ప్రజావాక్కు

Voice of the People
Voice of the People

దివ్యాంగులను ఆదుకోండి
దేశంలో దివ్యాంగుల సంక్షేమం కోసం వేల కోట్లు ఖర్చుచేస్తు న్నా క్షేత్రస్థాయిలో అవి సత్ఫలితాలనివ్వడం లేదని యునెస్కో తన తాజానివేదికలో పేర్కొనడం పట్ల ప్రభుత్వాలు స్పందిం చాలి. దేశంలో విద్యాహక్కుచట్టం,దివ్యాంగుల హక్కుల చట్టం తోపాటుదివ్యాంగుల సంక్షేమం కోసం సుప్రీంకోర్టు 2010లోనే స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించినా వారి జీవితాలలో ఆశించిన మార్పురావడం లేదన్న సదరు నివేదిక, మెరుగైన కార్యాచరణకోసం ప్రణాళికలు రూపొందించామని సూచించడం సబబుగాఉంది. దివ్యాంగుల హక్కుల చట్టంతో అనుసంధా నమయ్యేలా విద్యాహక్కు చట్టంలో సవరణలు తీసుకురావాలి. చదువ్ఞకోవడం కోసం విద్యాసంస్థలకు వచ్చే దివ్యాంగులకు ప్రోత్సాహకాలతోపాటు మెరుగైన సౌకర్యాలుకల్పించాలి. తాజా అధ్యయనంప్రకారం అయిదేళ్లలోపు దివ్యాంగులలో మూడొం తులమంది పాఠశాలలుమొహమేచూడకపోగా డ్రాపౌట్ల సంఖ్య పెరిగిపోతోంది.ఈపరిస్థితిమారేందుకుప్రభుత్వంకృషి చేయాలి.
-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం
ప్రభుత్వం మేలుకోవాలి
అసలే ఆర్థికమాంద్యం దానికి తోడు ప్రభుత్వ అసమర్థ విధా నాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి పడ్డట్టు తయారైంది. రైతు ఆత్మహత్యలకు తోడు ఇప్పుడు ఇసుక లేక పని దొరక్క తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధ తాళలేక కూలీల ఆత్మహత్యలు రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యధోరణికి అద్దంపడు తున్నాయి. మరోవైపు రాజధానిపై ప్రభుత్వం చేస్తున్న వ్యా ఖ్యలు అటు భూములు ఇచ్చిన రైతులకే కాక రాష్ట్ర ప్రజలంద రికి ఆందోళన కలిగిస్తున్నాయి. నోరువిప్పి ఏదైనా అడగాలి అంటే ఏ కేసు పెడతారో అని ప్రజలు తీవ్ర అభద్రతాభావంలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలి.
-కె.రామకృష్ణ, విశాఖపట్నం
వృధా అవ్ఞతున్న నీరు
నాగార్జున సాగర్‌ జలాశయంలో రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో 135 కిలోమీటర్ల పొడవ్ఞన కాల్వకట్ట లైనింగ్‌లో బీటలు పడడంపై ప్రభుత్వం తక్షణం స్పం దించి పను లలో నాణ్యత లోపించడంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలి.మళ్లీ నీరు వృధా గాపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు వందల కాల్వలకు గండిపడే ప్రమాదం ఉందన్న నిపుణుల హెచ్చరికలపై ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలి. -రామలింగరాజు, విశాఖపట్నం

కాలుష్యాన్ని నివారించాలి
గాలిలో వివిధ రసాయనాల శాతాన్ని బట్టి (ఏక్యూఐ) వాయు నాణ్యతా సూచీని లెక్కిస్తారు.అయితేఢిల్లీ ప్రపంచంలోనే అత్యంతకాలుష్యపూరితంగా ఉన్నది.మొత్తం549శాతంగా ఉన్న ట్లు ఏ క్యూఐ సూచీ తెలిపింది. కాబట్టి ఇది చాలా ప్రమాకరం. ఇది ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత ఇలానే ఉంటుంది. కానీ ఈసారి ఇంకా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.రానురాను హైదరాబాద్‌ కూడా ఇలానే అవ్ఞతుంది.కాబట్టి కాలుష్య నివా రణ మండలి, ప్రభుత్వాలు, ప్రజలు అందరూ భాగస్వాము లైతేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
-పి.శివసాయి, నల్గొండ
ఆస్పత్రులపై నిఘా పెంచాలి

గతంలో హన్మకొండలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమా దంసంభవించి అయిదుగురు ప్రాణాలు కోల్పోయాక ఆస్పత్రుల నిర్వహణపై హైకోర్టు కఠినతర నిబంధనలు జారీ చేసినా అవి అమలుకు నోచుకోవడంలేదు.అపార్టుమెంట్లు, బహుళ అంతస్తు భవనాలలోఅన్ని నిబంధనలను గాలికొదిలేసి ఆస్పత్రులను నెల కొల్పుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వైద్యఆరోగ్య శాఖ అగ్నిమాపక కాలుష్య నియంత్రణ కార్మిక, విద్యుత్‌ తది తర ప్రభుత్వశాఖల నుండి అనుమతులు పొందాల్సి వ్ఞన్నా వా టిని గాలికొదిలేస్తున్నారు.రెండుతెలుగు రాష్ట్రాల్లో నిబంధనలకు విరుద్ధంగానడిపే ఆస్పత్రులు రెండువేలకుపైగాఉన్నా వాటి నిర్వ హణదారులపై ప్రభుత్వాలుఎలాంటిచర్యలు తీసుకోవడం లేదు.
-కొవ్వూరు రాజశేఖర్‌, హన్మకొండ


ప్లాస్టిక్‌పై నిషేధం అమలు


ప్లాస్టిక్‌పై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం అమలులో పెట్టింది. అమెరికా, చైనాలలో ప్లాస్టిక్‌ వినియోగం ఏటా సగటున 10840 కిలోలుగా వ్ఞంటే భారత్‌లో 10 కిలోలు మాత్ర మే అయినా మనదేశంలో ప్లాస్టిక్‌ వాడకం కంటే విచ్చల విడిగా పారేయడం వలనే సమస్యలు ఎక్కువగా ఉత్పన్నం అవ్ఞతున్నాయి.అక్కడి వర్షాల నిర్వహణ ప్రణాళికను పటి ష్టంగా అమలు చేస్తున్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలపై పరిశోధనలు మందగమనంలో సాగుతున్నాయి. బయో డిగ్రేడబుల్‌ ప్లాస్టిక్‌ను విరివిగా ప్రోత్సహించాలి.ప్లాస్టిక్‌ అన ర్థాలపై విద్యార్థులలో,గ్రామాలలో అవగాహన ముమ్మరం చేయాలి. వ్యర్థాలను వేరు చేయడంలో ప్రజలలో తీవ్ర అ లక్ష్యం ఉంది. అనేక రాష్ట్రాలు కొన్ని రకాలైన ప్లాస్టిక్‌ను నిషేధించినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి.
-ఎన్‌.సతీష్‌రెడ్డి, హైదరాబాద్‌

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/