ప్రజావాక్కు

ప్రజావాక్కు

TRS RALLY
TRS RALLY

కార్యకర్తలకు పదవులు ఇవ్వాలి: గుండమల్ల సతీష్‌కుమార్‌, నారాయణపురం

తెలంగాణ సర్కారు 2016విజయదశమి సందర్భంగా నూత న జిల్లాలు ఏర్పాటు చేసింది.అయితే ఆ జిల్లాల్లో వివిధ స్థాయి లో నూతన కమిటీలను నియమించాలని ఆదేశాలు వెలువడ్డా యి.ఈ బాధ్యతలను జిల్లామంత్రులకు,ఎమ్మెల్యేలపై మోపింది. అయితే తె.రా.సలో ద్వితీయ శ్రేణి నేతల క్షేత్రస్థాయిలో కష్టపే నేతలకు ఈ పదవ్ఞలు దక్కనున్నాయి. నూతనంగా ఏర్పాటు చేయబోయే కమిటీల్లోగ్రామీణ స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి అవ సరమయ్యేలా సామాజిక కార్యక్రమాలునిర్వహిస్తూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ నేటి సమాజానికి అవసరమయ్యే సేవా కార్యక్రమాలను నిర్వహి స్తున్న సామాజిక కార్యకర్తలను కూడా నూతనంగా ఏర్పాటు చేయనున్న కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించాలి.

ఆదరణ తగ్గుతున్న పత్రికలు: సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
ఒకప్పుడు పత్రికలకు విశేష ఆదరణ ఉండేది. వార, మాస పత్రికలు లేని ఇల్లే ఉండేది కాదంటే అతిశయోక్తికాదు. ఇక పిల్ల లకైతే చందమామా, బాలజ్యోతి, బొమ్మరిల్లు వంటి కథా మాస పత్రికలు బోలెడు వినోదాన్ని పంచేవి. పుస్తకాల పురుగులుగా వీటిని పిల్లలు బాగా చదివి, నైతిక విలువలను అలవరచుకొనే వారు. కానీ ఈ కంప్యూటర్‌ యుగంలో పిల్లలు సోషల్‌ మీడి యా,మొబైల్‌ గేమ్స్‌,యూట్యూబ్‌ వంటి వాటికి బానిసలైనారు. పెద్దలో వీటితోపాటు, నీతిమాలిన దైనందిక టి.వి సీరియల్స్‌కు బానిసలైపోయారు. ఇవివారి ప్రవర్తన, ఆరోగ్యాలపై ప్రతికూల ప్రభావాన్నిచూపిస్తున్నాయి.సమాజాన్నిమంచిదారిలో పెడుతూ, విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించే పత్రికలకు ఆదరణ కరవైంది. ఇప్పటికైనా పాఠకలోకం కళ్లుతెరచి పత్రికలను ఆదరించాలి.

నాసిరకం ప్రమాణాలు: జి.అశోక్‌, గోదూర్‌, జగిత్యాలజిల్లా

రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ఇంజనీరింగ్‌ కళాశాలలు నాసిరకం ప్రమాణాలతో కొనసాగుతుండటం బాధాకరం. దాదాపు ఒక శాతం విద్యార్థుల్లో ఉద్యోగార్హతలు లోపిస్తున్నాయి. మిగిలిన ప్రతిభావంతులు మెరుగైన అవకాశాలు వెతుక్కుంటూ విదేశాలకు వెళ్ళి పోతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు విధానం ప్రవెశ పెట్టిన తరువాత ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రమాణాల పతనం మొదలైందన్నది నిఘ్టరసత్యం. అర్హతలు లేని అధ్యాపకులతో నడిచే కళాశాలలు అనేకం పుట్టుకొచ్చాయి. దీంతో ఇంజనీరింగ్‌ పట్టభద్రులు అనేకమంది నిరుద్యోగులు గా మిగిలిపోతున్నారు. చాలా మంది అధ్యాపకులు ఒకటి కంటె ఎక్కువ కళాశాలల్లో భోదన సాగిస్తున్న ఉదంతాలు చాలా బయ ట పడ్డాయి. సాంకేతిక విద్యలో ప్రమాదాలు మెరుగుపడాలంటే రాజకీయ నాయకులు ఓటు రాజకీయ నాయకులకు స్వస్తి చెప్పాలి. కనుక ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించే విధంగా విధానాలను రూపొందించాలి.

