ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the People
Voice of the People

పాలక పార్టీకి మేలు చేస్తున్న కరోనా: -మిథునం, హైదరాబాద్‌

ప్రజలు భయాందోళనలకు గురవుతూ ఇళ్లనుంచి బయటకు రావడం లేదు. రోడ్లపై జన సంచారం తగ్గిపోయింది. హోటళ్ల లో అల్పాహారాలు, టీ, కాఫీలు తాగేవారు లేక కూర్చీలు ఖాళీ గా కనిపిస్తున్నాయి.

సినిమా హాళ్లు, స్కూళ్లు, కాలేజీలు బంద్‌ అయిపోయాయి. క్రికెట్‌ సిరీస్‌లురద్దయ్యాయి. ఐపిఎల్‌ వాయి దా పడింది. ఇతర క్రీడా పోటీలన్నీ ఆగిపోయాయి. ప్రజలకు వినోదంలేకుండా పోయింది.ముఖ్యమంత్రులు,మంత్రులుఇంకా అనేకులు ఇప్పుడు ఒకే విషయం మీద దృష్టి పెట్టారు.

చట్టసభ ల్లో కూడా ఇదే విషయం మీద చర్చలు జరుగుతున్నాయి. బ్యాంకుల దివాలా, ఆర్థికమాంద్యం, నిరుద్యోగం, ధరల పెరు గుదల శాంతి భద్రతల వంటి సమస్యలు పూర్తిగా మరుగున పడిపోయాయి. కరోనాయే పెద్ద సమస్య అయిపోయింది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ పాలక బిజెపికి మాత్రం మేలే చేస్తోంది.

హెల్త్‌కార్డులు ఇవ్వాలి:-కె.రఘురామయ్య, శంఖవరం, తూ.గోజిల్లా

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ జాబితాలో ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రులు ఐదేనా ఈ హెచ్‌ఎస్‌హెల్త్‌ స్కీములో భాగంగా ప్రభుత్వ ఉద్యో గులకు,పెన్షనర్లకు నగదురహిత వైద్యంనిరాకరిస్తేకఠిన చర్యలు తీసుకుంటామని వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ సిఇఒ డాక్టర్‌ హెచ్చరిం చారు.

ఏ ఒక్క ఉద్యోగి, పెన్షనర్‌ తమకు వైద్యం అందలేదని ఫిర్యాదు చేసినా సదరు ఆస్పత్రిపై చట్టపరమైన చర్యలు తీసు కుంటామని అవసరమైతే సదరు ఆస్పత్రి గుర్తింపు రద్దుచేస్తా మని, ఈ పథకం కింద బకాయిలలో రూ.120 కోట్లకుపైగా చెల్లించామని, మిగతా బకాయిలు కూడా త్వరలో చెల్లిస్తామని అన్నారు. కానీ అవేవీ నేడు అమలులో లేవ్ఞ. ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదు.

నియమం పెట్టాలి: -మిస్సుల గాయిత్రీదేవి, శివరామకృష్ణ, అత్తాపూరు

వైద్యో నారాయణహరి అన్నారు. వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రి కన్న తమ సొంత కార్పొరేట్‌ ఆస్పత్రిపైనే దృష్టిపెట్టారు. దాని ఫలితం ఎక్కడ చూసినా కార్పొరేట్‌ ఆస్పత్రులు వెలిశాయి. ప్రభుత్వ ఆస్పత్రులు నరకకూపాలుగా తయారైనాయి.

నేడు స్టార్‌ హోటళ్లని తలదన్నే రీతిలో ఈ ప్రైవేట్‌ ఆస్పత్రులు పనిచేస్తున్నాయి. వీటి ఏకైక లక్ష్యం ధనార్జనే. రిజిస్ట్రేషన్‌ ఫీజు అని ఏవో టెస్టులని, ఎక్సేరే అని ఇసిజి అని కన్సల్టేషను అని ఒక మందులు గురించి, రూమ్‌ గురించి చెప్పక్కర్లేదు. వెరసి లక్షల్లో ఫీజులువసూలు చేస్తున్నారు.ప్రతి కార్పొరేట్‌ ఆస్పత్రిలో పది మందికి ఉచిత వైద్యం అందించేలా నియమం పెట్టాలి.

