పెరుగుతున్న క్షయవ్యాధుల సంఖ్య

ప్రజావాక్కు

Patients
Patients

పెరుగుతున్న క్షయవ్యాధుల సంఖ్య:-ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

దేశంలో గత అయిదేళ్లలో క్షయవ్యాధి పీడితుల సంఖ్య 12 శాతం పెరిగిందన్న జాతీయ ఆరోగ్య సంస్థ గణాంకాలు ఆందో ళన కలిగిస్తున్నాయి. చాలా సులువ్ఞగా ఒకరి నుండి మరొకరికి వ్యాధిసంక్రమించేతత్వం కారణంగా క్షయరోగ పీడితుల సంఖ్య ఎక్కువ అవ్ఞతోంది. పట్టణాలలో వాతావరణ కాలుష్యం కార ణంగా రోగులసంఖ్య పెరుగుతుండగా గ్రామాలలో నిరక్షరా స్యత, అవగాహన లేమి,మెరుగైన వైద్యసౌకర్యాల లేమి ఇత్యా ది కారణాలుగా వ్ఞన్నాయి. ఏదిఏమైనా 2020 కల్లా ప్రపంచ వ్యాప్తంగా క్షయవ్యాధిని నిర్మూలించేందుకు తగినన్ని చర్యలు తీసుకోవాలి ఐక్యరాజ్యసమితి, యునెస్కో సంయుక్తంగా పిలు పునిచ్చిన నేపథ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు క్షయవ్యాధి నిర్మూలించేందుకు పటిష్టమైన కార్యాచరణ చేపట్టాలి. విదేశా లలో అత్యాధునిక పరికరాల ద్వారా ఒక శాతం క్షయవ్యాధిని కూడా కనిపెట్టే విధానాలు అమలులో ఉన్నాయి. ఈ విధా నాలను గ్రామీణస్థాయిలో అమలుచేయాలి.

ధ్వని కాలుష్యాన్ని నివారించాలి:-జి.అశోక్‌,గోదూర్‌, జగిత్యాలజిల్లా

ధ్వని కాలుష్యాన్ని నివారించే చట్టాలు, అధికారాల మాట ఎలా ఉన్నా చెవ్ఞల తుప్పు వదిలేలా ధ్వని కాలుష్యం పెరుగుతూనే ఉంది. సమయాలను కూడా పాటించకుండా మైకులను హోరె త్తించేవారు అనేక మంది.మతవిశ్వాసాలు, శుభకార్యాల పేరిట మైకులు రోద పెడుతున్నా పట్టించుకునే వారేరి? అత్యవసర పరిస్థితిలో మాత్రమే తక్కువ ధ్వనులు వెలువరించే సౌండ్‌ బాక్స్‌లను ఉపయోగించుకునేలా కట్టుదిట్టమైన నిబంధనలు విధించాలి. ఈ మధ్య డీజెలను పెట్టి విపరీతంగా ధ్వని కాలు ష్యాన్ని పెంచుతున్నారు. సెల్‌ఫోన్‌ కాలుష్యం కూడా బస్సు ప్రయాణాల్లో బాగా పెరిగిపోయింది. ఇకనైనా ధ్వని కాలుష్యా న్ని అరికట్టడానికి సంబంధిత అధికారులు కృషి చేయాలి.

అనాలోచిత చర్యలు:-సరిసిల్లా గఫూర్‌, జంగంపల్ల్లి

రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అవ్ఞతున్నది. ప్రభుత్వ అనాలోచిత చర్యలు, ప్రభుత్వ పాఠశాలలకు, విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఉపా ధ్యాయులను బదిలీలు చేశారు. పదోన్నతులు మరిచారు. గురుకులాలు తెరిచారు. ప్రభుత్వపాఠశాలల్లోని విద్యార్థులే టీసీలు తీసుకొని అందులో చేరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నది. దీంతో ఉపా ధ్యాయుల సంఖ్యను తగ్గిస్తారు. ఇలా అన్నీ తగ్గడంతో పాఠశాలనే మూసివేసే పరిస్థితి ఏర్పడింది.

