వ్యర్థాలతో నిండిన రోడ్లు

ప్రజావాక్కు
                             వ్యర్థాలతో నిండిన రోడ్లు

DRAIN
DRAIN

వ్యర్థాలతో నిండిన రోడ్లు
విశాఖనగరంలో పలు కాలనీలకు ఆనుకొని వున్న ప్రధాన గెడ్డలు గత కొంతకాలంగా శుభ్రతకు నోచుకోక పోవడం వలన ప్రతీ చోట వ్యర్థాలతో నిండి, మురుగు నీటి ప్రవహం పూర్తిగా నిలిచిపోయింది. దీని వలన ఈ ప్రాంత ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీని వలన చాలా చోట్ల దుర్వాసన వెదజల్లడంతో పాటు, దోమలు ఇతర క్రిమికీటకాలు ప్రబలి పలువురు వివిధ రకాల విష జ్వరాల బారిన పడుతున్నారు. స్వచ్ఛభారత్‌ పేరిట గెడ్డల ను ఆధునీకరించి పైన శ్లాబులను ఏర్పాటు చేస్తామన్న నగరపాలక సంస్థ కమిటి ఇంతవరకు అమలుకు నోచు కోలేదు. వేసవి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మార్చి నెలలోనే కాలువలు, గెడ్డలలో పేరుకుపోయిన మురుగును తోలగించేందుకు చేపట్టాల్సిన ప్రత్యేక చర్యలు ఇంత వరకు ప్రారంభంకాలేదు.
– సి. ప్రతాప్‌, శ్రీకాకుళం

బాల కార్మికుల పెరుగుదల ఎందుకు?
దేశంలో గత దశాబ్ధకాలంగా బాలకార్మికుల సంఖ్య 12 శాతం పెరిగిందన్న జాతీయ బాలవికాస సంక్షేమ శాఖ తాజా నివేదిక పాలకులకు కనువిప్పుకావలి. ఈ బాల కార్మిక వ్యవస్ధను సమూలంగా నిర్మూలించి, బాలలం దరినీ బడిబాట పట్టించడానికి తగు చర్యలు తీసుకోవా లని 2010లోనే సుప్రీం కోర్టు దిశా నిర్దేశం చేయగా ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రణాళికలు క్షేత్రస్ధాయిలో విఫలమయ్యా యని తాజా నివేదిక తెలియచేస్తోంది. బాలల ఉపాధి చట్టం 1938, బాల కార్మిక నిషేధిత చట్టం 1986 వంటివి అమలులో వున్నా బాలకార్మిక వ్యవస్ధ కొనసాగు తుండడం ఆందోళన కరం. కేవలం భవన నిర్మాణం, హాటల్స్‌, షాపింగ్‌ మాల్స్‌, వంటివి కాకుండా ప్రమాద భరితమైన పేలుడు పదార్థాల తయారీ, ఆటోగ్యారేజీలు, బార్‌ల వంటి ప్రదేశాలలో కూడా ఇంకా బాల కార్మికులు లక్షల్లో పనిచేస్తున్నారు. పేదరికం, నిరుద్యోగం, మద్యపానం వంటి కారణాల వలన తల్లిదండ్రులు పిల్లలను పనులకు ప్రోత్సహిస్తుం డడం ఆందొళన కరం. ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయవడంతో పాటు బాలల సంక్షేమం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి, సమాజంలో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, పౌరసమాజం విస్తృతంగా ప్రచారో ద్యమం చేపట్టాలి. బాల్యానికి రక్షణ, సంరక్షణ ఒక సామాజిక బాధ్యతగా భావించాలి .
– ఎం. కనకదుర్గ, తెనాలి

