బస్టాండ్లను ఏర్పాటు చేయాలి:

ప్రజావాక్కు

TS Buses
TS Buses (File)

బస్టాండ్లను ఏర్పాటు చేయాలి: -జి.అశోక్‌, గోదూర్‌, జగిత్యాలజిల్లా

తెలంగాణ రాష్ట్రంలోని అనేక పట్టణాలలో, గ్రామాలలో బస్టాండ్‌లు లేవ్ఞ. కొన్ని చోట్ల ఉన్న బస్టాండ్‌లలో కనీస సదు పాయాలు కల్పించే ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం విడ్డూ రం. రాత్రిపూట ప్రయాణం చేసేవారు ఎదుర్కొంటున్న ఇబ్బం దులు అనేకం. బస్సు ప్రయాణాల్లో ఏ ఊళ్లో బస్సు ఆగిందో తెలియడం లేదు. బస్టాండ్లలో అదే ఊరో ఆ గ్రామం పేరు తెలియచేసే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలి. చాలా చోట్ల మిషన్‌ భగీరథపైప్‌ లైన్ల వలన పాత బోర్డులు తీసివేశారు. తిరిగి కొత్త బోర్డులు పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు గదా! తెలియని ప్రాంతానికి వెళితే ఇక ఇబ్బందులు చెప్పనవసరం లేదు. రైల్వేస్టేషన్లలో వలె అది ఏ ఊరో సూచించే బోర్డులు ఇకనైనా ఏర్పాటు చేస్తే మేలు.

అడ్డుతగులుతున్న విద్యుత్‌ తీగలు: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండనల్గొండ జిల్లా

నాగార్జున సాగర్‌ కాలనీలలో పలు ఇళ్లలో ఉన్న చెట్ల కొమ్మల మధ్యగుండా, ఇండ్ల మీదుగా విద్యుత్‌ తీగలు వేయబడి ప్రమాదకరంగా మారాయి. ఇందువలన తరచుగా ఇళ్లకు ఎర్త్‌కరెంట్‌ వచ్చి లోహపు వస్తువ్ఞలు తీసినప్పుడు షాక్‌ కొడుతుంది. మరికొన్ని చోట్ల పాత తీగలను మార్చి వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేశారు. ఈ పాత తీగలను తీయకుండా వదిలేయడం వలన అవి తరచుగా వాహనదారు లకు అడ్డంపడి ప్రమాదాలకు కారణమవ్ఞతున్నాయి. ఇక పలు ట్రాన్స్‌ఫార్మర్లు పాతకాలం నాటివి కావడం వలన తరచుగా లోవొల్టేజి, హై వోల్టేజి సమస్యలతోపాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతోంది.
సిసికెమెరాలను ఏర్పాటు చేయాలి: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

విద్యారంగం ప్రైవేట్‌పరం అయ్యాక విప్లవాత్మక మార్పు లు సంభవించి వ్యాపారాత్మక ధోరణులు చోటు చేసుకుం టున్నాయి.జ్ఞానసముపార్జన, వ్యక్తిత్వవికాసం, మేధోసం పత్తి ఇత్యాది అంశాల కంటే మార్కులు, పర్సెంటేజీలు, గ్రేడులు,ర్యాంకులే ధ్యేయంగా నేటి విద్యావిధానం కొనసా గుతుండడం బాధాకరం. మార్కుల సముపార్జనే ముఖ్య మన్న విపరీత ధోరణితో కాపీయింగ్‌ ను ప్రోత్సహించడం విద్యావ్యవస్థను నాశనం చేయడమే. విద్యాసంస్థలలో సిసి టివికెమెరాలు ఏర్పాటుచేయాలన్న హైకోర్టు మార్గదర్శకాల ను ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయడం లేదు.
కొన్ని ఆప్స్‌పై నిషేధం ప్రకటించాలి:-మహ్మద్‌ రసూల్‌, హైదరాబాద్‌

మనది గొప్పదేశం. సాంస్కృతికదేశం.భారతదేశంలోని సంస్కృ తులు, సంప్రదాయాలను ఇతర దేశాలు కూడా ఇష్టపడతాయి. ఆధునిక సాంకేతిక విజ్ఞానం పెరిగిన కొద్దీ యువత జీవితాల్లో కూడా మార్పు సంతరించుకుంటుంది. సాంకేతిక విజ్ఞానం పెరగడం మంచిదే. కానీ దానిని చెడుకు ఉపయోగించడం వల న యువత జీవితాలు కూడా నాశనం అవ్ఞతున్నాయి. చరవా ణిలు వచ్చినప్పటి నుండి యువత జీవితాలే మారిపోయాయి. ఎప్పుడుసెల్‌ఫోన్‌లో చాటింగ్‌లు,వీడియోలుచూడడం చేస్తున్నా రు. దీని ద్వారా వారి జీవితాలు పాడైపోతున్నాయి. ఫోన్‌లో ఉండే కొన్ని ఆప్స్‌ను ప్రభుత్వం నిషేధించాలి.

సమాజంలో చీలికలు: -బి.ఎన్‌.సత్యనారాయణ, హైదరాబాద్‌
మనం నేడు విడివడి మనుగడ సాగిస్తున్నాం. కుటుంబాలలో ఉమ్మడికి నూకలు చెల్లిపోయి చిన్న చిన్న కుటుంబాలుగా చీలి పోతున్నాయి. అలాగనే సమాజంలో కులవిభజన మరింత బల పడిపోయింది. అందుకు అవసరమైన తాయిలాలు అందిస్తూ ప్రభుత్వాలు సమాజాన్ని తుంచడంలో కీలకమైన పాత్రలు పోషిస్తున్నాయి. ప్రతి కులానికి సంక్షేమ భవనాల కోసం భూ ముల్ని, కోట్లాదిరూపాయలు నిధులు మంజూరు చేస్తున్నాయి.

ఉపాధ్యాయుల ఎంపికలో కొత్త పద్ధతి: -సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యా యులలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక డి.ఈ.ఓలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. ఈ విధా నం వలన పారదర్శకతకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. దరఖాస్తు విధానంవలన కొంతమంది ఉత్తమ ఉపాధ్యాయు లు తాము ఉత్తమ ఉపాధ్యాయులమని దరఖాస్తు చేసుకో వడానికి విముఖత చూపేవారు. ఈ నూతన విధానం వలన అటువంటి వారికి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.

ఇసుక అక్రమ రవాణా: -కామిడి సతీష్‌రెడ్డి, పరకాల, వరంగల్‌జిల్లా
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఇసుక మాఫియా ఆగ డాలు,దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి. నిత్యం లక్షలాది వాహ నాలు, లారీలు, టిప్పర్లు ట్రాక్టర్ల ద్వారా వాగులు, నదులు క్వారీల నుండి ఇసుక అక్రమంగా వివిధ జిల్లా కేంద్రాలతోపాటు హైదరాబాద్‌ నగరానికి తరలింపబడుతుంది. కాళేశ్వరం ఇసుక రీచ్‌ నుండి ప్రతి రోజు వేలాది లారీల ఇసుక వివిధ ప్రాంతా లకు తరలింపబడుతుంది.