నకిలీ మందుల భరతం పట్టాలి

ప్రజావాక్కు

Duplicate

నకిలీ మందుల భరతం పట్టాలి

పలు పట్టణాల్లో మందుల దుకాణాల నిర్వహణ తీరు నానా టికీ తీసికట్టుగా మారుతోంది.ప్రాణంనిలబెట్టే ఔషధాల విక్రయం లో ఎంత ముందుజాగ్రత్త తీసుకొంటే అంత మంచిది. ఈ సూ త్రాన్ని విస్మరించి వ్యవహరిస్తున్న కొన్ని మెడికల్‌ షాపుల ధోరణి బాధితులకు ప్రాణాంతకంగా మారుతోంది. ప్రతి దుకాణంలోనూ ఔషధి విజ్ఞానం గలవారు ఉండాలితప్ప తెలిసీతెలియని తనంతో విక్రయిస్తే అవాంఛనీయతలే పెచ్చరిల్లుతాయి.వైద్యుడు ఇచ్చే మందు చీటి ఆధారంగానే వ్యాపారం నిర్వర్తించాల్సిన వారు అందుకు భిన్నంగా తమకు తోచినవి అంటగట్టడం రాష్ట్రంలో అనేక చోట్లరివాజు అవుతోంది. ఏమాత్రం పరిజ్ఞానం, అనుభ వం లేనివారు ఫార్మసీకి సంబంధించిన సర్టిఫికెట్లను ఇతరుల నుంచి అద్దెకు తీసుకుని పబ్బం గడుపుకోవడం వంటివి ఇటీవల ఔషధ నియంత్రణ విభాగం అధికారుల మెరుపుదాడుల్లో వెలు గుచూశాయి.ఏవో కొద్దిపాటిచర్యలు మినహా,ఆశాఖ దృఢంగా వ్యవహరించకపోవడం పరిస్థితిమళ్లీ మొదటికి వచ్చింది.ప్రభుత్వ విభాగాలు ఇప్పటికైనా ఉదాసీనధోరణి విడనాడాలి.
జి.అశోక్‌,గోదూర్‌, జగిత్యాలజిల్లా

వేద పండితులు చెప్పింది వినండి
విశాఖపట్నం అగనంపూడి సమీపంలోగల జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీ నిర్వాసితులు నివాసం ఉండే ఫార్మాసిటీ కాలనీలో గల రామాలయం నిర్మాణ పనులు గత అయిదేళ్ల నుండి ఒక్క అడుగు కూడా ముందు పడడం లేదు. ఫార్మాసిటీ నిర్మాణం కోసం ఎపిఐఐసి ద్వారా ఆరుగ్రామాల ప్రజలను నిర్వాసితుల కాలనీకి తరలించి ఐదు సంవత్సరాల క్రితం స్థానికుల కోరిక మేరకు రామాలయం నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. అయితే ప్రధాన గుడి నిర్మాణాన్ని మాత్రం పూర్తి చేసి మిగతా నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేసారు. త్వరగా నిర్మాణం పనులు పూర్తి చేసి మూలవిరాట్‌ను స్థాపించాలని లేకుంటే అరిష్టం తప్పదని వేదపండితులు విజ్ఞప్తులు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం
సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

నిదానంపాడును ఆదుకోండి
గుంటూరు జిల్లా నిదానంపాడులో మౌలిక వసతులు కూడా కరవయ్యాయి. స్కూలు భవనం, కమ్యూనిటీ హాలు, ఐటిడిఎ భవనంతోసహా గృహలు కూడా శిథిµలావస్థకు చేరుకున్నాయి. ప్రభుత్వ రికార్డుల్లో రెవెన్యూ గ్రామంగా ఉన్న మిగతా గ్రామాల తో సంబంధాలు తెగిపోయాయి. ఈ గ్రామానికి వేల సంవత్స రాల సుసంపన్న చరిత్ర ఉంది. అనేక సంచార జాతుల వారు ఈ గ్రామంలో తలదాచుకుంటున్నారు. ఇక్కడ రహదారులు లేవ్ఞ. విద్యుత్‌ సౌకర్యం అంతంత మాత్రమే. ఉన్న ఒక్క ప్రభుత్వ స్కూలు ఎత్తేయడంవలన పిల్లలు చదువ్ఞలకు దూరమయ్యారు. బోరుబావ్ఞలు ఎండిపోయాయి. సురక్షిత నీటి సౌకర్యం లేదు. ఇన్ని సంవత్సరాలు గడిచినా నిదానంపాడు వంటి గ్రామాలు అభివృద్దికి నోచుకోకపోవడం బాధాకరం.
ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా
===

