ప్రజావాక్కు

Voice-ot-the-people
Voice-ot-the-people

ఉరిశిక్షలు విధించినా తగ్గని అత్యాచారాలు


వరంగల్‌ జిల్లాలో మైనర్‌ బాలికపై అత్యాచారం జరిపిన పోలిపాక ప్రవీణ్‌ అనే ఉన్మాదికి ఉరిశిక్షపడ్డ వారం రోజుల్లోపే అదే జిల్లాలో మరో బాలికపై ముగ్గురు యువకులు అత్యాచా రంజరిపి సభ్యసమాజం పరువ్ఞతీశారు.అవమానం భరించలేక ఆ పధ్నాలుగేళ్ల బాలిక ఇంటికొచ్చి ఆత్మహత్యకు పాల్పడింది. మనదేశంలో ఉరిశిక్షలు చాలాఅరుదుగా పడుతున్నాయి. చట్టం లోని లొసుగులను,లోపాలను ఆధారం చేసుకుని నిందితులను న్యాయవాదులుకాపాడుతున్నారు.అలాంటి తరుణంలో అత్యా చారంజరిగిన 48రోజుల్లోనే పైన తెలిపిన ఉన్మాదికి శిక్షఖరారు కావడం అభినందనీయమే అయినా, అత్యాచారాలకు అడ్డుకట్ట పడకపోవడం బాధాకరమైన విషయం. ఎన్నో సంవత్సరాలు గా ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్ఞతూనే ఉన్నాయి. మనదేశంలో వందలాది చట్టాలు ఉన్నా అత్యాచారాలను నివా రించలేకపోతున్నాయి. జి.అశోక్‌,గోదూర్‌, జగిత్యాలజిల్ల్లా

ఏజెన్సీ ప్రాంతాలపై నిర్లక్ష్యవైఖరి

రెండు తెలుగురాష్ట్రాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, సురక్షిత నీరు, డ్రైనేజి వ్యవస్థల నిర్వహణ పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యవైఖరి గర్హనీయం. గిరిజన సంక్షేమమే ధ్యే యంగా పనిచేస్తున్నామని, గిరిపుత్రుల అభ్యున్నతికోసం ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్భా´టంగా ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు నానాటికీ తీసికట్టుగా మారుతున్నాయి. కనీస వైద్యసదుపాయాలు లేక ఉపాధిఅవకాశాలు సన్నగిల్లి అర్థాకలితో అల్లాడుతున్న లక్షలాది గిరిపుత్రుల బాధలు వర్ణనాతీతం. భావిభారత పౌరులుగా ఎదగాల్సిన వేలాది మన్యం బాలబాలికలు సరైన పౌష్టికాహారం లేక రేచీకటి, గ్లోకొమా, శ్వాసకోశవ్యాధులు, ఆస్టియోపొరొసిస్‌ వంటి భయంకర వ్యాధుల బారినపడి దుర్భర జీవితం గడుపుతున్నవైనం బాధాకరం.-సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

వంతెనల పనులు పూర్తి చేయాలి


చాలా చోట్ల నదులపై జరుగుతున్న వంతెనల పనులు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి.సంవత్సరాలు గడుస్తున్నా వంతె నలపనులు మరింత ఆలస్యం కావడంతో ప్రజలు విస్మయానికి గురి అవ్ఞతున్నారు. ఇటీవల చాలా చోట్ల విస్తారంగా వర్షాలు పడటం వల్ల నదులకు అధికంగా నీరు రావడం వల్ల ప్రజలు నదులు దాటడానికి కష్టాలు పడాల్సివస్తుంది. ప్రభుత్వం వంతెన పనులపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలి. -షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం


సార్వభౌమ బాండ్లరూపంలో విదేశీ రుణాలు సేకరించాలని ఈ ఏడాది బడ్జెట్‌లో ఆర్థికమంత్రి చేసిన ప్రతిపాదన పట్ల భిన్నా భిప్రాయాలు వ్యక్తమవ్ఞతున్నాయి. దేశాభివృద్ధికి ప్రభుత్వం రుణాలు తీసుకొక తప్పదు. కానీ రుణదాతలు విదేశీయులైతే కరెన్సీ విలువలో హెచ్చుతగ్గులు తప్పఅప్పులు తీర్చాల్సి వచ్చే టప్పటికీ గుదిబండలై మన ఆర్థికవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరి స్తున్నారు. విదేశీ మార్కెట్‌లో చమురు ధర పెరిగినప్పుడుల్లా భారత్‌ కరెంట్‌ఖాతా కూడా మిన్నంటుతోంది.ఇది విదేశీ రుణాలను చెల్లింపు స్తోమతను అనిశ్చితం చేస్తోంది.గతంలో అర్జెంటీనా, పలు ఆగ్నే యాసియా దేశాలు చేసిన అప్పులు తీర్చలేక, ఫలితంగా అంతర్జాతీయంగా ఆంక్షలకు గురైన విషయం దృష్టిలో ఉంచుకొని అప్పులు చేయడం మాని వాటిని తగ్గించే మార్గాలు అన్వేషించాలి.
-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

అర్హులకే పోస్టులు


డిఎస్సీ 2018లో ఆంధ్రప్రదేశ్‌ బిసి సంక్షేమ పాఠశాలలకు, ఆదర్శ పాఠశాలలకు రాష్ట్రస్థాయి ప్రిన్సిపాల్స్‌ ఎంపిక కోసం పరీక్ష జరిగింది. అర్హులు జాబితా ప్రకారం డిఎస్సీ 2018 నిబంధనల ప్రకారం ప్రతిప్రిన్సిపల్‌ అభ్యర్థికి పూర్వపు సర్వీసు, అర్హతగల వేతన స్కేళ్లు, కలిగి ఉండాలి. ఇలా అర్హతులు ఉన్న వారినే ఎంపిక చేస్తే పాఠశాలల నిర్వహణపై పూర్తి అవగాహన ఉం టుంది. కానీ ఇటీవల ప్రిన్సిపాల్‌ పోస్టులకు అభ్యర్థులుగా వచ్చి న వారికి సరిపడా అర్హుతలు ఉండటం లేదు.

-బి.సురేష్‌, అరసవిల్లి, శ్రీకాకుళం

కుక్కల బెడద


రాష్ట్రవ్యాప్తంగా కుక్కలు, పందులు ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. మురుగు కాల్వలు, చెత్తకుప్పల్లో ఉండే పందులు వీధుల వెంబడి తిరగడం వల్ల దోమలు బెడద ఎక్కువైపో తుంది. ఇక కుక్కల సంఖ్య రానురాను పెరగడంతో అవి పల్లె, పట్టణాల్లో ఎక్కువైపోతున్నాయి. మనుషులు ఎక్కువగా కుక్క కాటుకు బలవ్ఞతున్నారు. చాలా మంది ఈ కుక్కకాటు వల్ల ఆస్పత్రుల్లో చికిత్సపొందుతూ అసువ్ఞలు బాశారు. ప్రభుత్వా స్పత్రిలో అప్పుడే పుట్టిన పసికందును హతమార్చిన సంఘటన లు పత్రికల్లోకోడై కూసినాప్రభుత్వాలు స్పందించడంలేదు. ప్రజ లప్రాణాలు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. -యర్రమోతుధర్మరాజు, ధవశేళ్వరం