ప్రజావాక్కు

Voice of the People
Voice of the People

గండిపడుతున్న కాల్వలతో సమస్యలు


తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రధాన కాల్వకట్టలు బలహీనంగా ఉన్నాయని తెలిసినా ఇరిగేషన్‌ అధికారులు గత అయిదేళ్లలో ఎలాంటి మరమ్మత్తులు చేయించకుండా తీవ్ర అశ్రద్ధ వైఖరి కనబరిచారు. ఫలితంగా అనేక కాల్వకట్టలకు గండిపడుతున్న సంఘటనలు ఇటీవలపెరుగుతున్నాయి.రాజొలిబండ మళ్లింపు పథకం ప్రధాన కాలువకు ఇటీవలి వర్షాలకు గండిపడి ఫలి తంగా వరదనీరు చొచ్చుకురావడంతో ఇరవైవేల ఎకరాల పంట నీట మునిగి రైతుల బతుకులలో ఆవేదన మిగిల్చింది. రెండు సంవత్సరాల క్రితం ఇక్కడి సమీపంలో కాల్వకు గండిపడిన ప్పుడు అధికారులు శాశ్వత మరమ్మతులకు బదులు తూతూ మంత్రం చందాన తాత్కాలిక ప్రాతిపదికపై మరమ్మతులు జరి పించి చేతులు దులిపేసుకున్నారు. నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు శాశ్వత మరమ్మతులు చేయించాలన్న ఆ ప్రాంత ప్రజల విజ్ఞప్తులు బుట్టదాఖలు అయ్యాయి. ఫలితంగా ఈసారి పడినగండి వలన రైతులకు తీవ్రనష్టం కలిగింది. -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ


శిథిలమవ్ఞతున్న చరిత్ర


అపురూపమైన పురాతన కట్టడాలకు వేదికైన హైదరాబాద్‌ నగ రం పర్యాటక కోణంలో ఇతర రాష్ట్రాలను ఆకట్టుకుంటోంది. నిర్వహణ సక్రమంగాలేకపోవడంతో ఈకట్టడాల్లో చాలా భాగం రూపు కోల్పోతున్నాయి. కొన్ని ప్రాంతాలు అక్రమణలకు గుర వ్ఞతున్నాయి. మరికొన్ని శిధిలావస్థకు చేరుకున్నాయి. ఎన్నో కట్టడాలుఒకప్పటి వైభవానికి సాక్ష్యాలుగా నిలిచాయి. ప్రస్తుతం వాటిని పట్టించుకునేవారులేరు. గతంలో వీటి పరిరక్షణకు కొన్నిప్రయత్నాలు జరిగినా అవి అర్థాంతరంగా ఆగిపోయాయి. రాష్ట్రపురావస్తుశాఖ గ్రేటర్‌ హైదరాబాద్‌ మెట్రో కార్పొరేషన్‌, హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంటు ఆథార్టీ పరిధిలో ఉన్న ఈ కట్టడాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి.
-వ్ఞలాపు బాలకేశవ్ఞలు, గిద్దలూరు, ప్రకాశంజిల్ల్లా


రాజధాని మారుతుందా?


అమరావతి ప్రాంతం వరదలు వచ్చినప్పుడు మునిగిపో తుంది. నిర్మాణ వ్యయం ఇతరచోట్ల కంటే రెట్టింపు అవ్ఞ తుంది.శివరామకృష్ణయ్య కమిటీ రాజధానికి అనువ్ఞ కాద ని నివేదికఇచ్చిందికావ్ఞన మరోప్రాంతానికి మార్పు చేయా లని రాష్ట్ర మంత్రి బహిరంగంగా ప్రకటించడం,అసలు రాజధాని అమరావతిలోనే ఉంటుందా?మరోచోటికి తరలి స్తారా అని తెలుగు వారంతా ఆందోళన చెందుతున్నారు. -యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం

ఖేల్‌ఖతమ్‌ దుకాన్‌ బంద్‌


ఒక రాజకీయ పార్టీ తరపున ఎన్నికలలో ఎమ్మెల్యే, ఎంపిలుగా పోటీచేసి ఓడిపోయిన వారు ఇంట్లో కూర్చోవడానికి ఇష్టపడటం లేదు. తమ పనులు చక్కబెట్టుకోవడానికి డబ్బులు సంపాదించు కోవడానికి పదవిలో ఉన్నవాళ్లు ఎలాగయితే బిజిబిజిగా ఉన్నా రో అలానే ఉండాలనుకుంటున్నారు. అందుకోసం వారు ఎన్నిక లలో గెలిచి అధికారంలోకి వచ్చిన పార్టీలను ఆశ్రయిస్తున్నారు. ఆయా పార్టీల్లోకి క్యూ కడుతు వెడుతున్నారు. ఈ కారణంతో ఓడిపోయిన పార్టీల్లో సాధారణ కార్యకర్తలు,చోటామోటా లీడర్లు తప్ప సీనియర్‌ నాయకులంటూ ఎవరూ ఉండటం లేదు. వీరితోపాటు సినిమావాళ్లు వివిధరంగాలకు చెందిన వ్యక్తులు కూడా ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చిన పార్టీల్లోకి చేరుతున్నారు. దీంతో ఎన్నికల్లో ఓడిపోయిన రాజకీయ పార్టీ పరిస్థితి ఖేల్‌ఖతమ్‌ దుకాన్‌ బంద్‌ అన్నట్లుగా తయారైంది. -ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌

సామాజిక మాధ్యమాల దుర్వినియోగం


దేశంలో సామాజికమాధ్యమాల దుర్వినియోగాన్ని అడ్డుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఐటి చట్టాన్ని సవరణ ద్వారా పటిష్టం చేయాలని సంకల్పించడం హర్షణీయం. ప్రభుత్వ చట్టవ్యతిరేక సమాచారం, సందేశాల జాడనుగుర్తించి వాటిని తొలగించే సాం కేతిక నియంత్రణ వ్యవస్థలను సామాజిక మాధ్యమాలు కలిగి ఉండటం,అంతర్జాలంలో అశ్లీల,అసభ్య,అసత్యవార్తలను సెన్సా రుచేయడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలుతీసుకోవడం, దేశంలో కంప్యూటర్లపై నిఘావ్యవస్థ కలిగి ఉండటం, విదేశాల నుండి తప్పుడు ఐ.డిల ద్వారా విద్వేషాల ను ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకునేలా వివిధ దేశాలతో సమన్వయం వంటి చర్యలు తీసుకోవడం ఎంతో అవసరం.
-ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా


రోడ్డు ప్రమాదాలను నివారించాలి


రహదారిప్రమాదాలలో మనదేశం ప్రపంచవ్యాప్తంగా 13వ స్థానంలో ఉంది. ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ రోజూ కొత్త వాహనాలు కూడా అదనంగా రోడ్లపైకి చేరి ట్రాఫిక్‌ కిక్కిరిసిపోతున్నా రోడ్ల నిర్మాణం, నిర్వహణలో మాత్రం ఏమాత్రం మార్పుఉండటం లేదు.రహదారి ప్రమా దాలనునియంత్రించేందుకు అభివృద్ధిచెందిన దేశాలైన అమెరికా, ఇటలీ, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ వంటి దేశాలు ఎన్నోవిస్తృత పరిశోధనలను చేపట్టి రహదారుల నిర్మాణం లో కొత్త పోకడలను అనుసరిస్తుంటే మనదేశంలో మాత్రం పాత పద్ధతులనే పట్టుకొని వేళ్లాడుతున్నాం.
-సి.సాయి ప్రతాప్‌, హైదరాబాద్‌