ప్రజావాక్కు

ప్రజావాక్కు

online
online 

ఆన్‌లైన్‌తో ఇబ్బందులు:-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

ఈ ప్రగతిలో భాగంగా రవాణాశాఖ వాహనాల రిజిస్ట్రేషన్‌, తాత్కాలిక, శాశ్వత లైసెన్సులు, డూప్లికేట్‌ పత్రాలు, నిర భ్యంతర పత్రాలు, టాక్స్‌ చెల్లింపులు ఇత్యాది సేవలను రెండే ళ్ల క్రితం ఆన్‌లైన్‌ చేసింది. అయితే తరచుగా సాంకేతిక సమ స్యలు ఎదురవ్ఞతున్నాయి.ఇందువలన సేవలలో అంతరాయం కలుగుతూ తీవ్రమైన జాప్యాల కారణంగా ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రతీ సేవకు ఆధార్‌ నంబరు తప్పనిసరి కావడం వలన వేలిముద్రల మెషిన్లు సరిగ్గా పనిచే యక సేవలు నిలిచిపోతున్నాయి. ఉత్తరాంధ్రలో సర్వర్లు నెమ్మ దించడం, ఇంటర్నెట్‌ సేవలు ఆగిపోవడం, కంప్యూటర్లు ఏవీ పనిచేయకపోవడం వంటి సమస్యలు వస్తుండడం వలన ప్రజ లు ముప్పుతిప్పలు పడుతున్నారు. ఆన్‌లైన్‌ సేవల సామర్థ్యా న్ని పెంచేందుకు రవాణాశాఖ తగుచర్యలు చేపట్టాలి.

డిగ్రీ వరకు తెలుగు విస్తరించాలి-ఉలాపు బాలకేశవులు, గిద్దలూరు, ప్రకాశంజిల్లా

తెలుగు భాషను పదో తరగతి వరకు తప్పనిసరిచేస్తూ తెలం గాణా ముఖ్యమంత్రి కెసిఆర్‌ తీసుకున్న నిర్ణయం ప్రశంస నీయమైనది. మాతృభాషకు సరైన మన్నన దక్కాలంటే ఈ విధానాన్ని ఇంటర్‌డిగ్రీలకూ విస్తరింపచేయాలి.మార్కుల ధ్యా సలోపడి విద్యార్థులు ఇంటర్‌లోనే తెలుగుకు దూరమైతే ప్రభు త్వం ఆశించిన లక్ష్యం నెరవేరదు. నిజానికి పదోతరగతి వరకు తెలుగు చదివిన వారు ఇంటర్‌, డిగ్రీల్లో దాన్ని కొనసాగించగలి గితే అసలు సిసలైన కొత్తతరం భాషాభిమానులు, పండితులు వెలుగులోకివస్తారు. పదో తరగతితోనే తెలుగు ఒరవడికి విద్యార్థులు దూరం కాకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసు కోవాలి. తెలుగులో చదివితే మార్కులు రావంటూ విద్యార్థుల్లో పాతుకుపోయిన దురుద్దేశాలను దూరం చేయాలి.

అతివేగంతో ప్రాణాలు బలి: -సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
రహదారులపై వాహనదారుల అతివేగం నిత్యం ఎంతో మందిప్రాణాలనుబలిగొంటున్నది.ద్విచక్రవాహనాలు మొద లుకొని అతిభారీ వాహనాల వరకు పరిమితికి మించిన వేగంతో వెళ్తున్నాయి. చిన్నవయసులో డ్రైవింగ్‌, యువత దూకుడు, మద్యంమత్తులో డ్రైవింగ్‌ చేసేవారు అతివేగంగా నడుపుతూ ప్రమాదాలు జరుపుతున్నారు. కాలేజీ యువ కులు జాతీయ రహదారులపై బైకులపై విన్యాసాలు చేస్తు న్నారు. రహదారులపై హెచ్చరిక బోర్డులను అడుగడుగు నా ఏర్పాటు చేయాలి. నిరంతర పర్యవేక్షణతో అతివే గంగా నడిపేవారిపై కొరడా ఝుళిపించాలి.

అవినీతిని అడ్డుకోవాలి: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా
దేశంలో విశృంఖలంగా పెరుగుతున్న అవినీతిని అడ్డుకునేందు కు గత ప్రభుత్వాలు లోక్‌పాల్‌, లోకాయుక్త విధానాలను అమలు చేసాయి. అయితే ఇలాంటి వ్యవస్థను నిర్వీర్యం చేయడంలో మన పార్టీలది అందెవేసిన చేయి. అన్నాహజారే వంటి మహనీయుల అవిశ్రాంత పోరాటం వలన సాధించుకున్న లోక్‌పాల్‌ నియామకం దశాబ్దాలతరబడి కాగితాలలోనే మూలు గుతోంది. ఇక వివిధ రాష్ట్రాలు లోకాయుక్తలను ఏర్పాటు చేసి నా వాటికి జవసత్వాలు కల్పించి బలోపేతం చేయడంలో ఉదా సీనంగా వ్యవహరిస్తున్నాయి. చాలా రాష్ట్రాలలో లోకాయుక్తల పనితీరు నామమాత్రంగా ఉంది.

ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలి: -జి.అశోక్‌,గోదూర్‌, జగిత్యాలజిల్లా
తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టడా నికి విద్యాశాఖ బదిలీలు, పదోన్నతులు నిర్వహించక మూడు సంవత్సరాలు దాటింది. ఉపాధ్యాయులు చాలా అసంతృప్తితో ఉన్నారు. సాధారణంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు సుదీర్ఘంగా కొనసాగుతాయి. ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూనే ఉంటాయి. అయినా సమస్యలు అపరిష్కృతంగానే ఉంటున్నాయి. ప్రస్తుతం ఉపాధ్యాయులకు వేసవి సెలవ్ఞలు నడుస్తున్నాయి. ఈ వేసవి సెలవ్ఞల్లోనే పదో న్నతులు, బదిలీలు, నిర్వహిస్తే బాగుంటుంది.

చట్టాలతో సమస్యలు: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ
దేశంలో సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టం అమలు అవ్ఞతున్న తీరు రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతూ దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈశాన్య భారతంలో వేర్పాటు ఉద్యమాలను నియంత్రించడానికి 1958లో కేంద్ర ప్రభుత్వం తీసుకువ చ్చిన ఈ ప్రత్యేక చట్టం ఇప్పటికీ అసోం, మిజోరం, నాగా లాండ్‌, త్రిపుర వంటి ప్రధాన ఈశాన్య రాష్ట్రాలలో అమలు లోఉండడం అహేతుకం.

దిగజారుతున్న విలువలు:-కె. సతీష్‌రెడ్డి, జడలపేట, భూపాలపల్లిజిల్లా

రాజకీయాల్లో రోజురోజుకు విలువలు దిగజారుతున్నాయి. రాజకీయాలంటేనే అసహ్యించుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఒక పార్టీలో గెలవడం, మరో పార్టీలోకి మారడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారింది. రాబోయే శాసనసభ ఎన్నికల వరకు ఏ పార్టీ నుండి ఏ పార్టీలకు ఎమ్మెల్యేలు, ఎంపిలు కప్పగంతులు వేస్తారో వేచిచూడాలి.