ప్రజావాక్కు

Voice of the people
Voice of the people

ప్రజలపై ధరల భారం: -యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర సరకుల ధరలు ముప్ఫైశాతం పెరి గాయి.సామాన్యుని చేతిలోపనుల్లేక ఆదాయం కోల్పోయి పౌష్టి కాహారం మాటటుంచి, రెండు పుటలా కడుపు నింపుకోవడానికే గగనమవ్ఞతోంది. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు, ప్రభుత్వపరంగా నిర్మాణాలను నిలుపుదల చేయడంతో కార్మిక వర్గానికి పనులు లేకుండా పోయాయి. క్రిస్మస్‌, సంక్రాంతి పండుగలకు కొత్త బట్టలు, సొంత ఊరు, బంధువ్ఞల ఇళ్లకు వెళ్లాలంటే పెరిగిన బస్సు ఛార్జీలు ఇటువంటి దశలో ధరల పెంపు మూలిగే నక్కపై తాటికాయపడ్డట్టు ఉంది. గతంలో అన్న క్యాంటీన్‌ ద్వారా కొంత ఉపశమనం లభించేది. ప్రస్తుత ప్రభుత్వం అన్ని వర్గాల వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వివిధ వర్గాల ప్రజలకు ఇబ్బడిముబ్బడిగా వేలకోట్లు ప్రోత్సాహకాలు అందించేబదులు ఆనిధులతో నిర్మాణాలుచేపట్టినట్లయితే రాష్ట్ర అభివృద్ధితోపాటు కార్మిక,శ్రామిక వర్గానికి పనులు లభిస్తాయి.

పంటల బీమా రుసుం ఎవరు చెల్లించాలి?: -గరిమెళ్లరామకృష్ణ, గన్నవరం, కృష్ణాజిల్లా

రాష్ట్ర పాలకులు తమ ఎన్నికల వాగ్దాన పత్రంలో వైఎస్సార్‌ రైతు భరోసా హామీ కింద రైతులు కట్టవలసిన పంటల బీమా రుసుం ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. రైతులు కూడా ప్రభుత్వ హామీ మేరకు తాము రుసుం చెల్లించనవసరం లేదన్న భావనలో పంటలబీమా రుసుంచెల్లింపులకు ముందుకు రాని పరిస్థితి నెలకొంది.అయితే చాలా బీమా సంస్థలు ఈ పంటల బీమా వ్యాపారం తమకు లాభదాయకంగాలేదని చేతు లెత్తేసినట్లు పత్రికలలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలుఖరీఫ్‌లో పంటలు నష్టపోయిరైతులకు బీమా వస్తుందా? రబీ పంటకు బీమా ప్రభుత్వం బాధ్యత తీసుకుందా? లేదంటే రైతులకు ఆ సమాచారంఇచ్చారా?ఇప్పుడు కాలాతీతం అయితే రైతుల పరిస్థితి ఏమిటి?వ్యవసాయ మంత్రి అధికారులు తగు వివరణ ఇచ్చి రైతులకు వాస్తవ పరిస్థితి తెలియచేయాలి.

టూరిజంపై దృష్టిసారించాలి:-షెేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

పర్యాటకంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టవల సిన అవసరం ఉంది. పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాలకు ప్రజల ఆదరణ ఎక్కువగా ఉంటుంది. అలా పర్యటించడా నికి వచ్చిన వారికి రాత్రిపూట బస చేయడానికి హోటల్‌ వసతి, భోజన వసతి ఉండే విధంగా ప్రభుత్వం టూరిజం శాఖ ద్వారా ఏర్పాట్లు చేపట్టాలి. పర్యాటకంగా కొన్ని ప్రాం తాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.

ఆనకట్ట మరమ్మతులు చేపట్టాలి: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

శ్రీశైలం జలాశయం ఆనకట్టకు అడ్డుగా పగుళ్లు ఏర్పడి ప్రమాద స్థితి ఏర్పడుతోందనే రామన్‌మెగసెస్‌ అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్‌ నివేదిక ఆందోళన కలిగిస్తోంది. ఈ కట్టకు ప్రమాదం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం ఉండడంతోపాటు దిగవన ఉన్న నాగార్జున సాగర్‌ ఆనకట్ట భద్రతకు సైతం ప్రమాదం ఏర్పడుతుందని నిపుణులతో కూడిన కమిటీ హెచ్చరించడం ఆందోళనకరం. దేశంలో ఆనకట్టల నిర్వహణకు సరైన విధానం ఇప్పటివరకు లేనందున, జాతీయ జలవనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోవెంటనే ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రతీఆనకట్టపై నిర్వహణ,విపత్తులనిర్వహణవ్యవస్థను ప్రణాళిక బద్ధంగా ఏర్పాటు చేయడం, ప్రతీఆరు నెలలకు నిపుణుల చేత భద్రత ఆడిట్లు నిర్వహించడం,ఆనకట్టలఎత్తును పెంచడం, విదే శాలలో ఉన్న అత్యాధునిక భద్రతా తనిఖీ విధానాలను ఇక్కడ కూడా అమలుపరచడం వంటి చర్యలు చేపట్టడం అవశ్యకం.

నిబంధనల ఉల్లంఘన:-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

విద్యాహక్కు చట్టంలో పాఠశాలదూరం నిబంధనలో మార్పులు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంఅహేతుకం. ఈ మార్పు ల వలన ప్రైవేట్‌ పాఠశాలలో పేద పిల్లలకు 25 శాతం సీట్ల కేటాయింపు అటకెక్కి తద్వారా పేదవారికి తీరని అన్యాయం జరుగుతుంది.ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేకపోయినా ప్రైవేట్‌ పాఠశాలలో పేదవారికి 25 శాతం సీట్ల కేటాయింపు జరిగేది. కాని ఈ నిబంధనను సడలిస్తే ప్రైవేట్‌ స్కూళ్లు కేవలం ధనవంతులకే ఆవాసాలుగా మారుతున్నాయి. ప్రాథమిక విద్యాహక్కుకు ఈ నిబంధన పూర్తిగా వ్యతిరేకం. అంతేకాక ఫీజులపై నియంత్రణ నిబంధనను కూడా సడలిస్తే ఇక వారి దోపిడీకి అడ్డు అదుపు లేకుండాపోతుంది.

పెరుగుతున్న వాహన కాలుష్యం: -జి.అశోక్‌,గోదూర్‌, జగిత్యాలజిల్లా

పట్టణాల్లో, గ్రామాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడా నికి ప్రధాన కారణం వాహనాల సంఖ్య పెరగడమే. రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్యను తగ్గించడం కష్టమే.కానీ కాలుష్యాన్ని నియంత్రించే మార్గాలు కనిపెట్టా లి. వాహనాల నుంచి వెలువడే కాలుష్యం ప్రజల ఆరోగ్యం పై తీవ్రప్రభావం చూపుతోంది.కాలుష్య నియంత్రణ మండ లి ఈ సమస్య గురించి పట్టించుకున్న దాఖలాలు లేవ్ఞ. నామమాత్ర చర్యలతో సరిపెడుతున్నారు తప్ప నిర్దిష్ట చర్యలు చేపట్టడం లేదు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/