పెరుగుతున్న మహిళా నేరస్తులు

ప్రజావాక్కు

                      పెరుగుతున్న మహిళా నేరస్తులు

lady prisoners
lady prisoners

పెరుగుతున్న మహిళా నేరస్తులు
ఎన్ని ఆధ్యాత్మిక ప్రసంగాలు విన్నా, ఎన్ని దేవ్ఞళ్లకు మొక్కినా లేదా ఎంతో మంది కౌన్సిలింగ్‌ చేసినా సమాజంలో నేర ప్రవృ త్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇంట్లో పెద్దాచిన్నా అంతా పాశ్చాత్యసంస్కృతికి అలవాటుపడి మానవ సంబంధా లకు ఉన్న విలువను మంటగలిపి విష సంస్కృతిని ఈ నేలపై విత్తి మొలకెత్తిస్తున్నారు. చాలా సందర్భాల్లో హింసాత్మక సంఘటనలకు పురుషులే ఎక్కువగా కారణమవ్ఞతున్నా నేడు వారితో సమానంగా కట్టుకున్న భర్తనే హత్యచేయించడం, ప్రియుడితో స్వేచ్ఛకోసం కన్న కొడుకునే మట్టుబెట్టడం లాంటి నేరాలలో మహిళలు కూడా వార్తల్లోకెక్కుతున్నారు. మహిళల నేరాల్లో దేశంలోని చాలా రాష్ట్రాలు ముందున్నా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ తరహా కేసులు ఎక్కువ అయ్యాయి. కథలోనైనా, కవిత్వంలోనై నా, జీవితంలోనైనా స్త్రీ పాత్రల ఔచిత్యం దెబ్బతింటే సృష్టికి విఘాతం కలుగుతుంది.
-జోస్యుల వేణుగోపాల్‌, హైదరాబాద్‌

ప్రత్యేక పరీక్షా కేంద్రాలు
మార్చి నెలలో పదవ తరగతి, ఇంటర్మీడియేట్‌ పరీక్షలు ప్రారం భం కాబోతున్నాయి. పరీక్షల్లో అక్రమాలను, మాస్‌ కాపీయింగ్‌ ను అరికట్టేందుకు జంబ్లింగ్‌ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఒకే కళాశాల లేక పాఠశాలవిద్యార్థులైతే మాస్‌ కాపీయింగ్‌కు పాల్ప డే అవకాశముందని ఈ ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు మరో రకమైన సమస్య తలెత్తుతోంది. వేర్వేరు పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు కలిపి సీట్లు కేటాయిస్తున్నారు. ఇలాంటప్పుడు కొందరు అబ్బాయిలు తమకు సమాధానాలు చూపించాల్సిందిగా విద్యార్థినులను ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటి పలు సంఘటనలు గతంలో బహిర్గతమయ్యాయి. కనుక జంబ్లింగ్‌ విధానం అనుసరించినా, అమ్మాయిలకు, అబ్బాయిలకు వేర్వేరు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
-జి.అశోక్‌, గోదూర్‌, జగిత్యాల జిల్లా

సెల్ఫీపిచ్చి ప్రాణసంకటం
టెక్నాలజీ అభివృద్ధిచెందుతున్న కొద్దీ మానవ్ఞని ఆలోచన లు ఎంత పిచ్చిపోకడలు పోతుందో తెలియడంలేదు. జనా లలో సెల్ఫీ ఫొటోల పిచ్చి ఎక్కువైంది. ఒక్కోసారి ఇది ప్రా ణాల మీదికి తెచ్చిపెడుతుంది.రన్నింగ్‌ ట్రైన్‌ ముందు నిల బడి సెల్ఫీదిగడం, జలపాతాలలో,హైవేలపై బైక్‌లు నడు పుతూ సెల్ఫీలు దిగడం తదితర మతిలేని పనులు చేస్తూ ప్రాణాలను కోల్పోతున్నారు. యువతకు, పిల్లలకు పెద్దల కౌన్సిలింగ్‌ అవసరం.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

అధ్వాన్నంగా మారిన రహదారులు
రాష్ట్రంలోనే హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద నగరంగా, అతిపెద్ద కార్పొరేషన్‌గా ప్రసిద్ధిగాంచిన వరంగల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వివిధ వార్డుల, డివిజన్‌ల రోడ్లు గోతులమయమై అధ్వాన్నంగా ఉన్నాయి. కేంద్రప్రభుత్వం వరంగల్‌ మహానగరాన్ని హృద§్‌ు, స్మార్ట్‌సిటీగా ప్రకటించింది.వరంగల్‌ నగరంలోని చారిత్రక ప్రదే శాలనుసందర్శించడానికి వచ్చినఅతిధులు,పర్యాటకులు మాత్రం నగరంలోని రోడ్ల పారిశుద్ధ్యాన్ని చూసి నగరాన్ని స్మార్ట్‌సిటీగా ఎలా ఎంపిక చేసారనే సంశయం కలుగుతుంది. నగరపాలక సంస్థ తక్షణమే రోడ్లను మరమ్మతులు చేయించాలి.
-కామిడి సతీష్‌కుమార్‌, భూపాలపల్లి జిల్లా

డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలి
తెలంగాణ రాష్ట్రంలో మురుగునీటి పారుదల వ్యవస్థ అధ్వా న్నంగాఉంది. పలుచోట్ల రోడ్లు అసలే అంతంత మాత్రం. వాటి నిర్మాణం,నిర్వహణ పనుల పర్యవేక్షణ,నియంత్రణ నానాటికీ తీసికట్టుగా తయారవ్ఞతోంది. డ్రైనేజీ దురవస్థ పౌరులకు ఎంతో ఇబ్బందికరంగా పరిణమిస్తోంది.గతంలోకురిసిన భారీ వర్షాలకు ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎదురైన సమస్యలను ఎవ్వరూ మరిచిపోలేరు. అప్పట్లో మురుగు నీటి బెడద వల్ల నగరం లో పాదచారులు, వాహనదారులు నరకయాతన పడాల్సి వచ్చింది. –  సి.రామకృష్ణ, హైదరాబాద్‌

పోస్టులను భర్తీ చేయాలి
సాధారణంగా ఉద్యోగ,ఉపాధి అవకాశాలు ఇతర రంగాల కంటే విద్యాశాఖల్లోనే ఎక్కువగాఉంటాయి.తెలంగాణ రాష్ట్రంలో ఇప్ప టికీ పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అనేక ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ అనేక చోట్ల విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు లేరు. ఈ పరిస్థితులకు తోడు హేతుబద్ధీకరణ పేరిట కొన్ని పాఠశాలలను మూసివేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇది పేద పిల్లలను చదువ్ఞలకు దూరం చేయడమే అవ్ఞతుంది.
– ఎన్‌.సుదర్శన్‌రెడ్డి, వరంగల్‌జిల్లా

విద్యార్థుల ఇబ్బందులు తొలగించాలి
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండల కేంద్రానికి వివిధ గ్రామాల పాఠశాలల విద్యార్థులు పదవ తర గతి పరీక్షలురాయడానికి వస్తుంటారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులులేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అన్ని వసతులున్న పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.
-గుండమల్ల సతీష్‌కుమార్‌, నారాయణపురం