ప్రజావాక్కు

Voice of the People
Voice of the People

కొండంత విజయం గోరంత నిరాశ:- డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

ప్రతిష్టాత్మక రోదసీయాత్ర చంద్రయాన్‌-2ని సంపూర్ణ విజ యానికిదగ్గరలో నిలిపిఇస్రో శాస్త్రవేత్తలు చేసినకృషిలో సంపూ ర్ణ చంద్రబింబంలో చిన్న మచ్చ ఉన్న చందంగా జైత్రయాత్ర చివరలో చిన్న అవాంతరం ఏర్పడినప్పటికీ యావత్‌ ప్రపంచ భారత్‌ విజయాన్ని ముక్తకంఠంతో ప్రశంసించడం విశేషం. ముఖ్యంగా చంద్రయాన్‌ ద్వారా సాధించబోయే శాస్త్రీయ విజ్ఞానం అన్ని దేశాలకు ఉపయోగపడుతుంది. అతి తక్కువ ఖర్చు తో వెయ్యికోట్లతో అంటే రెండుమూడు తెలుగు సినిమాలు తయారైన ఖర్చుతో చంద్రయానం పూర్తయింది.అందుకు విని యోగించిన సంక్లిష్టమైన క్రయో జెనిక్‌ ఇంజన్‌ పూర్తి స్వదేశీ తయారీ.లక్షలాది కిలోమీటర్లు అనుకున్నట్టుగానే చేరడం జరి గింది. చందమామ వాకిలి వరకు చేరినా చందమామ ఇంట్లోకి చేరలేకపోవడమే కొంచెం నిరాశకుకారణం.అయితేనేమి చంద్రు డికి 100 కిలోమీటర్ల పరిధిలోని కక్ష్యలో హాయిగా కుదురుకు న్న ఆర్బిటర్‌ సంవత్సరం పాటు తనపని చేసుకుంటుంది.

గ్రంథాలయ నిర్వహణలో లోపాలు:-షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

గ్రంథాలయాల నిర్వహణలో చాలా లోపాలు ఉన్నాయి. ప్రభు త్వ అధికారులు ఎవ్వరూ గ్రంథాలయాల నిర్వహణలో జోక్యం చేసుకోవడం లేదు. చాలా గ్రంథాయాలు చిన్న చిన్న గదులలో నడుస్తున్నాయి. అలాగే చాలా గ్రంథాలయాలు శిధిలావస్థలో ఉన్నాయి. కొన్ని గ్రంథాలయాలు చీకటిలో ఉన్నాయి. అలాగే గ్రంథాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా కొంత మంది అరకొర జీతంతో పనిచేస్తున్నారు. వారిని రెగ్యులర్‌ చేసి, వారికి సరిపడ జీతాలను ఇస్తే బాగుంటుంది.

పనులు వేగవంతం చేయాలి:-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట, భూపాలపల్లిజిల్లా

ప్రజాకవి కాళోజీ నారాయణరావు తెలంగాణ మాండలికానికీ వన్నె తెచ్చారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే కాళోజీ తన జీవితాన్ని గడిపారు. ప్రశ్నించేతత్వం, ధిక్కారస్వరం, అందరి గొడవే తన గొడవ అంటూ తెలంగాణ ప్రాంతానికి జరుగుతు న్న అన్యాయాలను వివక్షతను ఎండగట్టిన ప్రజాకవిగా కాళోజీ ప్రజలహృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు. హన్మకొండ లో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణానికి 2014 సెప్టెంబర్‌ 9వ తేదీ న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. హయగ్రీవాచారి గ్రౌండ్‌ లో నిర్మించతలపెట్టిన కళాక్షేత్రం పనులు అర్థాంతరంగా నిలిచి పోయాయి. ఏదిఏమైనా కళాక్షేత్రం నిర్మాణ పనులు పూర్తి అయ్యేలా ప్రభుత్వం కృషి చేయాలి.

దోమల నివారణకు చర్యలేవి?:-పారేపల్లి సత్యనారాయణ, దేవులపల్లి, ప.గోజిల్లా

రాష్ట్రంలో వరుస వర్షాలతోదోమలు విశృంఖలంగా పెరిగి అనేక వ్యాధులకు కారణలవ్ఞతున్నాయి. మలేరియా వంటి వ్యాధులు విజృంభించి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితు లలో ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి ప్రభుత్వంవైద్య ఆరోగ్యశాఖఅవగాహన కార్యక్రమాలు నిర్వహిం చాలి. దోమలు ప్రబలకుండా మురికినీరు గుంటలు పూడ్చే ప్రయత్నం చేయాలి. ఫాగింగ్‌ యంత్రాలు పట్టణ ప్రాంతాలకే పరిమితమైనాయి. కానీ ప్రతి ఒక్క పంచాయతీకి వాటిని సర ఫరా చేసి నిత్యం ఉపయోగిస్తే దోమల బెడద తగ్గే అవకాశం ఉంది. దోమకారక అనారోగ్యాల నుంచి ప్రజలను రక్షించవచ్చు. ఇతర రాష్ట్రాలలో పక్కదేశాలలో దోమల నియంత్రణకు వారు అవలంబిస్తున్న విధానాల్ని అనుసరించే ప్రయత్నం చేయాలి.

అమ్మఒడి పథకం ఉద్దేశం నెరవేరుతుందా?:-రామకృష్ణ మసుల్దారి, చాకరాజు వేముల గ్రామం

ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు అనే బేధం లేకుండా ఏ పాఠశా లలోనైనా సరే పిల్లలు చదువ్ఞకోవాలి. తద్వారా రాష్ట్రంలో చదువ్ఞకునే పిల్లల సంఖ్య పెరగాలన్నది ఈ పథకం ఉద్ధేశ్యం అని ముఖ్యమంత్రి ఘంటాపథంగా చెబుతున్నారు. మరి నిజంగా వారి ఉద్దేశం నెరవేరుతుందా? గత విద్యాసంవత్సరం 2018-19 రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో కలిపి పిల్లల నమోదు 70,41,988. ఈ విద్యాసంవత్సరం మొదలై 2019-20 ఇప్పటికీ 90 రోజులైంది. ఈ రోజుకు రాష్ట్రంలో పిల్లల నమోదు 69,94,569. గత సంవత్సరం టార్గెట్‌ చేరుకోవాలంటేనే ఇంకా 47,419 పిల్లల నమోదు జరగాలి.

రవాణా, ప్యాకింగ్‌ అధిక భారం కాదా? -గరిమెళ్లరామకృష్ణ, ఏలూరు, ప.గోజిల్లా

శ్రీకాకుళం జిల్లాలో పంపిణీ చేసిన బియ్యం నాణ్యత లేకపోవ డంతో ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన నాణ్యమైన బియ్యం పంపిణీ అభాసుపాలయింది. అసలు శ్రీకాకుళం జిల్లాలో పంపిణీకి తూర్పుగోదావరి జిల్లా నుండి సరఫరా చేయ డం ఏమిటి? మరోవైపు విజయనగరం జిల్లా నుండి ప్రకాశం జిల్లాకు సరఫరా చేస్తున్నారు. అవి ముక్కిపోయినవి కావటంతో తిప్పి పంపిద్దామంటే రాజకీయ ఒత్తిళ్లు అంటూ పత్రికలలో కథనాలు వచ్చాయి. మిల్లర్ల లాబీయింగ్‌తో మొత్తం ప్రజా పంపిణీ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది. ప్యాకింగ్‌కి కూడా ఎంతో డబ్బు ఖర్చు అవ్ఞతున్నట్లు అందులోనూ అవకతవకలు జరుగు తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.