ప్రజావాక్కు

Voice of the People
Voice of the People

పెరుగుతున్న అంతరం:- సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

దేశంలోచదువుకునే విద్యార్థులసంఖ్య గతదశాబ్దకాలంతో పోలి స్తే 12 శాతం వృద్ధి సాధించడం మంచి పరిణామమే అయినా నానాటికీ ప్రైవేట్‌ ప్రభుత్వ విద్యల మధ్య పెరుగుతున్న అంతరం ఆందోళన కలిగిస్తోంది. ప్రైవేట్‌ పాఠశాలలు ఆంగ్ల మాధ్యమానికి పెద్దపీట వేస్తూ మాతృభాషకు సమాధికడుతు న్నాయి. మెరుగైన సాంకేతికత ద్వారా విద్యార్థులకు జ్ఞాన బోధన చేస్తూ వారిలో నూతన ఆవిష్కరణలకు అవకాశం ఇచ్చే ఆలోచనా విధానాన్ని పెంచి పోషిస్తున్నాయి.మరొకపక్క ప్రభు త్వ విద్యారంగంలోకాలం చెల్లినసిలబస్‌,విద్యాబోధనా పద్ధతు ల వలన ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులలో సృజనాత్మకత, వ్యక్తిత్వవికాసం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ లోపి స్తున్నాయి. ఉద్యోగాల విషయానికి వస్తే అన్నింటా ప్రభుత్వ పాఠశాలలో విద్య ఆర్జించిన విద్యార్థులు వెనుకబాటుతనాన్నే ప్రదర్శిస్తున్నారు. విజ్ఞానపరమైన అంతరాల కారణంగా ప్రభు త్వ విద్యాసంస్థల విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలల విద్యా ర్థులతో పోటీపడలేకపోతున్నారన్నది వాస్తవం.

ప్రజలకు మరింత భారం:-ఎం.రామచంద్రరావు, అన్నవరం, తూ.గోజిల్లా

రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు ఐదువ తేదీ నుండి ఇసుకరీచ్‌ల నుండి ఆన్‌లైన్‌ బుక్‌ చేసుకున్నవారికి ఇసుక పంపిస్తామని పెద్దక్షరాలతో పేపర్లలో ప్రకటించారు. జగన్‌ ప్రభుత్వం రేట్లు కూడా ప్రకటించింది. కానీ ఏది ఎక్కడ ఇసుక? ఇసుక లేక కట్టడాలు ఆగిపోవడంతో తాపీ పనివారు పస్తులతో పడుకోవ లసిన పరిస్థితి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లాకు 100 రీచ్‌లు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. గోదావరి నుంచి ఇసుక తెచ్చుకోవాలంటే తలకుమించిన భారమే.ఇసుక ఖరీదు తక్కు వైనా చేరవేసే లారీ చార్జీలు భరించడం కష్టం.

విచ్ఛిన్నం అవుతున్న పర్యావరణం: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలను వెలికి తీసేందుకు పర్యావరణశాఖ, తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన అనుమతులు తక్షణం రద్దు చేయాలి. ఈ చర్యల వలన చెంచు ల జీవితాలు విచ్ఛన్నం కావడంతోపాటు పర్యావరణం కూడా పూర్తిగా దెబ్బతింటుంది. లక్షలాది మూగజీవాలకు ముప్పు వా టిల్లే ప్రమాదం ఉందన్న జాతీయ జీవవైవిధ్య పరిరక్షణ సమి తి హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రమాదకరమైన యురేనియం తవ్వకాలు పర్యావరణాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఎక్కువగా ఉంది.

పడవ ప్రమాదం అత్యంత దురదృష్టకరం:-బుగ్గన మధుసూదనరెడ్డి, బేతంచెర్ల, కర్నూలుజిల్లా

కర్ణుడిచావ్ఞకు సవాలక్ష కారణాలు ఉన్నాయి అన్న చందాన ఈ ఘోరబోటు ప్రమాదానికి గలకారణాలు విశ్లేషిస్తూపోవడం మూ లాన ఇప్పుడు ఒరిగేది ఏమీలేదు.ఎందుకంటే జరగాల్సిన నష్టం ఎప్పుడోజరిగిపోయింది.ఇందుకు ఎవరినినిందించి లాభం లేదు. అయితే ఏ ఒక్కరు కూడా ఏమాత్రం జీర్ణించుకోలేని ఈ దుఃఖ భరితమైన పడవ ప్రమాద ఘటన మరణించిన వారి తరపు బంధువ్ఞలకు, కన్నవారికి తీవ్రశోకాన్ని మిగిలించిన నేపథ్యంలో ఈ ఘటన జరగడం వెనుక గల కారణాలను చాలా లోతుగా విశ్లేషించి అందుకు కారణభూతులు అయిన ప్రతిఒక్కరిని చాలా కఠినంగా శిక్షించాల్సినబాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై, న్యాయ వ్యవస్థపై ఎంతైనా ఉంది. అలా చేయకుంటే మళ్లీ మళ్లీ ఇలాం టి దుర్ఘటనలు జరిగే ప్రమాదం ఉంది. ఏమైనా పర్యాటకులు సైతల చేతులు కాలిన తర్వాత ఆకులుపట్టుకున్న చందాన కా కుండా కాస్తంత ముందు జాగ్రత్త వహించి ఇలాంటి దుస్సాహ సాలకు ఒడిగట్టకుండా ఉండాలి.

గ్రామ సచివాలయ ఉద్యోగులే కీలకం: -యం.రాంప్రదీప్‌, తిరువూరు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామసచివాలయ ఉద్యోగాల నియామకాన్ని చేపట్టింది.గ్రామసచివాలయ ఉద్యోగు లతో పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది. గ్రామంలో ప్రజ లెదుర్కొనే సమస్యలకు సత్వరపరిష్కారం దొరుకుతుంది. ఇప్ప టిదాకా గ్రామానికి సంబంధించి ప్రజలు తమ పనుల కోసం వి.ఆర్‌.ఓ.,వి.ఆర్‌.ఏలపై ఆధారపడుతున్నారు. జనాభా లెక్క లు,ఎన్నికలకు సంబంధించిన విధులని ఉపాధ్యాయులు చూడ టం జరుగుతుంది. అయితే గతంతో పోల్చితే పాఠశాలలో ఉపా ధ్యాయులు బోధనతోపాటు, ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసే పలు రకాల సంక్షేమ పథకాలని కూడా పర్యవేక్షిస్తున్నారు. ఉపాధ్యాయులు చేసే ప్రభుత్వ పనులను గ్రామసచివాలయ సిబ్బందికి అప్పగిస్తే బాగుంటుంది.

రోడ్డు ప్రమాదాలను నివారించాలి: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

దేశంలో పెచ్చుపెరుగుతున్న రోడ్డుప్రమాదాలు దేశఆర్థిక వ్య వస్థపై తీవ్రప్రభావం చూపుతున్నాయి. రోడ్డు ప్రమాదాల వలన ఏటా దేశ స్థూల జాతీయోత్పత్తి మూడు శాతం తగ్గుతోందని నేషనల్‌ రోడ్‌ సేఫ్టీకౌన్సిల్‌ అంచనావేసింది.రోడ్డుప్రమాదాల లో ఏటా 80వేల మంది చనిపోతుండగా మూడు లక్షల మంది గాయాలపాలవ్ఞతున్నట్లు సదరునివేదికలు పేర్కొంటున్నాయి.