ప్రజావాక్కు

సామాజిక సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

వంటగ్యాస్‌ ధరలను తగ్గించాలి:-ఎం.కనకదుర్గ, తెనాలి, గుంటూరుజిల్లా

కరోనా వ్యాప్తి ముందు కాస్త కుదురుగా ఉన్న డీజిల్‌, పెట్రోల్‌, వంట గ్యాస్‌ ధరలకు హఠాత్తుగా రెక్కలు వచ్చాయి. వంటగ్యాస్‌ ధరలు గత రెండు నెలలో రెండు వందలు పెరగడంతో సామా న్యులపై పెను ఆర్థికభారంపడింది.

పెట్రోల్‌, డీజిల్‌ధరలు ఇప్ప టికి లీటర్‌ ఒక్కింటికి పన్నెండు రూపాయల దాకా పెరిగింది. ప

్రధానమంత్రి ఉజ్వల్‌యోజన పథకంకింద తెల్లకార్డు దారులందరికీ వంటగ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చినా ఆకాశానంటుతున్న ధరల కారణంగా అధికశాతంగ్యాస్‌ సిలిండర్లు కొనుక్కోలేకపోతున్నారు.

సబ్సిడీని ధనవంతులకే రద్దు చేసిన ప్రభుత్వం చాప కిందనీరులా వంటగ్యాస్‌ ధరలను పెంచుకుంటూపోతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడం వలన దాదాపుగా అన్ని నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానంటుతున్నాయి.

పేద, మధ్యతరగతి ప్రజానీకంపై పడుతున్న పెను ఆర్థికభారాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రప్రభుత్వం తక్షణం పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలను తగ్గించాలి.

ఉచిత కరోనా వైద్యం అందించాలి: -సిి.ప్రతాప్‌, శ్రీకాకుళం

ఎపియస్‌ ఆర్టీసి ఉద్యోగులను కరోనా భయం నుండి వెసులు బాటు కల్పించేందుకు కరోనా లక్షణాలు ఉన్న ఆర్టీసి ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆస్పత్రులలో అయ్యేఖర్చును భరించేందుకు ఆర్టీసి అంగీకరించడం హర్షణీయం.

ఎన్నిభద్రతా చర్యలు తీసుకున్నా ఇప్పటికే 200 మంది ఉద్యోగులు కరోనాబారిన పడడంతో ఆ సంస్థ ఉద్యోగులలో భయంనెలకొని విధులకే హజరుకావడానికి భయ పడుతున్నారు.

ఈస్ఫూర్తిని తీసుకొని అన్ని ప్రభుత్వ రంగసంస్థ లతోపాటు ప్రైవేట్‌ సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు కూడా ఈ విధమైన వెసులుబాటు కల్పించాలి.

అసంఘటిత రంగాలలోని కార్మికులకు కూడా ఉచిత కరోనా వైద్యం అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలి.

వైద్యవిధానాన్ని మెరుగుపరచాలి: -ఎన్‌.శివకుమార్‌, నల్గొండ

ప్రతిచిన్న వ్యాధికి విచ్చలవిడిగా ఔషధాలను వాడే భారతీయ వైద్యవిధానంపై అంతర్జాతీయ వైద్యవిధాన మండలి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది.

ఒకప్పుడు తీవ్రమైన సందర్భంలోనే మందులు వాడేవారు. కాగా ప్రస్తుతం జలుబు, ఒళ్లునొప్పులు లాంటి చిన్నపాటి రుగ్మతలకు కూడా యాంటిబయోటిక్స్‌ వాడ డం మంచిదికాదని హెచ్చరిస్తున్నారు.

ఇందువలన శరీరం సత్వసిద్ధంగా రోగాల తో పోరాడే శక్తికోల్పోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పారిశుధ్య నిర్వహణలో లోపాలు:-సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

తెలంగాణరాష్ట్రంలో పట్టణ,గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ్యం, పరిశుభ్రత మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సామూ హిక మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రణాళిక ఆమోదించడం హర్ష ణీయం.

రాష్ట్రంలో హైదరాబాద్‌మినహా 139 మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు నాలుగువేలకుపైగా టాయిలెట్ల నిర్మాణం ఆగస్టు 15 నాటికి పూర్తయ్యేలా పనులు ప్రారంభించడం ముదావహం.

ఇదే తరహాలో రాష్ట్రంలో రెండువేల గ్రామాలలో కూడా పనులుయుద్ధప్రాతిపదికపై పూర్తి చేయాలి.

25 శాతం మహిళల కు ప్రత్యకంగా నిర్మించడం దేశంలోనే ప్రధానం. హైదరాబాద్‌ లో మాదిరిగా పబ్లిక్‌,ప్రైవేట్‌ భాగస్వామ్యంలో నిర్మించిన మరు గుదొడ్లలోనిర్వహణ సక్రమంగా వ్ఞండేలా చర్యలు తీసుకోవాలి.

అక్టోబరు రెండు నాటికల్లా మొత్తం రాష్ట్రం స్వచ్ఛరాష్ట్రంగా రూపొందేలా ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకోవడం హర్షణీయం.

తగ్గుతున్న మహిళా జనాభా: -కె.నారాయణ, హైదరాబాద్‌

భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో బాలురు, బాలికల నిష్పత్తిలో చాలా అంతరం ఉంది. ఆడశిశువ్ఞల పట్ల విచక్షణ పెరిగిపోతోంది.

దీంతో ఏటా 50 లక్షల మందిని అబార్షన్ల రూపంలో కోల్పోతున్నామని జాతీయ మహిళా శిశుసంక్షేమ సంస్థ వార్షిక నివేదికలో తేలింది. మగపిల్లలే కావాలన్న తపన దీనికంతటికి ముఖ్యకారణం.

లింగనిర్ధారణ పరీక్షలు సులువ్ఞగా లభిస్తుండ డం, నిబంధనలకు వ్యతిరేకంగా అబార్షన్లు చేయడం, ఆడపిల్ల లకు పౌష్టికాహారం అందించలేకపోవడం వలస స్త్రీ జనాభా తగ్గిపోతోంది.

ఈఅవాంఛనీయ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభు త్వం చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఆడపిల్లలకు మరిన్నిప్రోత్సా హకాలు ప్రకటించాలి

మద్యం మత్తులో యువత: -షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

ఈ మధ్యకాలంలో యువత జల్సాలకు బానిసలవుతున్నారు. సందర్భం ఏదైనా పార్టీలు చేసుకోవడం పరిపాటి అయింది. నేటియువత ప్రవర్తనపై పెద్దలు విస్మయానికి గురవుతున్నారు.

ఎక్కువగా మద్యం సేవించడం, మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేయడం వల్ల ప్రమాదాలకు గురవ్ఞతున్నారు.ఎక్కడైతే యువకులు ఎక్కువ మంది నిలబడి ఉంటారో వారిపై పోలీసు నిఘా పెట్టాలి.

మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి. ప్రమాదాలు జరగకుండా ముందే ఆరికడితే విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/