ప్రజావాక్కు

Voice of the People
Voice of the People

ప్రజావాక్కు

దేశానికి అవమానం:- ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద

అధికార పార్టీకి చెందిన మంత్రులు, చట్టసభల సభ్యులు వైరి పక్షాల వారిని విమర్శించటం వారిపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడం ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువయిపోయింది. ఏనా డో గతించిన మహానాయకులను కూడా వీరు వదిలి పెట్టడం లేదు.అసలు వీరి టార్గెట్‌ నాటి దేశాన్ని ఏలిన నాయకులే కావ టం గమనార్హం. సందర్భం వచ్చినప్పుడల్లా వారిపై నోరు పారేసుకుంటున్నారు. ఇష్టానుసారం మాట్లాడటం చేస్తున్నారు. ప్రజాభిమానం చూరగొన్న నాయకుల పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తున్నారు. వారి జ్ఞాపకాలను గుర్తు చేసే చిహ్నాలను చెరి పేసే ప్రయత్నం చేస్తున్నారు. వారిపట్ల తమకున్న రాజకీయ కక్షను అడుగడుగునా ప్రదర్శిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారికి మంచి జరగదు. వీరిలోనే వారు కూడా దేశాన్ని పాలిం చారు. దేశానికి సేవ చేసారు ప్రజలను ప్రేమించారు అందకే ఇప్పటికీ వారు ప్రజలలో ఒకరిగా ఉన్నారు.

ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించకూడదు:-ఓగుల సుజాత, అనంతపురంజిల్ల్లా

డిఎస్సీ 2018 పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించకూడదు. ఆన్‌లైన్‌ పరీక్షల వల్ల గందరగోళంగా మారుతుంది. డిఎస్సీ 2018 పరీక్షలు ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలి. ఆన్‌లైన పరీక్షల వల్ల నిరుద్యోగుల జీవితాలు తారుమారవ్ఞతాయి. ఆన్‌లైన్‌ పరీక్షలు రద్దు చేయాలి. ఆన్‌లైన్‌ పరీక్షలు అర్థరహితం, అసంబద్ధం, విశ్వసనీయతలేనివి. కాబట్టి ఒఎమ్‌ఆర్‌ షీట్‌ పద్ధతిలో 2018 డిఎస్సీ నిర్వహించాలి.
రసాయనాలతో ప్రాణాలకు ముప్పు: సి. ప్రతాప్‌, శ్రీకాకుళం
దేశవిదేశాలలో పంటలకు ఆశించే చీడపీడల్ని అరికట్టే క్రిమిసం హారకాలు వినియోగిస్తున్న మందులు ఏటా సుమారుగా రెండు లక్షలనిండు ప్రాణాల్ని కబళిస్తున్నాయన్నఐక్యరాజ్యసమితి నిపు ణుల నివేదిక దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. కలుపు నివారణకు ఉపకరించే మోన్‌శాంటో సంస్థవిక్రయించిన పురుగులలో మందుకారణంగా కాన్సర్‌సోకిన వ్యక్తికిరెండుకోట్ల మేర పరిహా రం చెల్లించాలన్న అమెరికా న్యాయస్థానం ఆదేశాలు విషరసా యనాల దుష్పరిణామాలను కళ్లకు కడుతున్నాయి. క్యాన్సర్‌ కారకమని తేలిన మందును తెలుగు రాష్ట్రాల్లో విరివిగా వాడు తుండడం తీవ్రఆందోళనకర పరిణామం. విదేశాలలో నిషేధిత క్రిమిసంహారక మందులను విరివిగా దేశంలోనికి దిగుమతులు అవ్ఞతున్న వైనంపై ప్రభుత్వం దృష్టి సారించాలి.

అధ్వాన్నంగా మారిన రోడ్లు: -కామిడి సతీష్‌రెడ్డి, పరకాల, వరంగల్‌జిల్లా
వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని అంతర్గత రహదారులు గోతులమయమై అధ్వాన్నంగా మారా యి. పరకాల పట్టణ జనాభా సుమారు యాభైవేలకుపైగా ఉం టుంది. 20వార్డులున్నాయి. ప్రతీయేటా వివిధ పన్నుల ద్వారా ప్రజల నుండి కోట్లాది రూపాయల ఆదాయం మున్సిపాలిటీకి వస్తున్నా రోడ్ల పరిస్థితులలో మార్పులేదు. పట్టణంలోని ప్రతీ వీధిలో గల సి.సిరోడ్లు రాళ్లు కంకరతేలి గోతులను దర్శనమి స్తున్నాయి.వాహనాలునడపాలంటేనడుంనొప్పిరావడం ఖాయం. ముఖ్యంగా పరకాల బస్టాండ్‌ నుండి సి.ఎస్‌ఇ పాఠశాలకి వెళ్లే రోడ్లుమరీ అధ్వాన్నంగా తయారైంది. ప్రజలు ఎన్నుకున్న పాల కవర్గానికి ప్రజల సమస్యలను పరిష్కరించే పరిజ్ఞానం లేదు.

వేడెక్కుతున్న రాజకీయ ప్రచారాలు:-జి. అశోక్‌,గోదూర్‌, జగిత్యాలజిల్లా
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రచారాలు వేడెక్కు తున్నాయి. నాయకులు ప్రత్యర్థులను వ్యక్తిగత విమర్శలతో బా ణాలు సంధించుకుంటున్నారు. ఇష్టమోచ్చిన రీతిలో తిట్టుకుం టున్నారు. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కెసిఆర్‌ కుటుంబ పాలనను రచ్చకీడిస్తే, దీనిని కెటిఆర్‌ తిప్పికొడుతున్నారు. ప్రజల అవస రాల కోణంలో చర్చ జరగాల్సిన తరుణంలో విమర్శలు, ప్రతి విమర్శలతో కాలంగడుపుతూ ఓటర్లకువినోదం పంచుతున్నారు. అలాంటి వినోదం పంచడం ఆపి ముఖ్యమంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిలు ఒకే నియోజకవర్గంలో భేటీ అవ్వాలి. అప్పుడు ప్రజల వాస్తవమైన తీర్పు వెలువడుతుంది.