పెరుగుతున్న పారు బాకీలు: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

పారుబాకీలు పెరిగిపోయి, అసలు పెట్టుబడి కూడా లేక మరొక ప్రముఖ బ్యాంకు ఎస్‌బ్యాంకు మూతపడడం దురదృష్టకరం.

డిపాజిట్లపై ఎక్కవ వడ్డీని ఇవ్వజూపడం, ఆధునిక సాంకేతికత ఆధారిత సేవలు ధృవీకరణ పత్రాలు లేకుండా రుణాలు ఇవ్వ డం వంటి ద్వారా యువ ఖాతాదారులను ఆకట్టుకున్న ఎస్‌ బ్యాంకు హఠాత్తుగా దివాలా తీయడం బ్యాంకింగ్‌ వ్యవస్థలో డొల్లతనాన్ని ఎత్తిచూపిస్తోంది.ఈబ్యాంక్‌ షేర్ల విలువ 85శాతం పడిపోయి పెద్దఎత్తున మదుపరులు తీవ్రంగా నష్టపోయారు.

ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఆర్‌బిఐ ఏర్పాటు చేసిన పర్యవేక్షణ యంత్రాంగం తన విధి నిర్వహణలో దారుణంగా విఫలమైంది. రెండు లక్షల డిపాజిట్లు ఉండగా 2.8 లక్షల కోట్ల రుణాలను ఇచ్చేస్తున్న ఆర్‌బిఐ పట్టించుకోలేదు. పరిస్థితిని ముందే గ్రహించి వ్ఞంటే ఈ పరిస్థితి వచ్చేదికాదని బ్యాంకింగ్‌ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఫార్టీ ఫిరాయింపు చట్టం తేవాలి: -సరికొండ రవిప్రకాశ్‌రాజు, మునగాల, సూర్యాపేటజిల్లా

ఇటీవలికాలంలో ఎన్నికల్లో ఒకపార్టీ సింబల్‌ మీద గెలిచి వేరే పార్టీలో ఉండి పదవ్ఞలు అనుభవించి కోట్లాది రూపాయలు సంపాదించి తిరిగి పదవ్ఞల కోసం వేరే పార్టీలో చేరుతున్నారు. ఏ చెరువ్ఞలో నీరు ఉంటే కప్పులు పదివేలు చేరినట్టు అనే సామెత గుర్తుకువస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఉన్న పార్టీ కష్టాల్లోపడితే మరల ఈపార్టీని వదిలిపెట్టరనిగ్యారంటీ ఉందా? ఇది ప్రజాస్వామ్యంకానీ రాజకీయాల్లో నైతికత ఉండాలి.

ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమకు నష్టం:-ఎం.కనకదుర్గ, తెనాలి,గుంటూరుజిల్లా

కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో మనదేశం నుండి షెడ్యూల్‌ హెచ్‌ డ్రగ్స్‌తో సహా 58 రకాల ఔషధాల ఎగుమతు లపై కేంద్రప్రభుత్వం ఆంక్షలు విధించడం వలన దేశీయ ఫార్మా స్యూటికల్‌ పరిశ్రమకు ఎంతగానో నష్టం వాటిల్లుతుంది.

ఈ ఔషధాల తయారీగానీ, వాటి ఎగుమతుల కోసం విదేశీ డిస్ట్రి బ్యూటర్లతో కుదుర్చుకున్న కాంట్రాక్టులు వైరస్‌ వెలుగు చూడ టానికి కంటేఎంతో ముందువి. ఆ ఎగుమతులను నియం త్రించడం వలన దేశీయ పరిశ్రమలు వందల కోట్ల రూపాయలు నష్టపోవాల్సిరావడంతోపాటు పోర్డుల్లో, నౌకాశ్రయాలలో గోదా ముల్లో ఉన్న ఔషధాలు నష్టపోవాల్సి ఉంటుంది. కాంట్రాక్టులు పూర్తి చేయకపోవడం వలన న్యాయపరమైన చిక్కులు కూడా ఎదుర్కొవాల్సి ఉంటుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/