నేరచరితులకు టిక్కెట్లు: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మూడు ప్రధా న పార్టీలు లెక్కకు మించి దురాక్రమాలకు పాల్పడి అధికారం కోసం ఎన్ని దొంగదారులైన వెళ్లడంలో తాము ఒక తానులో ముక్కలమని రుజువ్ఞ చేసుకున్నాయి. కొన్ని పార్టీలు వేల కోట్ల రూపాయల ఉచిత వాగ్దానాలను చేసి ఓట్లను ఆకర్షించే ప్రయ త్నంచేసాయి.ఇక ఎన్నికలలో వందలకోట్ల నల్లధనాన్ని ఓటర్లకు పంచి అవినీతిలో తాము ఎవ్వరికీ సాటిరామని రుజువ్ఞ చేసుకు న్నాయి. పేదల ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తామని, ప్రజాసంక్షే మమే తమ ధ్యేయమని మానిఫెస్టోలో ప్రకటించిన ఈ పార్టీలు ఎన్నికలబరిలో మొత్తంమీద ఎనిమిది వందల మంది కోటీశ్వరు లను నింపాయి.హత్య, హత్యాయత్నం, కిడ్నాపింగ్‌ వంటి తీవ్ర మైన అభియోగాలు ఎదుర్కొంటున్న వందలమందికిపైగా నేరచ రితులకు టిక్కెట్లు ఇచ్చి ప్రోత్సహించాయి. ఇలాంటి పార్టీల వల్ల ప్రజలకు మేలు కలుగుతుందంటే ఎవరు నమ్ముతారు. .
పెండింగ్‌లో పెరిగిపోతున్న దరఖాస్తులు: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

నల్గొండ జిల్లాలో ప్రభుత్వ స్థలాలలో నివాస గృహాలు, స్థలా లకు క్రమబద్ధీకరణ, పాస్‌ పట్టాదారుల వివరాలతో తప్పులను సవరించేందుకు సంవత్సరం క్రితం తహశీల్దార్‌ కార్యాలయాల లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా యంత్రాంగం సూచనలు చేసింది. అందుకు అనుగుణంగా వేలాది దరఖాస్తులు అధికారు లకుఅందగా,వీటిపై వెరిఫికేషన్‌ చేసి, క్రమబద్ధీకరణ సర్టిఫికెట్లు అందించే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇందుకోసం ప్రత్యేక బృందాలు, ఆన్‌లైన్‌ అప్‌డేట్‌ కోసం కావాల్సిన సాంకేతికత లేని కారణంగా దరఖాస్తులకు మోక్షం కలగడం లేదు. ఒకవేళ ఉన్నా అధికారుల అవినీతితో ముందుకు సాగడం లేదు.
అధ్వాన్నంగా మారిన రోడ్లు: -కామిడి సతీష్‌రెడ్డి, పరకాల, వరంగల్‌జిల్లా

పరకాల మున్సిపాలిటీ పరిధిలోని అంతర్గత రహదారులు గోతులమయమై అధ్వాన్నంగా మారాయి. పరకాల పట్టణ జనాభా సుమారు యాభైవేలకుపైగా ఉంటుంది. 20 వా ర్డులు. ప్రతి యేటా వివిధ పన్నుల ద్వారా ప్రజల నుండి కోట్లాది రూపాయల ఆదాయం మున్సిపాలిటీకి వస్తున్నా రోడ్ల పరిస్థితులలో మార్పులేదు. పట్టణంలోని ప్రతి వీధిలో ఉన్న సిసి రోడ్లు రాళ్లు కంకరతేలి గోతులతో దర్శ నంఇస్తాయి.వాహనాలు నడపాలంటే వాహనదారులు ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇలాంటి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలి.