రాజకీయంలో కమల్‌ రాణించేనా?

ప్రజావాక్కు

KAMAL HASSAN
KAMAL HASSAN

రాజకీయంలో కమల్‌ రాణించేనా?: -కామిడి సతీష్‌రెడ్డి, జయశంకర్‌జిల్లా

కమల్‌హాసన్‌ రాజకీయరంగ ప్రవేశం చేసి మక్కల్‌ నీది మయ్యం( ప్రజాన్యాయకేంద్రం) పార్టీని స్థాపించారు. భారత దేశంలోనే తమిళనాట రాజకీయరంగం భిన్నంగా ఉంటుంది. అవినీతి, అక్రమాలు తమిళనాట పెరిగిపోతున్నాయి. ప్రజలు కూడా రాజకీయాలంటే ఈసడించుకునే పరిస్థితి నెలకొంది. జయలలిత మరణం తర్వాత అధికారంలోకి రావడానికి వివిధ పార్టీలు ఎన్ని కుయుక్తులు పన్నాయో! సున్నితమనస్తత్వం గల కమల్‌హాసన్‌ తన పార్టీని తమిళనాడులో ఎలా విస్తరింపచేస్తా రో,అభిమానుల ఆరాద్యుడైన కమల్‌ రాజకీయరంగంలో కూడా రాణించి అవినీతి, అక్రమాలు లేని నూతన తమిళ రాజ్యాన్ని ఆవిష్కరింపచేస్తారని ఆశిద్ధాం.

అంగడి ప్రాంతాల్లో ఇబ్బందులు :-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

జంటనగరాలలో పలుప్రాంతాలలో వారాల ప్రకారం రోజుకొక చోట చొప్పున ప్రతి వారంలో ఏడు రోజులూ వేర్వేరు ప్రాం తాలలో కూరగాయల అంగడి కొనసాగుతుంది. వినియోగదా రులకు కూరగాయల కొనుగోలుకై దూరప్రాంతాలకెళ్లకుండా తమ ప్రాంతంలోనే వారానికోరోజు వారానికి సరిపడా కూర గాయలు కొనే వీలుంది. అయితే ఈ అంగడి చాలా ప్రాంతా లలో సిటీ బస్సులు,భారీ వాహనాలు తిరిగే రోడ్లపై రెండు వైపులా పెట్టడం వలన ఈ రోడ్లు జనంతో కిక్కిరిసి, భారీగా ట్రాఫిక్‌జామ్‌ అవ్ఞతుంది. వాహనదారులూ, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.అత్యవసరంగా ఎక్కడి కైనా వెళ్లాలంటే నరకమే.
ఉపాధ్యాయ నియామకాల్లో జాప్యం: -జి.అశోక్‌,గోదూర్‌, జగిత్యాలజిల్లా

ప్రభుత్వం గతఏడాది ప్రకటించిన ఉద్యోగాల నియామ కాల ప్రకటనల పరీక్షల ఫలితాలు కచ్చితంగా ఫలానా తేదీ కల్లా ప్రకటిస్తామని ఆర్భాటంగా ప్రచారం చేసింది. కానీ విచిత్రంగా ఈసారి తెలంగాణ విద్యాశాఖకు సంబంధించిన గురుకుల ఉపాధ్యాయ నియామకాల్లో తీవ్ర జాప్యం జరు గుతోంది. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, నియామక ఉత్తర్వులు వగైరాలన్నింటిలోనూ విపరీతజాప్యం జరుగుతోంది. పి.జి.టికి ఎంపికైన అభ్య ర్థుల సర్టిఫికెట్లను టి.ఎస్‌.పి.ఎస్‌.సి,వారు పరిశీలించారు. ఎం పికైన అభ్యర్థులకు నియామక పత్రాలు కూడా అందచేశారు. తిరిగి వీళ్లకు గురుకుల సొసైటీ అధికారులు సర్టిఫికెట్లను పరిశీలిస్తామని మళ్లీ ప్రకటించారు.

