ప్రజావాక్కు


కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలన

Voice of the People
Voice of the People


అభివృద్ధి పధంతో భారత్‌ను కొత్త మలుపు తిప్పేందుకు ప్రధా ని సారధ్యంలోని ప్రభుత్వం విలక్షణ చర్యలతో పురోగమించ డం హర్షణీయం. గత పాలనతో పోలిస్తే జాతి నిర్మాణ క్రతువ్ఞ లో ఎన్‌డిఏ-2ప్రభుత్వం కనబరచిన తిరుగులేని చొరవ ప్రస్ఫు టమవ్ఞతోంది. పురోభివృద్ధి సాధనలో దేశాన్ని మరొక మెట్టు ఎక్కించగల దార్శనికత తేటపడుతోంది. కనిష్టప్రభుత్వం గరిష్ట పాలనసూత్రానికి అనుగుణంగా అన్నివర్గాలకు భాగ స్వామ్యం కల్పించాలని, పేదలు,రైతులు, కార్మికుల ఉద్ధరణ, యువతకు ఉపాధి అవకాశాల విస్తరణ ద్వారా సామాజిక భద్రతకు అమి త ప్రాధాన్యమివ్వాలన్న ప్రభుత్వ సంకల్పం హర్షణీయం. దేశా న్ని అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న మోడీప్రభుత్వం సమున్నతాశయం గత కొన్ని రోజులుగా జరు గుతున్నపాలనలో ప్రతీచర్యలోనూ ప్రతిఫలించింది. -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం


దేశానికే గర్వకారణం


ఎన్ని సవాళ్లు ఎదురైనా మొక్కవొని దీక్షతో ఇస్రో చంద్రయాన్‌ ఉపగ్రహాన్ని మార్క్‌-3వాహకనౌక ద్వారా విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి పెట్టడం మనదేశానికి గర్వకారణం.ఏ దేశమూ పరిశోధనలు చేయని చంద్రుని దక్షిణ ధృవ ఉపరితలం మీద పరిశోధనలు తలపెట్టడం మన శాస్త్రవేత్తల ఆత్మవిశ్వాసాన్ని, వారి అమోఘమైన ప్రతిభను సూచిస్తాయి. మన శాస్త్రవేత్తల తెలివితేటలు, నైపుణ్యాలు ప్రపంచంలోని ఏదేశ శాస్త్రవేత్తలకూ తీసిపోవని మరోసారి నిరూపితమైంది. ప్రభుత్వరంగ సంస్థ పనితనం బాగాలేదనే అపవాదు పటాపంచలు చేసి, ప్రపంచంలోనే మేటి అంతరిక్ష పరిశోధనా సంస్థలైన నాసా, యూరోపియన్‌ స్పేస్‌ ఎజెన్సీలకే గట్టిపోటీనిచ్చే సంస్థగా ఇస్రో ఎదగడం మనదేశానికి గర్వకారణం -వ్ఞలాపు బాలకేశవ్ఞలు, గిద్దలూరు, ప్రకాశంజిల్లా


ప్రాణాలుతీస్తున్న వంతెనలు


గత అయిదేళ్లలో దాదాపుగా ఇరవై వంతెనలు కూలి వందల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది క్షతగాత్రులయ్యారు. ఈ నేపథ్యంలో దేశంలో 20 సంవత్సరా లు పూర్తయిన వంతెలన్నింటికీ సేఫ్టీఆడిట్లు నిర్వహించి, లోపా లు ఉన్నవాటికి తక్షణం మరమ్మతులు చేపట్టాలని కేంద్ర ప్రభు త్వానికి సుప్రీంకోర్టు సూచించింది.ఆడిట్లు నిర్వహించే సంస్థల పై నిబంధనావళి రూపొందించి, తప్పుడు సేఫ్టీ సర్టిఫి కెట్లు ఇచ్చే వారిపై క్రిమినల్‌ కేసులు బుక్‌ చేయాలని ఆదేశించింది. -ఎన్‌.శివసాయి,కర్నూలుజిల్లా


కోటి ఉద్యోగాలు సాధ్యమేనా?


నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్డీయే లోక్‌సభ ఎన్నికల్లో గెలవడానికి ప్రధాన కారణం యువకులు, చదువ్ఞకున్న వారు ఓట్లువేయడం వల్లే. అందుకుగాను నరేంద్రమోడీ చదువ్ఞకున్న యువత ఆకాంక్షలను నెరవేర్చాలి. ఏటా కోటి ఉద్యోగాల వాగ్దా నం చేసి గత ఎన్నికలలో గెలిచిన మోడీ ఆ వాగ్దానాన్ని సంపూ ర్ణంగా నెరవేర్చలేదు. ఈసారి మాత్రం అలాకాకుండా పాత వాగ్దానాలతోపాటు కొత్త వాగ్దానాలను, హామీలను కూడా నెర వేర్చి ప్రజల కోరిక తీర్చాలి. ముద్రాయోజన, స్వచ్ఛభారత్‌, ఉజ్వలయోజన, ప్రతి ఇంటికి విద్యుత్‌ పథకం, ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన, కిసాన్‌ సమ్మాన్‌ యోజన, ఆర్థికంగా వెనుక బడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్‌ లాంటి పథకాలను ఈ ఐదేళ్లలో సమర్థంగా అమలు చేయాలి. -కె.రామకృష్ణ, యాదాద్రి,భువనగిరి


త్రిభాషా సూత్రం అమలుచేయాలి


కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యావిధానం కింద కస్తూరిరంగన్‌ కమిటీ సిఫార్సు చేసిన త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని సంకల్పించింది. ఆంగ్లం, మాతృభాషతోపాటు హిందీ, సంస్కృ తం లేదా మరే ఇతర భాషను విద్యార్థులు పాఠశాలస్థాయి నుండి నేర్చుకోవాలన్నది సదరు కమిటీ సిఫార్సు. అయితే ఈ భాషలను నేర్పించడానికి కేంద్రీయ విద్యాలయాలు తప్పితే ఇతర విద్యాసంస్థలలో నేర్పించేందుకు తగినంతమంది అనుభ వజ్ఞులైన ఉపాధ్యాయులు లేరు.పాఠ్యపుస్తకాలు కూడా దేశభాష లపై సమగ్రంగా అందుబాటులో లేవ్ఞ. ఉపాధ్యాయుల శిక్షణ కూడా నాసిరకంగా ఉండటం వలన విద్యాప్రమాణాలు నానా టికీ దిగజారిపోతున్నాయి. ఎన్‌.సి.ఈ.ఆర్‌.టితోపాటు ఇతర భాషా పరిశోధనా సంస్థల సమన్వయం, సహకారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమస్ఫూర్తితో త్రిభాషా సూత్రం సమ గ్రంగా అమలవడం సాధ్యపడుతుంది. -సి.హెచ్‌.సాయిరుత్విక్‌ నల్గొండ


గిరిజనులను ఆదుకోవాలి


గిరిజన సంక్షేమం అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్నామంటు న్నాయి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ ఇంకా అనేక తండాలు, గూడేలు కనీస వైద్యసదుపాయం అందక, పౌష్టికాహార లోపం తో గిరిపుత్రులు రేచికటి సమస్యలు, ప్రసవ వేదన పడుతున్న మహిళలకు వైద్యం అందక ఆరోగ్యసమస్యలతో ఇబ్బందిపడు తున్నారు. ప్రభుత్వం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ద్వారా గిరిపుత్రుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలి. -షేక్‌.మీరా, రాజమండ్రి, తు.గోజిల్లా


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/