ప్రజావాక్కు

Voice of the People
Voice of the People

కేంద్రం ఆదుకోవాలి: -గరిమెళ్లరామకృష్ణ, ఏలూరు, ప.గోజిల్లా

రాష్ట్రంలో ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టు బాటు ధరలు లేక అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మొక్కజొన్న,వేరుశనగ, పసుపువంటి పంటలధరలు మార్కెట్‌ మాయాజాలంతో యాభైశాతం పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల ధరల స్థిరీకరణకు బడ్జెట్‌లో మూడువేల కోట్ల రూపాయలు కేటాయిం చినా, ఆయా పంట ఉత్పత్తుల కొనుగోలుకు ఇంతవరకూ ఒక్క రూపాయికూడా విడుదల చేయలేదు.70శాతం వ్యవసాయరం గం మీద జీవనం సాగిస్తున్న రాష్ట్రంలో రాష్ట్రప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుండటం సబబుకాదు. నవర త్నాలుఅంటూ బడ్జెట్‌ నిధులన్నీ వృధాగా ఖర్చుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమే రైతులను ఆదుకోవాలి. ఈ దిశగా మన పార్లమెంట్‌ సభ్యులు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి.

ఉద్యోగుల తొలగింపు సరికాదు: -యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం

కేంద్రంలో ఏప్రభుత్వం అధికారంలోఉన్న ప్రభుత్వరంగ సంస్థ లను అమ్మడం, ఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విరమణ పథ కం అమలుచేసి ఇంటికి పంపడం లక్ష్యంగా చేస్తున్నారు. ఇటీ వలభారత సంచార నిగమ్‌ లిమిటెడ్‌ ఉద్యోగుల తొలగింపునకు తెరలేపారు. దేశవ్యాప్తంగా లక్షాయాభై వేల మంది పని చేస్తుం డగా లక్షమందిని ఇంటికి పంపడానికి సిద్ధంచేస్తున్నారు. డిసెం బర్‌ మూడవ తేదీ గడువ్ఞగా నిర్ణయించగా ఇప్పటికీ 80వేల మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఇప్పటికీ ఉద్యోగుల నిష్పత్తితగ్గిందని ప్రజాస్వామ్యవ్యవస్థకు మంచిది కాదని గణాం కాలువివరిస్తుండగా అదేమీ పాలకులకు పట్టడం లేదు. ప్రభు త్వం అమలుచేసే పథకాలు ప్రజలముంగిట చేర్చేది ఉద్యోగులే!

రైల్వేశాఖ ప్రైవేట్‌పరం: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

ఢిల్లీ-లక్నో మార్గంలో తేజస్‌ పేరిట ప్రైవేట్‌ రైలును ప్రారంభిం చడం ద్వారా రైల్వేశాఖ ప్రైవేట్‌ రంగానికి తెర లేపింది. ఈ ప్రయోగం మంచి చెడ్డలు పరిశీలించాక కొన్ని కీలక రూట్లలో ప్రైవేట్‌ రైళ్లను అనుమతించాలని ముసాయిదా ఇప్పటికే సిద్ధం చేసుకుంది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో రైల్వేనిర్వహణ ప్రయోగాత్మకంగా ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించింది. కొత్తరైల్వే స్టేషన్ల నిర్మాణం, రైల్వేలైన్ల నిర్మాణం పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వా మ్యంలో నిర్వహించాలని నిర్ణయించింది. లక్షలాది కార్మికులు ఉన్న రైల్వేశాఖలో ప్రైవేట్‌ భాగస్వామ్యం సరికాదని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవ్ఞతోంది.

ప్రభుత్వ బడులను మూసివేయొద్దు:-సయ్యద్‌ షఫీ, హన్మకొండ

అందరూ చదవాలి,అందరూ ఎదగాలి,నేటి బాలలే రేపటి పౌరు లు అను నినాదాలు చెవ్ఞలకు వినసొంపుగానే ఉన్నాయి. కానీ ప్రభుత్వం విద్యాహక్కుచట్టం సవరణ పేరుతో ప్రభుత్వ బడుల మూతకు ప్రతిపాదనలు చేస్తుంది.ప్రభుత్వ పాఠశాలలు బడుగు బలహీనవర్గాల పేదపిల్లలు చదువ్ఞకోడానికి ప్రభుత్వ పాఠశాల లు నెలకొల్పారు. స్వాతంత్య్రానంతరం దూరదృష్టితో దేశ భవి ష్యత్తు విద్యారంగంపైనే ఉంటుందనిచెప్పారు.పేద పిల్లలు విద్య ను అభ్యసించాలంటే ప్రభుత్వ పాఠశాలలో చేరాలి.ప్రభుత్వం ప్రతిసారి రాష్ట్రబడ్జెట్లో అరకొర నిధులు మాత్రమే ఇస్తున్నది. ఆవాస ప్రాంతాల్లోని పాఠశాలలు మూతపడితే బాలకార్మికుల సంఖ్య పెరుగుతుంది. కనుక ప్రభుత్వ పాఠశాలలను మూత పడకుండా చూడాలి.

విధాన నిర్ణయం ప్రకటించాలి: -బి.సురేష్‌, అరసవల్లి, శ్రీకాకుళంజిల్లా

సామాజికభద్రతలోభాగంగా ఎపిమోడల్‌ స్కూల్స్‌లో పనిచేస్తూ వివిధ కారణాలతో మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలను కారుణ్య నియామకాల ద్వారా ప్రభుత్వం ఆదుకోవాలి. మోడల్‌ స్కూల్స్‌ వ్యవస్థ ఏర్పడి ఆరు సంవత్సరాలు పూర్తి అయిన ప్పటికీ సిబ్బందికి సర్వీసు నిబంధనలు లేవ్ఞ. సర్వీస్‌ రూల్స్‌ ఆలస్యంవలన ఆరోగ్యపథకం, పెన్షన్‌స్కీమ్‌, ఇతర ముఖ్యమైన సౌకర్యాలు లేక ఉపాధ్యాయులు ఇబ్బందులను ఎదుర్కొంటు న్నారు. గత శాసనసభ సమావేశాలలో మోడల్‌ స్కూల్స్‌ రెగ్యు లర్‌ ఉపాధ్యాయుల సిబ్బంది సమస్యలను పరిష్కారిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇది స్వాగతించే విషయం. అయినప్పటికీ మోడల్‌ స్కూల్స్‌పై విధాన నిర్ణయం ప్రకటించి శాశ్వత పరిష్కారం కోసం ఉత్తర్వులు విడుదల చేస్తే తప్ప సమస్యల పరిష్కారానికి మరో మార్గం లేదు.

పెరుగుతున్న డెంగ్యూ పీడితులు: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

గుంటూరుజిల్లాలో డెంగ్యూ జ్వరపీడితుల సంఖ్య రోజురోజు కూ పెరిగిపోతోంది.జ్వరాల తీవ్రతఏమాత్రం అదుపులోనికి రాక పోగా, జ్వరపీడితుల సంఖ్య అప్రతిహతంగా పెరిగిపోతోంది. పారిశుద్ధ్యలోపం,కలుషిత తాగునీరువంటి ప్రభావం వలన ప్రజ లనుజ్వరాలు చుట్టుముడుతున్నాయి.డెంగ్యూతోపాటు టైఫాయి డ్‌, మలేరియా జ్వరాలు కూడా ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 230 మంది డెంగ్యూబారిన పడ్డా రని అధికారిక గణాంకాలు తెలియచేస్తుండగా ఈ సంఖ్య వాస్త వానికి ఎంతో ఎక్కువగా ఉందని వార్తలు తెలియచేస్తున్నాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/