నిబంధనలకు తిలోదకాలు

ప్రజావాక్కు

NH5
NH5

నిబంధనలకు తిలోదకాలు: ఎం.కనకదుర్గ,తెనాలి, గుంటూరుజిల్లా

గుంటూరు నుంచి చెన్నై వెళ్లే ఎన్‌హెచ్‌-16హైవేపై నిబంధ నలకు విరుద్ధంగా ఇరువైపులా సమస్యలు ఉత్పన్నమవుతున్నా యి. మరొకవైపు గుంటూరుజిల్లా పరిధిలో లాలుపురం నుండి పెదకాకాని జంక్షన్‌ వరకు రోడ్డుకు ఇరువైపులా చెత్తాచెదారం, వ్యర్థాలను పడేస్తూ డంపింగ్‌ యార్డులా మార్చేస్తున్నారు. గుంటూరుజిల్లాను బహిరంగ మలవిసర్జనరహిత ప్రదేశంగా ప్రకటించినా హైవేలపై ఇందుకు భిన్నమైన పరిస్థితి కన్పిస్తోంది. ఇక ఈ హైవేపై ప్రతి వందకిలోమీటర్లకు ఒక వైన్‌షాపు ఉండగా డ్రైవర్లు పట్టపగలే బహిరంగంగా మద్యపానం చేస్తున్నారు. అన్ని నిబంధనలకు తిలోదకాలిచ్చి మితిమీరిన వేగంతో వాహ నాలను నడుపుతూ ప్రమాదాలకు గురవ్ఞతున్నారు.

వడ్డెర బతుకు భారం: జి.అశోక్‌, గోదూర్‌, జగిత్యాలజిల్లా

తరతరాలుగా వడ్డెరలబతుకుల్లో ఎటువంటిమార్పు చో టుచేసుకోకపోవడం విచారకరం.బుక్కెడు బువ్వకోసం ఎండ నకా, వాననకా, బండలు బద్ధలు కొట్టి భూరి భవనాలకు పునాదులు వేసే వీరి బతుకులకు ప్రభుత్వాలు పునాదులు వేయలేకపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాల వారికి వృత్తిలో ప్రోత్సాహకాలు ప్రకటి స్తుంది.కాని వడ్డెర కులస్థులకు ఎలాంటి ప్రోత్సాహం లేదు. నిరుపేదల ఉద్ధరణకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథ కాలు ప్రవేశపెడుతున్నా, అవి వీరిని చేరడం లేదు.యంత్రా ల రాకతో వడ్డెరలకు పనులు లేకుండాపోయాయి. బండ రాళ్ల మధ్యనే బండబారిపోతున్న వీరి బతుకులకు ఇకనైనా కాస్తంత చేయూతనివ్వాలి.

గంగానదిలో పెరుగుతున్న కాలుష్యం: సి.ప్రతాప్‌, శ్రీకాకుళం
గంగానదిలో పోటెత్తుతున్న కాలుష్యంపై ఐకాస చేసిన తీవ్ర హెచ్చరికలు మన ప్రభుత్వాలకు కనువిప్పు కావాలి. గంగానది పరివాహక ప్రాంతంలో వారణాసి,హరిద్వార్‌ వంటి పుణ్యక్షేత్రా లు ఎన్నో ఉన్నాయి. అయినా అపారిశుద్ధ్యం అడుగడుగునా ఉంటోంది. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, నిర్లక్ష్యం ఫలితంగా పవిత్ర గంగానది ఒక డ్రెయినేజి కాలువగా మారిపోతోంది. నది ని శుద్ధి చేసేందుకు 1995లోనే గంగా శుద్ధి ప్రణాళిక మొదటి దశ ప్రారంభంకాగా ఇప్పటి వరకు పూర్తవలేదు. ఈ ప్రణాళిక పేరిట 1100కోట్లు ఖర్చుచేసినట్లు అధికారిక లెక్కలు చెబుతు న్నా ఫలితం శూన్యం. ఎక్కువ భాగం నిధులు దుర్వినియోగం అయ్యాయని కాగ్‌ తన నివేదికలో బట్టబయలు చేసింది. ప్రభు త్వం 2014 సంవత్సరంలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం అట్టహా సంగా ప్రారంభించిన గంగానది శుద్ధి మాత్రం ఎక్కడవేసిన గొం గళి అక్కడే చందానఉంది.పర్యావరణ సమతుల్యాన్ని పాటించే నది పరివాహక ప్రాంతాలను, నీటి వనరులను కాలుష్యం కోరల బారినుండి కాపాడేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలి.