రహదారులపై మొక్కలు నాటాలి
తెలంగాణాలో హరిత హారం కార్యక్రమం పేరిట మొక్కలను విరివిగా నాటుతున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో మొక్కలు, నాటుతూ భవిష్యత్‌ తరాలకు బంగారు బాట చూపుతోంది. అలాగే విస్తరిస్తున్న రహదారులకు ఇరువైపులా మొక్కలకు నాటి వాటి పోషణ పట్ల సరైన శ్రద్ధ చూపితే అనేక ఉపయోగాలుంటాయి. రోడ్లకిరువైపులా ఉండే వృక్షాలు సూర్య ప్రతాపాన్ని అడ్డుకోవడం మూలంగా అవి ఎక్కువ కాలం మన్నుతాయి. చుట్టూ వెల్లివెరిసే పచ్చదనం వయోృ ధ్ధులకు వడదెబ్బ తగలకుండా రక్షణ కల్పిస్తుంది. ద్వి చక్ర వాహనదారులకు, పాదచారులకు ఎండ వేడిమి తెలియదు. ప్రభుత్వం, అటవీశాఖ, పర్యావరణ సంస్థలు ఈ దిశగా చర్యలు చేపడితే దీర్ఘ కాలంలో రాష్ట్రానికి ఎంతో మేలు ఒనగూడుతుంది.
– జి.అశోక్‌, గోదూర్‌, జగిత్యాల జిల్లా

సినిమా థియేటర్ల దోపడీని అరికట్టాలి
వినోదం కోసం సినిమా థియేటర్లకు వెళితే ప్రేక్షకులకు పర్సులు ఖాళీ అవుతున్నాయి. సినిమా టిక్కెట్‌ ధరలు గత నెలలో 20 శాతం పెంచేశారు.టిక్కెట్‌ ధరలోని వాహన పార్కింగ్‌ ఛార్జీలు ఇమిడిఉన్న, పార్కింగ్‌ ఫీజుల పేరుతో అదనంగా ఇరవై రూపాయల నుండి యాభై రూపాయల వరకు వసూల్‌ చేస్తున్నారు. సినిమా థియేటర్లు, కమర్షి యల్‌ కాంప్లెక్స్‌, మల్టీ ప్లెక్స్‌లలో పార్కింగ్‌ ఫీజులు వసూలు చేయడాన్ని నిషేధిస్తూ రాZష ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 20 న విడుదల చేసిన జి.వో.నం.63 ఎక్కడ అమలు కావడంలేదు. అధికారుల పర్యవేక్షణ లోపించిన కారణంగా అన్ని థియేటర్లలో పార్కింగ్‌ ఫీజుల వసూళ్ళు యదేచ్ఛగా సాగుతున్నాయి.ఉచితంగా మంచి నీరు ఇవ్వాలన్న నిబంధనలకు నీళ్ళొదిలి థియేటర్లలో వాటర్‌ బాటిల్స్‌ ఎం.ఆర్‌.పి. కంటే ఎక్కువ ధరలకు ధరలకు అమ్ముతున్నారు. కూల్‌ డ్రింక్స్‌,టెట్రో ప్యాక్స్‌, పాప్‌ కార్న్‌, ఐస్‌ క్రీములను సగటు ధర కంటే మూడు రేట్లకు ఎక్కువ అమ్ముతున్న పట్టించుకునే నాథుడే లేడు.
– సి.ఎచ్‌. సాయి ఋత్విక్‌, నల్గొండ

మంచి ప్రవర్తనకు మార్కులు
ప్రభుత్వ, ప్రైవేట్‌ హైస్కూళ్లలో ఆరు నుంచి పదో తరగతి చది వే విద్యార్థులకు హాజరు, పరీక్షా ఫలితాలతోపాటు విద్యార్థుల ప్రవర్తనకూ కొన్నిమార్కులు కేటాయించాలి. దీనివల్ల ఉపాధ్యా యులు పట్ల చదువ్ఞల పట్ల శ్రద్ధాసక్తులు వినయ విధేయ తలు అలవరచుకుంటారు. క్రమశిక్షణ, వినయ విధేయతలు గల వారే సంస్కారవంతులుగా తయారవ్ఞతారు.
-జె. గుణశేఖర్‌, హైదరాబాద్‌