ఎటిఎంల పనితీరు అధ్వాన్నం
నల్గొండ జిల్లాలో వివిధ మందుల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఎటిఎంల పనితీరు అధ్వాన్నంగా ఉంది. ఖాతాదారులు అన్ని వేళలా నగదు డ్రా చేసుకునేందుకు ఏర్పాటు చేసిన ఎటిఎంలు తరచూ మొరాయిస్తున్నాయి. ఇవి 24 గంటలు అందుబాటులో ఉండాలన్న ప్రభుత్వ నిబంధనలు అమలు కావడం లేదు. ఈ కేంద్రాలు తరచూ మూసి ఉంటున్నాయి. ఎప్పుడు తెరుస్తారో, ఎప్పుడు నగదు లభ్యత ఉంటుందో బ్యాంకర్లకే తెలియని పరిస్థితి నెలకొని ఉంది. ఈ మెషీన్లు తరచూ సాంకేతిక సమస్యల కారణం గా పనిచేయకపోతున్నా వాటిని సకాలంలో రిపేర్లు చేయడమో లేక కొత్త మెషీన్లు ఏర్పాటు చేయకపోవడమోవంటి చర్యలను బ్యాంకులు తీసుకోవడం లేదు. బ్యాంకర్లకు ఫిర్యాదుచేస్తే ఎటి ఎం నిర్వహణ ఏజెన్సీలకు అప్పచెప్పామని చెపుతున్నారు.
సిహెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

విద్యా విధానంలో సంస్కరణలు

నేటి విద్యావిధానం లోపాలతో కూడుకొని సాగుతున్నది. ఎన్ని సంస్కరణలు వచ్చినా విద్యార్థులపై ఒత్తిడి తగ్గడం లేదు. మార్కు లు లేదా మంచి గ్రేడులే లక్ష్యంగా చదువ్ఞ చదువ్ఞ చదువేతప్ప ఆటపాటలు, కళలు, నైతిక విద్య కరవైంది. ప్రైవేట్‌పాఠశాలల్లో నైతే మరీ ఎక్కువ ఒత్తిడి పిల్లలపై ఉంది. ఇది విద్యార్థుల ప్రవ ర్తనపై దుష్ప్రభావం చూపుతుంది. ఫలితంగా చాలా మంది విద్యా ర్థుల ప్రవర్తన గాడి తప్పుతున్నది. విద్యార్థులకు నిత్యం చదువ్ఞ తోపాటు ఆటపాటలు తప్పనిసరిగా ఉండాలి. కళలనూ నేర్పాలి. అయితే నైతిక విద్య తప్పనిసరి అని మరువరాదు. ఒకటో తర గతి నుండి కళాశాల వరకు నైతిక విద్య తప్పని సరిచేయాలి. విద్యార్థులకు క్రమంతప్పకుండా మంచినీతితోకూడుకున్న పురాణ, జానపద, చారిత్రాత్మక, సాంఘిక కథలను చెప్పాలి.నైతిక విద్యకు ప్రత్యేక ఉపాధ్యాయులు ఉన్నప్పుడే ఇది సఫలం అవ్ఞతుంది.

సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

బాలల చిత్రాలకు ఏదీ ఆదరణ?

మన ఆసియా ఖండంలో టివిలు, సినిమా థియేటర్లు సోషల్‌మీడియాలో బాలల చిత్రాలకు సరైన గుర్తింపు, ప్రాధాన్యత ఇవ్వకపోవడం మూలాన భవిష్యత్తులో బాలల చిత్రాలకు ఆదరణ కరువైందని అర్థమవ్ఞతుంది. బాలల దినోత్సవ సంబరాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నా ఏ భాషలోని ఛానళ్లలో కూడా బాలల చలన చిత్రాలు ప్రసారం కాకపోవడం బాధాకరం.ధైర్యం, సాహసం, మానవతా విలువలు, ఓర్పు సహనం, సేవా గుణాన్ని పెంపొందించే బాలల చలన చిత్రాలను నిర్మించకపోవడం తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు చదువే ధ్యాసగా పెంచడం, స్వేచ్ఛ లేకుండా ర్యాంకులే పరమావధిగా కట్టడి చేయడం పిల్లల దృష్టి చలన చిత్రాలపై పడడం లేదు. 19వ బాలల చలన చిత్రాల విజయవంతంలో మీడియా ఏవిధంగా తమదైన పాత్ర పోషించిందో 21వ బాలల చలన చిత్రోత్సవంలో మరింత పాత్ర పోషించాలి. వివిధ ఛానళ్లు, సినిమా థియేటర్లలో బాలల చలన చిత్రాలను ప్రసారం చేయాలి.

కామిడి సతీష్‌రెడ్డి, పరకాల వరంగల్‌జిల్లా