ప్రజావాక్కు: సమస్యలపై గళం

Voice of the People
Voice of the People

ప్లాస్టిక్‌పై నిషేధం అమలు:- సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

ప్లాస్టిక్‌పై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం అమలులో పెట్టింది. అమెరికా,చైనాలలో ప్లాస్టిక్‌ వినియోగం ఏటాసగటున 10840 కిలోలుగా వ్ఞంటే భారత్‌లో 10 కిలోలు మాత్రమే అయినా మనదేశంలో ప్లాస్టిక్‌ వాడకం కంటే విచ్చలవిడిగా పారేయడం వలనే సమస్యలు ఎక్కువగా ఉత్పన్నం అవ్ఞతున్నాయి. అక్కడి వర్షాల నిర్వహణ ప్రణాళికను పటిష్టంగా అమలు చేస్తున్నా రు.ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలపై పరిశోధనలు మందగమనం లో సాగుతున్నాయి. బయోడిగ్రేడబుల్‌ ప్లాస్టిక్‌ను విరివిగా ప్రోత్సహించాలి.ప్లాస్టిక్‌ అనర్థాలపై విద్యార్థులలో, గ్రామాలలో అవగాహన ముమ్మరం చేయాలి. వ్యర్థాలను వేరు చేయడంలో ప్రజలలో తీవ్ర అలక్ష్యం ఉంది. అనేక రాష్ట్రాలు కొన్ని రకాలైన ప్లాస్టిక్‌ను నిషేధించినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి.

విపత్తుల నివారణకు అవగాహన:-కె.రామకృష్ణ, తెనాలి, గుంటూరుజిల్లా

ఈ భూమి మీద 30 శాతం నేల అయితే 70 శాతం నీరు ఉంటుంది. నీటి ఆవాసాలైన సముద్రాలలో కూడా విపత్తులు సంభవిస్తాయి. సాధారణంగా ఈ సునామీలు సముద్రాలలో వస్తాయి. సముద్రం లేదా పెద్దపెద్ద సరస్సుల అంతర్భాగంలో భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాల వలన సునామీలు ఏర్పడుతాయి. 2030 నాటికి ప్రపంచ జనాభాలో 50 శాతం మంది తీర ప్రాంతాల్లోని ప్రజలు వరదలు, తుపానులు, సునా మీలకు గురైన తీరప్రాంతాల్లో నివసిస్తారని అంచనా. భవిష్య త్తులోసునామీ ప్రమాదానికి వ్యతిరేకంగా ప్రజలను రక్షించడా నికి,వారిఆస్తులను రక్షించడానికి సునామీపైనఅందరికీ ముఖ్యం గా తీర ప్రాంతంలో నివసించేవారికి అవగాహన కల్పించాలి.

ఆర్టీఐ చట్టం ఆన్‌లైన్‌ కావాలి:-జి.వి.సాయికుమార్‌గుంత, పెనుగొలను, కృష్ణాజిల్లా

రాష్ట్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుల స్వీకరణకు ఆన్‌లైన్‌ పోర్టల్‌ ఏర్పాటు చేయాలి. ఆన్‌లైన్‌ సదుపాయం లేకపోవడం వలన పారదర్శకత లోపించడంతో పాటు దరఖాస్తుకు కనీసం రూ.100 ఖర్చు అవ్ఞతుంది. దీంతో చట్టం వినియోగానికి పూర్తిగా నోచుకోలేకపోతుంది. కేంద్రప్రభుత్వ శాఖలకు సంబంధించి ఆన్‌లైన్‌ అవకాశం ఉండ టంతో దరఖాస్తు ఏ దశలో ఉన్నది మొదలగు వివరాలు వాస్తవ సమయంలో తెలుసుకునేందుకు వీలు ఉంది. ఇప్పటికే మహారాష్ట్రలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సదుపాయాన్ని తీసుకురావాలి.

అమరావతినే రాజధానిగా కొనసాగించాలి:-జి.అంజనేయులు, విశాఖపట్నం

గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయంటూ ప్రస్తుత ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని నిలిపివేయడం తగదు. అవినీతి జరిగి ఉంటే విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలి. అమరావతిలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భవన సముదాయానికి కోట్లరూపాయలు ఖర్చుచేశారు. అంతేకాకుండా ఎందరో రైతులు భూములు ఇచ్చారు. ఇప్పుడు రాజధానిని మార్చితేనమ్మి భూములిచ్చిన రైతన్నలు కన్నీరు పెట్టడం రాష్ట్రా నికి మంచిదికాదు. రాష్ట్ర ఖజానాపై భారం తగ్గించడానికిరివర్స్‌ టెండర్స్‌ వేసిన ప్రభుత్వం, వెంటనే అమరావతి నిర్మాణం చేపట్టి నిర్మాణంలో ఉన్న భవనాలను అందుబాటులోకి తేవాలి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ప్రజల కోరిక.

యువకుల చేతుల్లో దేశభవిష్యత్తు: -షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

ప్రస్తుతం యువత చాలావరకు తమ జీవితానికి గమ్యం లేకుండా తిరుగుతున్నారు. జల్సాలకు, షికార్లకు బాగా అలవాటుపడిపోతున్నారు. యువత ఇలాగే తిరిగితే పెడదారిన పెట్టడానికి అవకాశం ఉంది. యువతపై తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో దృష్టిపెట్టవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం యువ కుల కోసం మానసిక విశ్లేషకులతో ప్రేరణ తరగతులు నిర్వ హించాలి.అలాగే యువకులు స్వయం ఉపాధితో జీవించే విధం గాప్రభుత్వం బ్యాంకులద్వారా రుణాలు మంజూరు చేయిం చాలి. ఉజ్వల దేశభవిష్యత్తు యువకుల చేతుల్లో ఉందికాబట్టి వారు సన్మార్గంలో నడిస్తే బాగుంటుంది.

మాతృభాషను కాపాడుకుందాం:-పి.రాజశేఖర్‌, శ్రీకాకుళం

కేంద్ర కార్పొరేట్‌ జీవితంతోపాటు ఇంకొన్ని రంగాల్లో స్థిరపడా లంటే ఇంగ్లీషు ముఖ్యమే కానీ తెలుగు బిడ్డలమైన మనం మన మాతృభాషపై గౌరవం చూపాలి. కానీ నేడు సమాజం ఇప్పటికే అమ్మ,నాన్న అనే పదాల నుండి మమ్మీ, డాడీ అనేవరకు ఎప్పుడోపోయింది. మనసంస్కృతి, సంప్రదా యాలను అసలు దాదాపు పట్టించుకోవడం లేదు. గత రెండు రోజుల క్రితంరాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జి.ఓ81 ఏమి చెప్తుందంటే రానున్న విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠ శాలల్లో 1-8వ తరగతి వరకు ఇంగ్లీష్‌ బోధనలోనే విద్య అనేది అందాలి అని. అందరికీ మంచి విద్యకావాలి అనేది ప్రతి ఒక్కరి ఆశయం. ఈ జివో వలన విద్యార్థులకు ఇప్పటివరకు ఉన్న ఐచ్చిక అవకాశం కూడా లేదు. కాబట్టి అధికారులు ఈ జి.వోను రద్దు చేయాలి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/