ప్రజావాక్కు

people
people

 ప్రజావాక్కు

వాతావరణ శాఖ పరిశోధనలు:- సి.శ్ర్రీనివాస్‌, శ్రీకాకుళం

దేశ జనాభాలో సగం మంది ఆధారపడిన భారత వ్యవసాయ రంగానికి వాతావరణం పెద్ద గండంగా మారింది. దేశంలో 20 శాతం జిల్లాల్లో వ్యవసాయ రంగంపై వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉందని భారత వ్యవసాయ పరిశోధన మం డలి తాజా నివేదిక ఆందోళన కలుగచేస్తోంది. మొత్తం 151 జిల్లాలో పంటలు, కాల్వలు, పశుసంపద వాతావరణ మార్పు ల కారణంగా తీవ్రమైన దుర్భిక్షపరిస్థితులు నెలకొన్నట్లు ఇందు మూలంగా ఆహార భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందన్న నివే దిక పట్ల ప్రభుత్వం తక్షణం స్పందించాలి. ఈ అంశంలో భౌగోళిక నిర్దిష్ట సాంకేతికతలను, ఆ పరిస్థితులకు అనుగుణం గా విత్తనాలు, ఎరువ్ఞలు, వ్యవసాయ విధానాలను తక్షణం రూపొందించడం ఎంతో అవసరం.

పెరుగుతున్న సహజీవనం: -సరికొండ రవిప్రకాశరాజు, సూర్యాపేటజిల్లా

ఇటీవల కాలంలో మనదేశంలో ముఖ్యంగా మన రెండు తెలుగురాష్ట్రాల్లో యువతలో సహజీవనంతో ఎక్కువైపోయిం ది. మ్యారేజీ కాకముందే సహజీవనానికి అలవాటుపడుతున్నా రు. యువత తప్పుదారిలో పడుతున్నారు. వివాహమైన స్త్రీ, పురుషులు కూడా అక్రమసంబంధాలు పెట్టుకుంటున్నారు. పవిత్ర భారవతావనిలో ఇవి తగునా? ప్రభుత్వం ప్రజలు చొరవ తీసుకొని అక్రమ సంబంధాలకు అడ్డుకట్ట వేయాలి.

డిజిటల్‌ విద్య రికార్డులకే పరిమితం:-ఎస్‌.రాధాకృష్ణ, నల్గొండ

తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాప్రమాణాలు పెంచేందుకు ప్రవేశపెట్టిన డిజిటల్‌ విద్యాబోధన రికార్డులకే పరిమతమైంది. గత ఏప్రిల్‌లో పలు జిల్లాలో అధికారులు డిజిటల్‌ తరగ తులను అట్టహాసంగా ప్రారంభించినా సాంకేతిక లోపాలు, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం, పరికరాల నాణ్యతలో సమస్యలు, అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది లేని కారణంగా డిజిటల్‌ బోధన ముందుకు సాగడం లేదు. పైగా పాత సిలబస్‌లో ఉన్న పాఠాలనే బోధిస్తుండటంతో విద్యార్థులకు డిజిటల్‌ బోధన ఏమాత్రం ఉపయోగపడటం లేదు. తెలుగు మీడియం విద్యార్థులకు మాతృభాషలోనేబోధనా, పరికరాల నాణ్యతపెంపు, తగినన్ని ఇన్వెస్టర్ల ఏర్పాటు వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టాలి.

ఉర్జిత్‌పటేల్‌ సర్జికల్‌ స్ట్రయిక్‌:-ఎన్‌.రాంబాబు, శ్రీకాకుళం

మెరుపుదాడి ముఖ్యఉద్దేశ్యం టార్గెట్‌ని ధ్వంసం చేయడమొక్క టేకాదు, ప్రత్యర్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టడం అనుకొంటే ఆర్‌బిఐ గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌ ఆకస్మిక రాజీనామాని ప్రభు త్వంపై మెరుపుదాడిగానేభావించాలి.రాజీనామాకు ఎన్ను కొన్న ముహూర్తం అందుకు బలపరుస్తోంది. ప్రభుత్వానికి ఆర్‌బిఐకి మధ్య భేదాభిప్రాయాలు కొత్తవి కావ్ఞ. నగదు రద్దు నుండి పెరుగుతూ వస్తున్నాయి. ద్రవ్యోల్బణాలు, వడ్డీరేట్లు, నగదు నిల్వల్లోవాటాలు, పెత్తనాలుమాటెలాఉన్నా, నీరవ్‌మోడీ లాంటి ఆర్థికనేరస్తులు తయారవ్వడానికి, తప్పించుకుపోవడానికి ప్రభు త్వం ఆర్‌బిఐ అసమర్థ నిర్వాకంగాచూపింది. నొచ్చుకొన్న గవ ర్నర్‌ స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వ బ్యాంకులపై తమకు పూర్తి నియంత్రణ ఉండదని, బోర్డుద్వారా పాలకులు జోక్యం చేసుకుంటారని చెప్పారు.

వీధి వ్యాపారులను పట్టించుకోండి:-ఎన్‌.హరిబాబు, సికింద్రాబాద్‌

దేశంలోనే తొలిసారిగా వీధి వ్యాపారం కోసం హైదరాబాద్‌ గ్రేటర్‌ కార్పొరేషన్‌ స్ట్రీట్‌ వెండింగ్‌ పాలసీని అమలు చేయడం హర్షణీయం. ట్రాఫిక్‌ విభాగం, రెవెన్యూ,కార్మికసంస్థలు, వాణి జ్యసంఘాల సమన్వయంతో అమలు చేస్తున్న ఈ విధానం సత్ఫలితాలను ఇవ్వడంఆనందదాయకం. జంటనగరాలలో వ్యా పారాలు చేసుకుంటున్న వారిని ఆన్‌లైన్‌లో రిజిస్టరు చేయించి గుర్తింపు కార్డులు ఇవ్వడం, ఆర్థిక క్రమశిక్షణ పెంపొందించేందు కు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, ప్రతి సర్కిల్‌లో వీధి వ్యాపారుల ఉపాధి పరిరక్షణతోపాటు నగర వాసులకు ఇబ్బంది కలగకుండా వీధి వ్యాపారులతో చర్చలు, ట్రాఫిక్‌ ఎక్కవగా ఉన్న ప్రాంతాల లో 81 జోన్లుగా విభజించి నిషేధ ప్రాంతాలుగా ప్రకటించడం వంటి చర్యల వల్ల సమస్యలు తగ్గుముఖం పడతాయి.

పల్లెల్లో వైద్యం కొరత:-కె.రామకృష్ణ, నల్గొండ

శ్రీకాకుళం జిల్లాలో డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ, కలరా వంటి ప్రమాదక రమైన వ్యాధులను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం తక్షణం హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించాలి. గత కొద్ది వారాలుగా జిల్లాలో పలు మండలాలలో ప్రాణాంతక విషజ్వరాలు ప్రబలుతున్నా యి. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 260 డెంగ్యూ కేసులు ఇక్కడ నమోదయ్యాయి. పల్లెల్లో పారిశుద్ధ్యం పడకవేయడం, వర్షాకాలంలో జిల్లా యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం ముఖ్య కారణాలు. .