకోలేని కేంద్రం:-ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌

ఎ.పి.కి ప్రత్యేక హోదా ఇస్తామని బిజెపి నాయకులు వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చాక హోదా ఇవ్వలేనని ప్యాకేజి ఇస్తామని ఎ.పి ఏమడిగినా కాదనకుండా చేస్తామని అన్నారు. అయితే ఏదీ చేయకుండా ఏమీ ఇవ్వకుండా చివరికి ఎపికి మొండిచెయ్యి చూపించారు. మహారాష్ట్రలో శివసేన విషయంలోను వారు ఇలానే చేశారు. ముఖ్యమంత్రి పదవి తప్ప ఆ పార్టీకి ఎన్ని పదవ్ఞలనైనా ఇస్తామన్నారు. ఆ ఒక్కటీ మాత్రం ఇవ్వలేకపోతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక నాడు తెలుగు దేశానికి నేడు శివసేనకు దూరమయ్యారు.

మానసిక వికాసానికి క్రీడలు: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

విద్యార్థులలో మానసిక వికాసానికి క్రీడలు ఎంతో అవసరమ న్నది నిపుణులు చెబుతున్నమాట.అయితే కార్పొరేట్‌ సంస్కృతి విద్యారంగంలో వేళ్లూనుకున్న తరువాత చదువులలో మార్కు లు, పర్సంటేజీలు,చదువ్ఞలు బట్టీపెట్టేవిధానం పెరిగి ఆటపాట లకు స్థానం లేకుండా పోయింది. ఫలితంగా యువత శారీరక, మానసిక దౌర్భాల్యానికి గురవ్ఞతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలతోపాటు ప్రభు త్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై దృష్టి సారించాల్సిందిగా రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలివ్వడం ముదావహం.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/