విద్యావిధానంలో సంస్కరణలు: -ఎస్‌.శ్రీనివాస్‌, హైదరాబాద్‌

నేటి విద్యావిధానం లోపాలతో కూడుకొని సాగుతున్నది. ఎన్ని సంస్కరణలు వచ్చినా విద్యార్థులపై ఒత్తిడి తగ్గడం లేదు. మా ర్కులు లేదా మంచి గ్రేడులే లక్ష్యంగా చదువు. చదు వే తప్ప ఆట,పాటలు, కళలు, నైతికవిద్య కరవైంది. ప్రైవేట్‌ పాఠ శాలల్లోనైతే మరీ ఎక్కువ ఒత్తిడిపిల్లలపై ఉంది. ఇది విద్యార్థుల ప్రవర్తనపై దుష్ప్రభావాన్ని చూపుతుంది.ఫలితంగా చాలామంది విద్యార్థుల ప్రవర్తన గాడి తప్పుతున్నది. విద్యార్థులకు నిత్యం చదువ్ఞతోపాటు ఆటపాటలు తప్పనిసరిగా ఉండాలి. కళలనూ నేర్పాలి.అయితే నైతికవిద్య తప్పనిసరి అని మరవరాదు.
పేరుకు మాత్రమే స్వచ్ఛభారత్‌:-కె.రామస్వామి, నల్గొండ

దేశవ్యాప్తంగా స్వచ్ఛసేవా కార్యక్రమం జయప్రదంగా ముగిసిందని కేంద్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించుకుంది. గత మూడేళ్లుగా చేపడుతున్న స్వచ్ఛభారత్‌, స్వచ్ఛ సర్వేక్షణ్‌ పథకాల ద్వారా పరిసరాల పరిశుభ్రత 25 శాతం పెరిగిందని కూడా ప్రధాని ప్రకటించారు. అయితే ఈ నినాదాలు, ప్రకట నల హోరు కేవలం కాగితాలపై పరిమితం తప్ప క్షేత్రస్థాయిలో ఏమాత్రం ప్రభావం చూపలేదన్నది నగ్నసత్యం.నగరాల నుండి గ్రామాల వరకు ఎక్కడ చూసినా అపరిశుభ్రత తాండవిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రులు,ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్‌, రైల్వే స్టేషన్లు అపారిశుద్ధ పరిస్థితులతో అడుగుపెట్టశక్యంగా లేవు.

నీటి కరవు : -ఎస్‌.శేషసాయికుమార్‌, రామచోటి, కడపజిల్లా

ప్రస్తుత మన జీవనంలో నీరు కోసం రెండు ప్రాంతాలు, దేశా లు,రాష్ట్రాలు పోరాటం జరుపుతూ ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం. కానీ మనిషికి ప్రాథమిక అవసరమైన తాగునీరు లభిం చని గ్రామాలను చూస్తే ముందుకెళ్లుతున్న మనదేశం నీరులేక వెతుకులాట ప్రారంభిస్తోందన్న అనుమానం కలుగుతోంది. ‘నీటి పొదుపు -రేపటికి గెలుపు అన్న సూత్రాన్ని ఆచరిద్దాం.
రహదారి నియమాలు పాటిద్దాం;-ఎస్‌.సునీల్‌కుమార్‌, తిరుపతి

రహదారి నియమాలు పాటించడం వల్ల మన ప్రాణాలను మన మేకాపాడుకున్నవాళ్లమవ్ఞతాం.హెల్మెట్‌ ధరించడం,వేగ నియం త్రణ, మద్యపానం సేవించడం అనంతరం వాహన చోదనం ఇలాంటి వాటివల్ల ఇబ్బందులు పడటమేగాక పక్కన వారికి సైతం అనేక ప్రాణాపాయ విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి. ప్రతి ఒక్కరూరహదారి నియమాలు పాటించాలి.