ప్రజావాక్కు

Voice of the people
Voice of the people

నాణ్యతలేని వైద్యసేవలెందుకు?:-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

దేశంలో నాణ్యతాపరంగా మెరుగైన వైద్యసేవలను అందించ డంలో 70 శాతం వైద్యశాలలు విఫలమవ్ఞతున్న నేపథ్యంలో క్లీనికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌కు సవరణలు ప్రతిపాదించేం దుకు కేంద్రప్రభుత్వం నిర్ణయించడం ముదావహం. అల్లోపతి, ఆయేష్‌ సేవలను అందించే ఆరోగ్య కేంద్రాలు ఇప్పటి నుండి కనీస ప్రమాణాలు పాటించడం, వ్యాధి నిర్ధారణ ప్రయోగశా లలు రిజిస్ట్రేషన్‌తోపాటు జాతీయ ఆరోగ్యమండలి నిబంధనల ను విధిగా పాటించాలన్న తాజా సవరణల వలన నకిలీ క్లీనిక్‌, డయోగ్నాస్టిక్‌ సెంటర్ల బాగోతం శాశ్వతంగా మూతపడుతుం ది. ఇక్కడ పనిచేసే జనరల్‌ ప్రాక్టిషనర్లు, స్పెషలిస్ట్‌ వైద్యులు తప్పనిసరిగా భారతీయ వైద్యమండలిలో నమోదు చేసు కోవాల్సి రావడం వలన తప్పుడు సర్టిఫికెట్లతో వైద్యం చేసే వారి ఆటలకు ఫుల్‌స్టాఫ్‌ పడుతుంది.

యమునానది ప్రక్షాళన జరిగేనా!: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరు

కాలుష్యకారకంగా తయారైన యమునానది ప్రక్షాళన అంశంపై జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి నోటీ సులు జారీ చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదు. ప్రస్తుతం అన్ని పరిమితులకు మించి కాలుష్యం పెరిగిపోయినా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఇందువలన ప్రజారోగ్యం దెబ్బతినడమే కాకుండా నది ఉనికికే ప్రమాదం వాటిల్లే అవకాశం ఏర్పడింది.2019ఆగస్టు కల్లా నదీ కాలుష్యా నికి కారకులైన పరిశ్రమలను తరలించడం, నదిజలాల ప్రక్షాళ నకు ప్రత్యేక ప్లాంట్లు ఏర్పాటు, నది నీటి నాణ్యతపై వారానికి ఒకసారి పరీక్షలు నిర్వహించడం, ప్రవాహ స్థితిగతులను అధ్య యనంచేసి అవరోధాలను తొలగించాలని ఢిల్లీ,హర్యానా, ఉత్త రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభు త్వానికి కూడా 2016జనవరిలో జాతీయ గ్రీన్‌ట్రిబ్యునల్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఇంతవరకు అవి అమలు కాకపోవడం బాధాకరం.

కులవివక్ష తగదు:-గరిమెళ్ల భారతీదేవి, ఏలూరు, ప.గోజిల్లా

నెల్లూరు జిల్లాలో ఓ దళిత ఆశా కార్యకర్తపై అధికార పార్టీ నేతలు కుల వివక్షతో దాడిచేయడం బాధాకరం.ప్రతి ఒక్క రూ పార్టీలకతీతంగా ఇటువంటి అఘాయిత్యాలను ఖండిం చాలి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు చేసినా పాలకులు చట్టపర మైన చర్యలనుతీసుకోలేదు.రాజకీయ కండబలంతో దళితు లపై జులుం చెలాయించటాన్ని నిరోధించాలి.

నత్తనడకన భూసర్వే: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

తెలుగు రాష్ట్రాలలో భూసర్వేకు సంబంధించిన పనులు నత్తన డకన సాగుతున్నాయి.2013వ సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రం లో సమగ్ర భూసర్వే చేసి కొత్తగా దస్త్రాలను రూపొందించాలని అప్పటి రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాజకీయ కార ణాల వలన ఆ విధానం ముందుకు సాగలేదు. ఇటీవల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంయుక్త సమావేశంలో అన్ని భూ చట్టాలను కలిపి ఒక సమగ్ర రెవెన్యూ కోడ్‌ను రూపొందించా లని నిర్ణయించడం ముదావహం. ఇటువంటి ప్రయత్నం 1999 సంవత్సరంలో ఒకేసారి ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. 2016లో ఉత్తరప్రదేశ్‌ రెవెన్యూ కోడ్‌ను అమలులోకి తీసుకు వచ్చింది. ఆ అనుభవాలన్ని ఆశాజనకంగా ఉన్నందున అటు వంటి ప్రయత్నాలు జోరందుకోవాలి. నిషేధిత భూముల జాబి త సవరణకు తక్షణం చర్యలు తీసుకోవాలి.

తెగిపోతున్న మానవ సంబంధాలు: -ఉలాపు బాలకేశవులు, గిద్దలూరు, ప్రకాశంజిల్లా

భక్తిభావం, సంప్రదాయాల పట్ల గౌరవ భావం లేకపోవటానికి కారణాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన స్మార్ట్‌ఫోన్లు వినియోగం ఎక్కువకావడం, రాత్రింబవళ్లు వాటితోనే గడపడం తో మానవ సంబంధాలు తెగిపోతున్నాయి. డబ్బును విచ్చల విడిగా ఖర్చుపెట్టడం, జీవితాన్ని విలాసంగా గడపడమే తమ ధ్యేయంగా భావిస్తున్నారు. డబ్బు విలువ అసలు తెలియడం లేదు. మొదట్లో సమాజానికి భయపడి అయినా మసలుకునే వారు. తమ అలవాట్లను పద్ధతులను హద్దుమీరకుండా జాగ్రత్త పడేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఎవరిదారి వారిది. ఇతరులను పట్టించుకునే స్థితిలో లేరు. స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత మరీ అధ్యాన్నంగా తయారైంది.

అరాచకత్వాన్ని అణచివేయాలి:-బి.ఎన్‌.సత్యనారాయణ, హైదరాబాద్‌

దేశంలో అరాచకత్వం పెరిగిపోయింది. డబ్బు, అధికారాల మధ్య విడదీయని బంధంబలపడిపోయింది. ప్రశ్నించేవారు పరువ్ఞను,ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. మహి ళలు ఆటబొమ్మలుగా మిగిలిపోతున్నారు.మృగాళ్ల, దుష్టుల దౌర్జన్యాలకు బలిఅయిపోతున్నారు. అసహాయులై ఆక్రంద నలు చేస్తున్నారు. వారి రోదనలు వినే నాధుడే లేకుండాపో తున్నాడు.చట్టాలు, న్యాయాలు సైతం చెవిటివైపోయాయి. సమాజమైతే కులం,మతాలపేరుతో కల్పితఘర్షణలతో కు మిలిపోతూఉంది. న్యాయానికి న్యాయం, నేరానికి శిక్ష పడే రోజులువస్తాయో లేదో అనేది అందరి ఆలోచన.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/