ప్రజావాక్కు

Voice ot the people
Voice ot the people

మట్టి గణపతే మహాగణపతి

వినాయక చవితి పర్వదినం సందర్భంగా మన ఇంట్లో, కాలనీ లలో ప్రతిష్టించే వినాయక విగ్రహాలు రసాయనాలను ఉపయో గించనివిగా, సాధ్యమైనంతవరకు చిన్నవిగా ఉండేటట్లు చూసు కోవాలి.పర్యావరణానికి మేలు చేసే మట్టి విగ్రహాలను పసుపు, కుంకుమ,ఆకులుపూలతో అలంకరించి భక్తిశద్ధ్రలతో పూజిద్దాం. విగ్రహాలను నిమర్జన చేసినప్పుడు నీటిలో పూర్తిగా మునిగి పోవాలి.అప్పుడే నిమర్జనకు అర్థం పరమార్థం. వినాయకుడిని పూజించడానికి పెద్దవిగ్రహాలు ప్రతిష్టించాల్సిన అవసరంలేదు. విగ్రహం ముప్పయి అంగుళాలు ఉంటే చాలు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని రంగులు వాడని చిన్న మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పూజిస్తే బాగుంటుంది. – కాయల నాగేంద్ర, హైదరాబాద్‌


కాశ్మీర్‌ అంశంపై ట్రంప్‌-జంప్‌


జీ7 దేశాల సదస్సులో భారత ప్రధాని మోడీ చెంతనుండగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కాశ్మీర్‌ అంశంపై పెదవి విప్పకపోవ డం, ఆ అంశాలు భారత్‌, పాకిస్థాన్‌లు తేల్చుకోవాల్సిన ద్వైపా క్షిక అంశాలని ప్రకటించడం మంచి పరిణామం. ఈ మధ్యనే ఆయన తన మధ్యవర్తిత్వాన్ని భారత్‌ కోరుకుంటుందని ఒక సారి, అందుకు తాము రెడీ అని మరోసారి చిత్తం వచ్చినట్లు ప్రకటిస్తూవచ్చారు.ఆయన ఆ అంశంలేవనెత్తినప్రతిసారీ భారత్‌ గట్టిగానే ఖండిస్తున్నా, ఈసారి మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే పక్కనే భారత ప్రధాని ఉన్నారు. ఆయన భారత్‌, పాకిస్థాన్‌ల మధ్యతగవ్ఞలు తీర్చడానికి పెద్దన్నలెవరూ అవసరం లేదంటూ స్పష్టంగా చెప్పారు. ఆసందర్భంలో మరోమాటకు తావ్ఞలేకుం డా పోవడంతో ట్రంప్‌ కూడా వంతపాడాల్సి వచ్చింది.
-డా.డి.వి.శంకరరావ్ఞ, పార్వతీపురం


పెరుగుతున్న పెండింగ్‌ కేసులు


ఒకపక్క వినియోగదారులచట్టాన్ని సమర్థవంతంగా అమ లు చేస్తున్నామని కేంద్రప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తుం డగా సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవరెన్స్‌వారి వార్షిక నివేదిక ప్రకా రం దేశంమొత్తం మీద వివిధ వినియోగదారుల కోర్టుల్లో అయిదు లక్షలకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్న గణాంకాలు కేంద్రప్రభుత్వ వైఫల్యాన్ని ప్రస్ఫుటం చేస్తోం ది.జిల్లాస్థాయి ఫోరమ్‌లో తగినంత సిబ్బంది లేకపోవడం, వాయిదాల పర్వాన్నిఆశ్రయించడం, లోక్‌అదాలత్‌ వ్యవస్థ సహయాన్ని వినియోగించుకోకపోవడం కోర్టుల పటిష్టతకు నిధులు తగ్గిపోవడం వంటివి ప్రధాన కారణాలు. ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

పాఠశాలలకు ప్రథమచికిత్స కిట్‌లు


పేద కుటుంబాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా చదువ్ఞతుంటారు.వారివారి తల్లిదండ్రులు కూడా రెక్కాడితే కానీ డొక్కాడనిపరిస్థితి. ఉదయం నుంచిసాయంత్రం వరకు పూర్తిగా ఉపాధ్యాయుల మీదే వదిలేసి భరోసాగా ఉంటారు. అలాంటి నేపథ్యంలో పిల్లలకి ఏవైనా గాయాలైనా వారి తల్లిదం డ్రులు వచ్చేంతవరకు ఉంచకుండా కనీసం ప్రథమ చికిత్స అయినా ఉపాధ్యాయులు చేస్తే ఆ విద్యార్థికి తక్షణం వైద్యం అందటమే కాదు తల్లిదండ్రులకు కూడా కొంత టెన్షన్‌ తగ్గుతుంది. విద్యార్థులకు ఆటలలో లేదా ఇతర ప్రమాదాలలో చిన్న చిన్న గాయాలు జరగడం పరిపాటే. పాఠశాల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రతిపాఠశాలకి అయోడిన్‌, దూది, మందులు, కత్తెర, బ్యాండ్‌ఎయిడ్‌, టేపుతో కూడిన కిట్‌లను సరఫరా చేయాలి.
-పారేపల్లి సత్యనారాయణ, పట్టెన్నపాలెం, ప.గో.జిల్లా

నిపుణుల కొరత

యువతీయువకుల సంఖ్య గణనీయంగా పెరిగి పోతున్నందున ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. మరోవైపు డిజిటల్‌ సాంకేతికత విస్తరించి నైపుణ్య సిబ్బందికి గిరాకీ అంతకంతకూ పెరిగిపోతోంది. స్థానిక విద్యాలయాల నుంచి వచ్చే సాంకేతిక నిపుణుల సంఖ్య గిరాకీని తీర్చేస్థాయిలో లేదు. ఫలితంగా సాఫ్ట్‌వేర్‌ మొదలుకొని ఇతర ఇంజినీరింగ్‌ విభాగాలు, డిజైనింగ్‌, విక్రయాలవరకు అంతటా నిపుణుల కొరత ఏర్పడుతోంది.ఎనలిటిక్స్‌, మెషిన్‌లెర్నింగ్‌, క్లౌడ్‌ కంప్యూ టింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఆరోగ్యసంరక్షణ సేవల వరకు నిపుణుల కొరత తీవ్రంగా వేధిస్తోందని ఇటీవల అసోచాం, ఫిక్కీ సంస్థల అధ్యయన నివేదిక తెలియచేస్తోంది.
-సి.హెచ్‌.ప్రతాప్‌, శ్రీకాకుళం
విమర్శించడం భావ్యంకాదు
అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఒకరు ఇంకేదో నేరం చేసారని, మరొకరు తీవ్రమైన ఆరోపణలనుఎదుర్కొన్నారు. గతంలో యుపిఏ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారిలో కూడా కొందరు అవినీతి ఆరోపణలను ఎదుర్కొని జైలుశిక్ష అనుభవించారు.ఆ తరువాత క్లీన్‌చీట్‌తో బయటపడి ఇప్పు డు ప్రతిపక్షనాయకులుగా చెలామణి అవ్ఞతున్నారు. ఆరో పణలువచ్చినంత మాత్రాన ఎవరూ నేరస్తులు అయిపోరు. నేరం రుజువై శిక్ష పడే వరకు వారు నిరపరాధులే.

-ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