ప్రజావాక్కు

Voice of the People
Voice of the People

రైతులకు కూలీల సమస్య

ఇప్పటివరకు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించి, ఇప్పుడు గ్రామీ ణ ఉపాధి హామీ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖామాత్యులు జిల్లా అధికారులను ఆదేశిం చడం పూర్తిగా బాధ్యతారాహిత్యమనేచెప్పాలి. ఇప్పుడు గ్రామా ల్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏ మాత్రం ఆలస్యం జరిగినా అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు సమయానికి కూలీలు అందుబాటులో లేకపోతే ఎదురయ్యే ఇబ్బందులను పాలకులు ఆలోచించాలి.విధాన,పాలనా వ్యవహారాల్లో మంత్రుల అనుభ వరాహిత్యంఅడుగడుగునా ప్రస్ఫుటం.ఇప్పటివరకుచేసిన పను లకు ఇంతవరకూ బిల్లులు చెల్లించలేదు. చిన్న చిన్న గుత్తేదారు లు, పంచాయతీ సర్పంచులు అప్పులు తీసుకువచ్చి పనులు చేయించారు. ఇప్పుడు ప్రభుత్వం అధికారులను ఆదేశించినా చేయడానికి ఎవరూ ముందుకు వచ్చేసాహసంచేయరు.ఈ ఒం టెద్దుపోకడలు రాష్ట్రప్రజలకుచాలా నష్టదాయకంగా ఉన్నాయి.
-గరిమెళ్ల రామకృష్ణ, గన్నవరం, కృష్ణాజిల్లా

కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి

కిలో ఉల్లిపాయలు వంద రూపాయలు పైబడి పలుకుతుంది. ఆంధ్రాలో గల ఎనభై అయిదు రైతుబజార్లో ఆధార్‌ కార్డుతో పూటల కొద్ది పడి గాపులు పడితే నిల్వలుంటే, పాతికకు దొరుకుతుంది. పల్లెల్లో రైతు బజార్లు లేని ప్రాంతాల్లో ప్రజలు ఉల్లి దర్శనమే గగనమవ్ఞతుంది. జిహ్వ రుచికి ఉల్లి లేని కూర ఊహకే అందనిది. ముఖ్యమంత్రి ఉల్లి అవసరాన్ని గుర్తించి, నవరత్నాలలో చేర్చి ప్రతి రేషన్‌కార్డుకి నెలకు కనీసం ఐదు కిలోలు చొప్పున పంపిణీకి ఆదేశాలిచ్చి ప్రజలను ఆదుకోవాలి.
-యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు సమంజసమైనదే!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితు లనుఎన్‌కౌంటర్‌ చేయడంప్రజల్లో హర్షం వ్యక్తమవ్ఞతుంది. ఈ కేసుకు సంబంధించి ఫాస్ట్‌ట్రాక్ట్‌ కోర్టు ఏర్పాటుకు హై కోర్టుఅనుమతి ఇవ్వడంకీలక అంశం.అలాగే మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు అనుమతి ఇవ్వ డం నేరాల తగ్గింపునకు సూచికగా భావించవచ్చు. అదే విధంగా పరిధితో సంబంధం లేకుండా మహిళల అపహ రణ కేసులను తక్షణమే నమోదు చేసి జిరో ఎఫ్‌ఐఆర్‌ విచారణజరపాలని ప్రభుత్వ నిర్ణయం స్వాగతించాల్సిందే. విస్తృతంగా విద్యాసంస్థలలో అవగాహన కల్పించాలి.

-కె. సతీష్‌రెడ్డి,జయశంకర్‌ భూపాలపల్లి

రహదారుల మరమ్మతులు చేపట్టాలి


అందాలనగరంగా పేరొందిన విశాఖపట్నంలోని గాజువాక పరిధిలో రహదారులు అధ్వాహ్నంగా తయారయ్యాయి. కొత్త గాజువాక బిసిరోడ్‌, కణితిరోడ్డు, అగనంపూడి,యాతపాలెం ఏరియాల్లోని రోడ్లన్నీ మరమ్మతుల కోసం ఎదురుచూస్తున్నా యి.రహదారులు శిధిలావస్థకు చేరుకోవడంతోపాటు ఇక్కడి అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉండటం వలన కాస్త చినుకుపడితే చాలు చెరువ్ఞలను తలపిస్తోంది. రహ దారులు నడవడానికి, వాహనాలు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవ్ఞతున్నాయి. సగటున రోజుకో ప్రమా దం జరుగుతున్నా అధికారుల స్పందన శూన్యం.కొన్ని రహదా ర్లు గత అయిదేళ్లుగా మరమ్మత్తులకు నోచుకోకపోగా మరి కొన్నింటికి తూతూ మంత్రం చందాన మరమ్మతులు జరిపించి అధికారులు చేతులు దూలిపేసుకోవడం బాధాకరం.
-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

నిర్లక్ష్యానికి గురవ్ఞతున్న హోమియోవైద్యం

హోమియోవైద్యం నిర్లక్ష్యానికి గురవ్ఞతున్నది. ప్రభుత్వం ఈ వైద్యం పట్ల శ్రద్ధచూపడం లేదు. హోమియో ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత, సిబ్బంది కొరత, ఉన్న డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవ హరించడం, మందులు సరిగా లేకపోవడం వంటి సమస్యల ను ప్రజలను ఎదుర్కోవలసి వస్తుంది. సంవత్సరాల తరబడి చికిత్స కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం కొత్త హోమియో ఆస్పత్రులను ఏర్పాటు చేయాలి.
-టి. అన్నపూర్ణ, కంచరపాలెం, విశాఖపట్నం

మండల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి

ప్రతిమండల కేంద్రంలో పంచాయతీరాజ్‌ లేదా ఆర్‌ అండ్‌బి శాఖ ద్వారా అతిధిగృహాన్ని ఏర్పాటు చేయాలి. వివిధసందర్భాల్లో జిల్లా అధికారులు, మంత్రులు మండల కేంద్రాన్ని సందర్శిస్తుంటారు.అలా వారు సందర్శించినప్పు డు అతిధిగృహాన్ని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అలా వారు విశ్రాంతి తీసుకునే సమయంలో ప్రజలు జిల్లా అధికారులను, మంత్రులను కలిసి తమ సమస్యలు వారి దృష్టికి తీసుకుని వెళ్లడానికి అవకాశం ఉంటుంది. అలాగే లాడ్జీలు లేని మండల కేంద్రాలలో ప్రజలు రాత్రిపూట కూడా బసచేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అతిధిగృహాలు ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలను దృష్టి లో ఉంచుకొని, ప్రతి మండల కేంద్రంలో అతిధిగృహాన్ని ఏర్పాటు చేయడానికి నిధులు విడుదల చేయాలి..
-షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/