ప్రజావాక్కు

PEOPLE
PEOPLE

మంత్రులే అసత్య ప్రచారమా?: -గరిమెళ్ల రామకృష్ణ, ఏలూరు, ప.గోజిల్లా

రాష్ట్ర రాజధానికి జరిగిన భూసేకరణ ప్రశాంతంగా జరిగింద ని, ప్రపంచంలోనే అద్భుతమని సి.ఆర్‌.డి,ఏ కమిషనర్‌ న్యూ ఢిల్లీలో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో చెప్పారు. అలాగే భూసేకరణలో కానీ,ఇతరత్రా రాజధాని పరిధిలో గత ప్రభుత్వ హయాంలో ఏమైనా అవకతవకలు జరిగాయా అన్న సమాచా రహక్కు ద్వారా సేకరించిన సమాచారంలో సి.ఆర్‌.డి.ఏ అధి కారులు అలాంటిదేమీ లేదని అధికారికంగా సమాధానం ఇవ్వ టం జరిగింది. మరి మంత్రులు, అధికార పార్టీ నాయకులు అక్కడేదో అవినీతి జరిగిపోయిందని భూసేకరణ నాటి నుండి ఇప్పటివరకు అసత్యఆరోపణలు చేస్తూవచ్చారు.మరి సినీయర్‌ మంత్రులే బాధ్యతారహితంగా అమరావతిని స్మశానమంటూ వ్యంగ్యవ్యాఖ్యలు చేయడం, అదేదో ఒక సామాజికవర్గానికే మేలు కోసం జరుగుతున్నట్లు అసత్యప్రచారం చేయడం వారి కుసంస్కారానికి అద్దంపడుతుంది.ప్రజాస్వామ్యంలోరాష్ట్ర రాజ ధాని అనేది ప్రజలందరికీ అవసరమైన ఓ మౌలిక అవసరం.

అధికారానికే ప్రాముఖ్యత: – ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌

విరుద్ధ భావాలు గల మూడు పార్టీల కలయిక ఎంతో కాలం నిలవదని విబేధాలు వచ్చి విడిపోవడం ఎనిమిది నెలలోపే మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం పడిపోవడం ఖాయమని అంటూనే బిజెపి నాయకులు అంతా ఒక రాత్రితోనే మహారాష్ట్ర రాజకీయాలను తమ గుప్పెట్లోకి తెచ్చేసుకున్నారు. ఫడ్నవీస్‌ చేత రహస్యంగా ప్రమాణస్వీకారం చేయించి చీకటి రాజకీయా లకు ఈ తెరతీసారు.కానీ అది నిలువ లేదు. అయితే ఇలాంటి చేష్టలు వారికి కొత్తేమికాదు. కొంతకాలం క్రితం కర్ణాటకలో కూడా అచ్చం ఇలానే చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం నీచ రాజకీయాలకు పాల్పడ్డారు.

రాజకీయ నాటకం:-వి.ఆర్‌.ఆర్‌.ఎ రాజు, హైదరాబాద్‌

కాంగ్రెసులో ఎంతసేపటికీ నెహ్రూ, కుమార్తె ఇందిర, కుమారు డు రాజీవ్‌, ఇలా కుటుంబ ఆధిప్యతం కన్పడుతుంది. తృణ మూల్‌కు స్థానంలేదు. కాంగ్రెస్‌ నుంచి బయటకి వచ్చి తృణ మూల్‌ కాంగ్రెస్‌ను స్థాపించింది మమతాబెనర్జీ.మహారాష్ట్రలో అదే కాంగ్రెసు శివసేనతో కలగాపులగమవడం, తాను ఇంత కాలంలో కాంగ్రెసుతో విభేదించడం ప్రజలను మోసం చేయడ మే. ఇక బిజెపితో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వచ్చిన అజిత్‌పవార్‌, శరద్‌పవార్‌ శరద్‌ పవార్‌ భార్య కౌన్సిలింగ్‌తో వెనుకడుగు వేశారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో నకిలీ మందులు: -సి.ప్రతాప్‌,శ్రీకాకుళం

ప్రజలకు ఇఎస్‌ఐ ఆస్పత్రుల ద్వారా ఉచితంగా అందించాల్సిన మందులను తప్పుడు పత్రాలతో బహిరంగ మార్కెట్‌లో అమ్ము కొని కోట్లాది రూపాయలను రాష్ట్ర కార్మిక రాజ్యబీమా సంస్థ అధికారులు గడించిన వైనం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆస్పత్రుల నిర్వహణలో తప్పులతడకలు, భారీ ఎత్తున బయట పడిన అవినీతిపై కేంద్ర ప్రభుత్వం సిబిఐ చేత నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలి. ప్రతీ ఆర్నేళ్లకు విధిగా స్వతంత్ర సంస్థల చేత ఆడిట్లు కూడా జరిపిం చాలి. అవినీతిలో భాగస్వాములైన ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. దేశవ్యాప్తంగా ఈఎస్‌ఐ ఆస్పత్రుల పని తీరును మెరుగుపరచాలి. అంతేకాకుండా ఇఎస్‌ఐ ఆస్పత్రులలో నకిలీ మందుల వినియోగం జరుగుతోందన్న ఆరోపణలపై కూడా సత్వరం విచారణ జరిపించాలి.

మురికి కూపాలుగా మారుతున్న నగరాలు: -కె.శివసాయి, నల్గొండ

జనాభా విస్తృతంగా పెరగడం వలన దేశంలో గ్రామాలు, నగ రాలు అనే బేధం లేకుండా అన్ని ప్రదేశాలు మురికికూపాలుగా తయారవ్ఞతున్నాయి. వ్యర్థాలు పునర్వినియోగానికి అనువ్ఞగా లేనందున ఎక్కడ చూసినా చెత్త దర్శనం ఇస్తోంది. ఆ మధ్య సాంఘిక మాధ్యమాలలో ఘాజీపూర్‌ చెత్తపై అనేక విమర్శలు వెల్లువెత్తడంతో సుప్రీంకోర్టు స్వయంగా కలుగచేసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇవ్వాల్సివచ్చింది. జనాభా, వైశాల్యంపరంగా ప్రపంచంలో రెండోస్థానంలో నిలిచిన భారత్‌ లోనూఘన,ద్రవ, ఎలక్ట్రానిక్‌, వ్యర్థాల నిర్వహణలో పటిష్టమైన ప్రణాళికలు రూపొందించడం అవసరం.

అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయాలి: -షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

ప్రతి మండల కేంద్రంలో ఒక అగ్నిమాపక కేంద్రాన్ని తప్ప కుండా ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం అగ్నిమాపక కేంద్రాలు డివిజన్‌ కేంద్రంలో ఉన్నాయి. ఈ డివిజన్‌ కేంద్రాలు పల్లెలకు ఎక్కువ దూరంలో ఉండటంతో అగ్నిప్రమాదం సంభవిస్తే అగ్నిమాపక వాహనాలు వచ్చే వరకు జరగాల్సిన నష్టం జరిగి పోతుంది. ప్రస్తుతం అగ్నిమాపక కేంద్రాలు దూరంగా పల్లెలకు ఉండటం వల్ల అగ్ని ప్రమాదాలను నివారించలేకపోతున్నారు. ప్రభుత్వం అగ్నిప్రమాదాల వల్ల జరిగే నష్టాలను దృష్టిలో పెటు ్టకొని, అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/