కుప్పకూలుతున్న ప్రాథమిక విద్య: సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

ఎంత అందంగా, ఆకర్షణీయంగా తీర్చీదిద్దినా పునాదులు పటి ష్టంగా లేని భవంతి కుప్పకూలుతుంది. మన దేశంలో ప్రాధమిక విద్యారంగం అత్యంత బలహీనంగా వ్ఞండడం మన సామాజిక, ఆర్థికరంగంలో దానిదుష్ప్రభావం తీవ్రంగా పడుతుంది. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో సరైన శిక్షణ పొంది విద్యార్థులకు దిశానిర్దే శం చేసే టీచర్లు కరవయ్యారు. దేశంలో మాజీ టీచర్ల ట్రైనింగ్‌ ఇన్సిట్యూట్‌లు వ్ఞండి ఏటా పదిలక్షల దాక టీచర్లకు శిక్షణ ఇస్తు న్నాయి.ఇందులో90శాతం ప్రైవెటురంగానివికావడం, సరైన శిక్షణా ప్రమాణాలు లోపించడం షెడ్యుల్‌ పరంగా పర్యవేక్షణ కొరవడడం వలన సర్టిఫికేట్లు సాధించి టీచర్లు అవతారమెత్తుతున్నారు. సంవ త్సరంలో జరిగే సమగ్రమూల్యాకంలో ఆధికశాతం మంది ఉత్తీర్ణత పొందలేకపోతున్నా పట్టించుకునే వారు లేరు. కనిష్ట స్థాయిలో బోధనప్రమాణాలు లేకపోవడంవలన 40 కోట్లప్రాధమిక పాఠశాల ల పిల్లల భవిష్యత్తు అంధకారమయ్యింది.
ప్రభుత్వం బాధ్యత వహించాలి: ఎం.కనకదుర్గ,తెనాలి, గుంటూరుజిల్లా
మనదేశంలో ముఖ్యంగా గ్రామీణ మహిళల, నవజాత శిశువ్ఞ లు, వృద్ధులు ఎదుర్కొంటున్న పోషకాహార సమస్య కారణంగా గత అయిదు సంవత్సరాలలో మరణాలు పది శాతం పెరిగాయన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ఆందోళన కలిగించే అంశం. పిల్లలకు యుక్త వయస్సు వరకూ రోగనిరోధక శక్తినిచ్చే తల్లిపాలు సమస్య తీవ్రతరం అవ్ఞతోందన్న నివేదిక పట్ల ప్రభుత్వం తక్షణం దృష్టి సారించాలి. పాలు,గుడ్లు, తాజామాంసం, ఆకుకూరలు, కాయగూరల వంటివి ప్రతిరోజూ ఆహారంలో భాగంగా చేసుకునే ఆర్థికస్థితి పేదవారికి లేదు. దేశజనాభాలో 70 శాతంగా ఉన్న గ్రామీణుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం తగు శ్రద్ధ వహించాలి.

ప్రయోజనం లేని సీరియల్స్‌: ఎస్‌.శ్రీనివాసరాజు, నల్గొండ

టి.విలలో రోజూ వస్తున్న రోటీన్‌ డైలీ సీరియల్స్‌తో నష్టాలే కానీ ప్రయోజనం శూన్యం. వీటి స్థానంలో వివిధ వర్గాల ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు రావాలి. ఈ విషయంలో ఆకాశవాణి హైదరాబాద్‌ ‘ఎస్టేషన్‌ రేడియోను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క తెలుగు ఛానెల్‌ అనుసరించాలి.ఇంట్లో ఉండే మహిళలకు ఉపయో గపడేవి,విద్యార్థులకు, రైతులకు, యువతకు, వృద్ధులకు, చిన్నారు లకు ఉపయోగపడే విజ్ఞాన కార్యక్రమాలు రావాలి.

హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలి: జి.ఉద§్‌ుభాస్కర్‌, హైదరాబాద్‌్‌
గత కొన్నిసంవత్సరాలుగా హెల్మెట్‌ వాడకం తప్పనిసరి చేయా లని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా సఫలీకృతం కాలేకపోతోంది. జాతీ య రోడ్డు భద్రతా సంస్థ గణాంకాల ప్రకాంర తొంభై శాతం ద్విచ వాహన చోదకులు హెల్మెట్లు ధరించడం లేదు. పలు ప్రమాదాల లో మరణించిన వారిలో 80 శాతంహెల్మెట్లు ధరించకడం లేదని, లేకుంటే వారి ప్రాణాలైనా దక్కేవని రహదారి భద్రతా సంస్థ పలు మార్లు హెచ్చరించినా ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారు.