ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the People
Voice of the People

చైనా ఆధిపత్య ధోరణి:-టి.సాంబశివరావు, నరసరావుపేట, గుంటూరు జిల్లా

భారత్‌ -చైనా సైనికుల మధ్య తాజాగా జరిగిన ఘర్షణల్లో 21 మంది భారత వీర సైనికులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్ట కరం. ఏ దేశ సైనికులు బలిదానమైనా ఆ దేశానికి బాధా కరమే. యుద్ధాలు,కోర్టు కేసులువంటివి.

గత ప్రపంచ యుద్ధాల్లో తీవ్రంగా దెబ్బతిన్న అనుభవంతో జపాన్‌, జర్మనీ, తర తరాలుగా పరస్ప రం కలహించుకున్నా బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాలు శాంతి మంత్రం జపిస్తూ సోదరభావంతో వెలుగు తుంటే ఆ దుష్ప్రభావం పడని అమెరికా చైనాలు తాము సాధించిన ఆర్థికాభివృద్ధిలో ఆధిపత్యధోరణి ప్రదర్శిస్తున్నాయి.

ఇది ఆధునికయుగం. కర్రలు, కత్తులతో పోరాడే ఆటవిక, మధ్యయుగాలు గతించాయి. గత ఓటమి నుండి భారత్‌ గుణ పాఠం నేర్చుకొన్నది.

హోమియో ఆసుపత్రులు: – కూన శశిధర్‌, ద్వారకానగర్‌, విశాఖ

ప్రభుత్వం హోమియె ఆసుపత్రులను మందులు ఇస్తూ ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రజలకి ఇంగ్లీషు వైద్యమంటే మక్కువ. అయితే హోమి యో వైద్యం కూడా చాలా గొప్పది. అయితే ప్రైవేటు హో మియో వైద్యం వేలాది రూపాయలతో కూడుకున్నది.

కనుక ప్రతి జిల్లాలోను హోమియో వైద్య ఆసుపత్రులుం డాలి. అలాగే సంపన్నులు ప్రభుత్వ ఆసుపత్రకులకు వెళ్ల గూడదు. ప్రభుత్వ ఆసుపత్రులు కేవలం పేదవారికేనని గుర్తించుకోవాలి.

బిజెపి రాజకీయాలు:- ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌

రాష్ట్రాలలో సంకీర్ణ లేదా బొటాబొటి మెజార్టి గల ప్రభు త్వాలు సజావ్ఞగా పాలన చేస్తు ప్రజాభిమానం పొందు తుంటే బిజెపి నాయకులు చూస్తు ఊరుకోరు చేతులు ముడుచుకుని కూర్చోరు అటువంటి ప్రభుత్వాలను పడ గొట్టి తీరుతారు.

వీరు అంతటితో ఊరకోరు తమ పాల నలో ఉన్న రాష్ట్రాలలో ప్రతిపక్షలకు నిలువ నీడ లేకుండా చేసే ప్రయత్నాలకు కూడా పూనుకుంటారు.

రాజ్యసభ ఎన్నికలు జరిగే ముందు గుజరాత్‌లో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్‌.ఎల్‌.ఎల కొనుగోళ్లుకు పాల్పడటం. బీహర్‌లో ర్యాలీ నిర్వహించి రాజకీయాలు మాట్లాడటం. బీహార్‌ ఎన్నికలలో గెలుపు మాదేనంటు ప్రచారం చేసు కోవటం వారి అధికార దాహన్ని బహిర్గతం చేస్తోంది.

ఆన్‌లైన్‌ పాఠాలకు నిబంధనలు అవసరం:- కె. స్వాతికుమార్‌, విశాఖపట్నం

ఆన్‌లైన్‌ టీచింగ్‌ని ప్రభుత్వాలన్నీ ప్రవేశ పెట్టాలి. క్లాసు రూం టీచింగ్‌ చాల కష్టమైన పని. విద్యార్థులను నియం త్రించడం చాలా కష్టం.

పైగా వారిని దండిస్తే ప్రజలు టీచ ర్లుపై దాడి చేయ్యడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. అలాగే మగ టీచర్లు ఆసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యా దులు, పేరెంట్సు దాడులు, మీడియో కవరేజ్‌లు జరుగు తున్నాయి.

ఆన్‌లైన్‌ టీచింగ్‌ వల్ల ఈ సమస్యలుండవు. ప్రతీ విద్యార్థి స్మార్ట్‌ఫోన్‌ ద్వారా పాఠాలు నేర్చుకోవచ్చు. రికా ర్డు చేసి మళ్లీ మళ్లీ వినోచ్చు. అలాగే టీచర్లుకి ఆన్‌లైన్‌ పాఠాలు చెప్పాలని నిబంధన విధించాలి. ఆసక్తి లేని వారికి సైతం ఆసక్తి కలిగించాలి.

ఉచిత నగదుతో యువతలో సోమరితనం:- వివేక్‌, విశాఖపట్నం

నేటి యువత వ్యసనాలకి భానిసలవ్ఞతున్నారు. చదువ్ఞలు, ఆరోగ్యం, బాధ్యతా మరచి పోయి సినిమాలు, షికార్లు, నవ్ఞ్వలు, సెల్‌ఫోన్‌ల ద్వారా గడుపుతున్నారు.

ఇది చాలా ప్రమాదకరమైన దోరణి యువత చెడిపోతే ఆ దేశమే చె డి పోతుంది. అలాగే ఉచితంగా ఇవ్వడం కూడా రాజకీయ నాయకులు మానుకోవాలి.

ఓట్లు కోసం ఉచితం ఇస్తే పని చెయ్యక తాగుబోతులుగా, సోమరివారుగా మారే అవకాశం ఉంది. పని కల్పించి యువతను సరైన మార్గంలో పెట్టాలి.

రాజ్యమేలుతున్న నకిలీ మందులు:- సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

తెలుగు రాష్ట్రాలలో నకిలీ మందులు రాజ్యమేలుతున్నాయి. తక్కువ ధరలకు లభించే జనరిక్‌ మందులు, ఎక్స్‌పైరీ అయిన మందులను బ్రాండెడ్‌ ప్యాకేజీలలో అందంగా తయారు చేసి విక్రయిస్తున్నారు.

వీటిని సేవించే వారికి వ్యాధి తగ్గకపోగా మరింత ముదురుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఎప్పటికప్పుడు ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు, డిస్టి బ్యూటర్లు, మెడికల్‌ షాపులపై తనిఖీలు నిర్వహించి అక్ర మార్కులపై కేసులు నమోదు చేయాల్సిన డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు నిర్లక్ష్యవైఖరి కారణంగా నకిలీ మందుల విక్రయం యధేచ్ఛగా సాగుతోంది.

కేన్సర్‌, పక్షవాతం, కిడ్నీ, కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే రోగులకు కూడా నకిలీ మందులు అంట గడుతుండడంతో వారిప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.

ఇక గ్రామీణ ప్రాంతాల్లో లైసెన్స్‌లేకుండా నిర్వహించే మందుల షాపులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/