 

తెలుగు మాట్లాడటం మన సంస్కారం: ఉలాపు బాలకేశవులు, గిద్దలూరు, ప్రకాశంజిల్లా

ఒకప్పుడు వెలుగులు విరజిమ్మిన తెలుగు భాషకు పరభాషా వ్యామోహమనే గ్రహణం పట్టి మబ్బులు కమ్మేస్తున్నాయి. దాంతో మన తెలుగు భాషకు సంబంధించిన అలవాట్లు అభిరుచులు, సం స్కృతీసంప్రదాయాలు ఒక్కొక్కటి మరుగునపడుతున్నాయి. కొంద రు తెలుగు మాట్లాడితేనే తమ అంతస్తుకి గొప్పతనానికి భంగమ నుకుంటున్నారు. వాళ్ల పిల్లలకు అ అంటే అంకుల్‌ అని, ఆ అంటే ఆంటీ అని నేర్పిస్తున్నారు. వీళ్లు ఈ పద్ధతి మార్చుకుంటే మన తె లుగుభాషలోని మాధుర్యం నుడికారపు సొంపు తొణికిసలాడుతుం ది. మనది తెలుగు భాష. మనం తెలుగు వాళ్లం. మనది తెలుగు జాతి.మన భాషను చెక్కుచెదరకుండా సుభిక్షంగా ఉండేట్లు చూసు కునే బాధ్యత మనదే. తెలుగువాళ్లు తెలుగు మాట్లాడితేనే గౌరవం.

ప్ర్రతిపక్షానికి దూరం: యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

ఉమ్మడి మద్రాసు రాష్ట్రం సమైక్యఆంధ్రప్రదేశ్‌లలో శాసనసభ ప్రతిపక్షనేతలు హుందాగా సభలోను బాహ్యప్రపంచంలోను ప్రవ ర్తించారు. రాష్ట్ర అభివృద్ధిలో అధికారపక్షంను అప్రమత్తం చేస్తూ ఎప్పుడైనా ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ప్రజల భాగస్వా మ్యంతో ఆందోళనలు చేయడంతో తర్వాత కాలంలో అధికారపగ్గా లు చేపట్టిన సంఘటనలు అనేకం. ప్రస్తుత ప్రతిపక్షనేత రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రిని అధికారంలోకి రాగా నే చర్యలు తీసుకుంటామంటూ అధికారులను బెదిరించడం వంటి సంఘటన లతో రోజురోజుకు ప్రాభవం కోల్పోతున్నారు. అందుకు సాక్ష్యం ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికలే.

ఈ చిత్రవధ ఇంకెన్నాళ్లు?: సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

సమాజాన్ని సన్మార్గంలోకి పెట్టగలశక్తివంతమైన సాధనం టివి. అలాంటి టి.వి.నే అడ్డదారులు తొక్కితే సమాజం ఏమవుతుంది. పగలు, రాత్రి డైలీ సీరియల్స్‌తో నింపి వేలకు వేలు ఎపిసోడ్లుగా ఒక సీరియల్‌ వచ్చేలా ప్రసారం చేస్తున్నారు. అడుగడుగునా కుట్ర లు,కుతంత్రాలు, రక్తసంబంధీకుల మధ్యనే వైషమ్యాలు, హత్య లు, మూఢనమ్మకాలు వ్యాప్తి,కష్టాలు,కన్నీళ్లే తప్పమేలైన సందేశం శూ న్యం.ఎంతోమంది వీటికి బానిసలై మానసికంగా ఉన్మాదులవ్ఞ తున్నారు. సమాజాన్ని చెడుమార్గంలోకి నెడుతున్నాయి ఈ సీరి యల్స్‌. టి.వీ సీరియల్స్‌కు సెన్సార్‌ ఉండాలి.

దౌర్భాగ్యం ఎంత దౌర్భాగ్యం!: బి.ఎన్‌.సత్యనారాయణ, హైదరాబాద్‌

పెరుగుతున్న ఈ అన్యాయాలకు,అత్యాచా రాలకు అంతం లేదు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. న్యాయం చట్టం ఏం చేస్తున్నాయి. నిన్న గురుగాంవ్‌లో బాలుడిపై జరిగిన అతిహేయమైన అత్యాచారం, నేడు ఢిల్లీలో ఐదు సంవత్సరాల చిన్నారిపై జరిగిన అత్యాచారం ఇలా ఎన్నెన్నో మృగాళ్ల లీలలు. ఇలా నిత్యం అత్యాచారాలు, హత్యలు జరుగుతూ పోతుంటే ప్రభు త్వాలు ఏం చేస్తున్నట్టు?శిక్షల్ని ప్రభుత్వాలు వెంటవెంటనే అమలు పరిచిననాడు నేరాలు తప్పకుండా తగ్గుముఖం పడతాయి.