ప్రజావాక్కు

Voice of the people
Voice of the people

మద్యాన్ని నిషేధించాలి:- సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మద్యపానాన్ని దశలవారీగా అమలు చేస్తామని అధికారం చేపట్టిన తొలినాళ్లలో ఘనంగా ప్రకటించాయి.కాని ఆదిశగా ఎలాంటి ప్రయత్నాలను ఆరంభిం చ కపోవడం దురదృష్టకరం. మద్యం మహ్మ మారి రెండు రాష్ట్రాలను పట్టిపీడిస్తోంది. బెల్టుషాపుల పేరిట విచ్చల విడిగా జరుగుతున్న వ్యాపారం ప్రజలను రోడ్డుమీదకు తెస్తుంది. మద్యం అందుబాటులోకి రావడం వలన చదువ్ఞకున్నవారు, నిరక్షరాస్యులు,యువత,వృద్ధులు అనే తేడా లేకుండా ఈ దుర లవాటుకు బానిసలవుతున్నారు. ఈ మధ్యకాలంలో 10వ తర గతి చదువ్ఞతున్నవారు కూడా మద్యానికి అలవాటు పడుతు న్నట్లు కొన్ని అధ్యయనాలలో వెల్లడికావడం దురదృష్టకరం. కష్టపడి సంపాదించిన డబ్బు మద్యం అలవాటుకు తగలేస్తుం డడం వలన ఎన్నో లక్షల కుటుంబాలు రోడ్డున పడుతున్నా యి. మహిళాలోకం తమ కుటుంబాలకు పడుతున్న దుర్గతి చూసి ఆందోళన చెందుతుంది. ప్రభుత్వాలు తక్షణం స్పందిం చి రెండు తెలుగు రాష్ట్రాల నుండి మద్యం మహ్మమారిని పారద్రోలేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి.

మహిళలకు రక్షణేది?-ఉలాపు బాలకేశవులు, గిద్దలూరు, ప్రకాశంజిల్లా

ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేస్తున్నా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిలువరించలేకపోతున్నాయి. నిత్యం అత్యా చారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. పసిపిల్లల నుంచి వృద్ధులైన మహిళలను సైతం కామాంధులు వదలడం లేదు. ఈ అరాచకాలను అడ్డుకోవడం పూర్తిగా ప్రభుత్వం చేతి లో ఉన్న అంశంకూడా కాదు.సమాజంలో స్త్రీని గౌరవించే పద్ధ తులకు నైతిక విలువలకు పట్టం కట్టే విద్యావిధానం అందుబా టులోకి రావాల్సిన అవసరాన్ని ప్రస్తుత పెడధోర ణులు తేల్చి చెబుతున్నాయి.బాల్యం నుంచే తల్లిదండ్రుల పెంపకం పిల్లల్లో సామాజిక స్పృహను బాధ్యతను పెం పొందించేలా ఉండాలి.

పెన్షనర్లకు కార్పొరేట్‌ వైద్యం అందేనా?:-ఎన్‌.సి, ప్రసాదరావు,, పత్తిపాడు, తూ.గోజిల్లా

ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ మినహా వివిధ వర్గాలకు వర్తించే వైద్యబీమాలన్నింటినిఆరోగ్యశ్రీ గొడుగుకిందకు తేవాలని సమా వేశంలో నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఉద్యోగులు, పెన్షనర్లకు కార్పొరేట్‌ వైద్యాన్ని అందించడానికి ప్రతి నెల వారి జీతాలు, పెన్షన్‌ల నుండి కొంత మొత్తాన్ని ప్రభుత్వం సేకరిస్తుంది. సేక రించిన సొమ్మంతా ఏమవ్ఞతుందో ఎవరికీ తెలియదు. పెన్ష నర్లకు మాత్రం కార్పొరేట్‌ వైద్యం అందించడం లేదు.

పరిహారం చెల్లింపులో జాప్యం:-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

కేంద్ర అణువిద్యుత్‌ సంస్థ వేస్తున్న చిక్కుముడులు కొవ్వాడా బాధితులకు పరిహారం చెల్లింపులు, పునరావాస ప్యాకేజీ అమ లులో అనేక ఇబ్బందులు తెస్తుంది. దాదాపు మూడు దశాబ్దా లుగా ఈ ప్రాంతంలో కొత్త రైళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. ఎప్పుడు ఖాళీ చేస్తారోనన్న అనిశ్చితితో పాత ఇళ్లకు కూడా మరమ్మతులు చేయించుకోవడం §జమానులు ఆపివేసారు. అన్ని హంగులతో నిర్వాసితులకు పునరావాస కాలనీ నిర్మా ణాన్ని సొంతంగా చేపడతామన్న అణుసంస్థ హామీ కలగానే మిగిలిపోయింది. ఇతర అభివృద్ధి పథకాలతోపాటు నిర్వాసితు ల కుటుంబాలకు మిగిలిన పునరావాస ప్యాకేజి కింద చెల్లిం చాల్సిన మొత్తంలో ఇప్పటివరకు 50 శాతం మాత్రమే చెల్లించిన అణుసంస్థ మిగిలిన మొత్తంపై కనబరుస్తున్న జాప్యంపై నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

శిథిలావస్థలో ప్రభుత్వ భవనాలు: -ఎం.కనకదుర్గ, తెనాలి, గుంటూరుజిల్లా

గుంటూరుజిల్లాలో లక్షలాది రూపాయలప్రజాధనంతో నిర్మిం చినప్రభుత్వ భవనాలు మరమ్మతులకు నోచుకోకపోవడం వలన అవి శిధిలావస్థకు చేరుకున్నాయి. అధికారులు వాటి గురించి అసలేమాత్రం పట్టించుకోకపోవడం వలన అవి ఎప్పుడు కూలు తాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వివిధ తహశి ల్దారు ఆఫీసులు, వసతి గృహాలు, మున్సిపల్‌ క్వార్టర్లు, పార్కు లు వందల సంఖ్యలో శిధిలావస్థకు చేరుకున్నాయి. ఇక జిల్లా లో వివిధ మండలాలలో నిర్మించిన మున్సిపల్‌ క్వార్టర్స్‌ అసాంఘిక కార్యకలాపాలకు నెలవ్ఞగామారాయి.అనేక ప్రభుత్వ స్కూళ్లు కూడా శిధిలావస్థకు చేరుకొని పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. చిన్నచిన్న సమస్యలు తలెత్తినప్పుడే భవనాల మరమ్మతులపై అధికారులు దృష్టి సారించాల్సింది.

ఇప్పటి నుంచే ఎందుకు?: -మిథునం, హైదరాబాద్‌

తెలంగాణా ప్రభుత్వాన్ని విమర్శించడానికి కేంద్ర మంత్రులు తరచు రాష్ట్రానికి వస్తున్నారు. ఇక్కడ భారీ బహిరంగ సభల్లో పొల్గొంటూ మంత్రుల అవినీతి గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణా విమోచన దినోత్సవం రోజున కూడా వారు ఒక భారీ బహిరంగ సభలో పాల్గొని తెలంగాణా రాష్ట్రసమితి పాల నపై విమర్శలు చేసారు. మంత్రుల రాకపోకలు, సభలు సమా వేశాలు ప్రసంగాలు, విమర్శలు ఇవన్నీ తెలంగాణాలో పాగావేయడానికే. ఇంకా దానికి నాలుగేళ్ల సమయం ఉంది.

తాజా క్రీడావార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/