చదువు భారం కాకూడదు

       ప్రజావాక్కు

                 చదువు భారం కాకూడదు

education system
education system

చదువు భారం కాకూడదు
ఉన్నత విద్యను దేశం నలుమూలలకు అందించాలన్న సదాశయంతో సార్వత్రిక విశ్వవిద్యాలయాలు ప్రారంభమయ్యాయి. అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా దూరవిద్యా విభాగాలు ఉన్నా యి. వీటి ద్వారా లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు లబ్ధి పొందుతున్నారనడంలో సందేహం లేదు. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ, ఇందిరాగాంధీ ఓపెన్‌ యూనివర్శిటీ లాంటి విశ్వవిద్యాలయాల్లో ప్రారంభించిన కొత్తలో కోర్సుకు అయ్యే మొత్తం ఖర్చు వందల్లో ఉండేది. అందువల్ల ఆర్థిక స్థోమత లేక చదువ్ఞ నిలిపి వేసిన వారు కూడా విద్యాభ్యాసం కొనసాగించే వీలు చిక్కింది. అయితే రానురాను చెల్లించాల్సిన ఫీజులు భారీ గా పెంచేశారు.ఫలితంగా తక్కువ ఆదాయం ఉన్నవాళ్లు చదువ్ఞ కోలేకపోతున్నారు. ఫీజులు, స్టడీ మెటిరీయల్‌, ఇతర ఖర్చులతో పి.జి, డిప్లొమాకు యాభైవేల వరకు పి.జి కోర్సుకు యాభైవేల కుపైగా, ప్రాక్టికల్స్‌ ఉన్న పి.జి కోర్సులకు ఇంకా ఆపైన వ్యయం భరించాల్సివస్తోంది. కనుకవిశ్వవిద్యాలయాలు వసూలు చేస్తున్న మొత్తం ఏ సామాజిక వర్గం వారికి కూడా భారం కాకూడదు.
                                                                                                                                                            జి.అశోక్‌, గోదూర్‌, జగిత్యాలజిల్లా

నేర నిరూపణ అతిపెద్ద సమస్య
చేసిన నేరానికి శిక్షపడుతుందన్న భయం ఉన్నప్పుడే నేరగాళ్లు నేరం చేసేందుకు వెనుకాడతారన్నది నగ్నసత్యం. మనదేశంలో నేరనిరూపణ అతి పెద్ద సమస్యగా మారినందుకు గతపదేళ్ల కా లంలో నేరాలు అధికమైనానేరస్తులకు శిక్షలుతగ్గిపోయాయి. జపాన్‌లో 90శాతం నేరస్తులకు సంవత్సరంలోపే శిక్షలు విధిం పబడి ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉండగా భారతదేశం ఇందులో 98 స్థానంలో ఉంది. ఇక దేశవ్యాప్తంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ శిక్షలు ఖరారు అయిన శాతం 31గా వ్ఞండి పదిహేను, పదహారుస్థానాలలో నిలిచాయి. ప్రతీ వంద కసుల్లో 69 కేసులు న్యాయస్థానాలలో వీగిపోతుండడం నేర గాళ్ల పాలి టవరంగా మారింది. ఏళ్లతరబడి న్యాయంకోసం పోరాడే బాధితులకు చివరకు నిరాశే మిగులుతున్నది. దర్యాప్తు సమయంలో కోర్టుకు తగిన ఆధారాలు సమర్పించడంలో వైఫల్యం ప్రధాన కారణం.
                                                                                                                                                     ఎం.కనకదుర్గ,తెనాలి, గుంటూరుజిల్లా

నియోజకవర్గానికో అగ్నిమాపక కేంద్రం
తెలంగాణ లోని అగ్నిమాపక కేంద్రాలు కేవలం సబ్‌-డివిజన్‌ కేంద్రాలలో ఉండడం వల్ల వివిధప్రాంతాలలో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు సకాలం లో అగ్నిమాపక వాహనం దూరంగా ఉన్న ప్రదేశాలకు చేరుకోవడం కష్టమవ్ఞతోంది. ప్రతీ కేంద్రంలో ఒకటే శకటం ఉండటం సిబ్బంది కొరత ఉండటం, ముఖ్యంగా శకటంను నడిపే డ్రైవర్లు తక్కువగా ఉండటం మూలంగా పూర్తిస్థాయిలో ప్రమాదాల బారి నుండి కాపాడలేకపోతు న్నారు. వరంగల్‌ జిల్లాలో ములుగులోని అగ్నిమాపక కేంద్ర కార్యాలయంశిథిలావస్థకుచేరింది.ప్రభుత్వం వెంటనేప్రతినియో జకవర్గ కేంద్రంలో అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
                                                                                                                                                  కామిడి సతీష్‌రెడ్డి,పరకాల, వరంగల్‌జిల్లా

స్లెడ్జింగ్‌ను నిషేధించాలి

చాలా క్రీడలు చూస్తుంటే కొంత మంది క్రీడాకారులలో హుందా తనంలోపించింది. క్రీడాకారుడు తన ప్రతిభతో ఆటను గెలవడానికి ప్రయత్నించాలి. కాని స్లెడ్జింగ్‌ను ఆయుధంగా వాడుకుంటున్నారు. దూషణలతోను, హేళనతోను ప్రత్యర్థి ఆటగాళ్లను మానసికంగా దెబ్బతీసి, చికాకు పరచి, ఆటతీరును దెబ్బతీసి గెలవాలని ప్రయ త్నించడం మామూలు అయింది. ముఖ్యంగా క్రికెట్‌లో ఇది ఎక్కు వగా ఉంది. ప్రపంచంలోనే మేటి జట్టుగా ఉన్న ఆస్ట్రేలియా ఆట గాళ్లు ఈ స్లెడ్జింగ్‌ ఆయుధాన్ని ఎక్కువగా వాడుకుంటున్నారు. ఇది క్రీడాభిమానులను దెబ్బతీస్తుంది.
                                                                                                                                                      సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

రిజర్వు సీటు నేత కరవు
నేటి సమాజంలో ఎస్సీ,ఎస్టీ సామాజిక వర్గాలకి సామాజిక చైతన్యం అవసరం. అందరికి ఆదర్శంగా నిలుస్తూ ముందుకు సాగాల్సిన యువత ఆలోచనలు వేరే వైపు మారుతున్నాయి. రిజర్వు సీటు లో పోటీలుపడి, కొట్లాటలకు,మనస్పర్థలకు దారితీసుకునే బదులు జనరల్‌ సీటులో పోటీచేసే చైతన్యం ఎందుకు పెంపొందించుకోలేకపోతున్నారు. రాజకీయాల్లో ఎస్సీ,ఎస్టీ వాటా భర్తీ అవ్ఞతుందా? పార్టీలు ప్రోత్సహించవ్ఞ. స్థానికుల్ని ఎదగనివ్వరు.
                                                                                                                                                 గుండమల్ల సతీష్‌కుమార్‌, నారాయణపురం

బ్రిడ్జిలపై లైట్లను ఏర్పాటు చేయాలి
నల్గొండ జిల్లాలో వేములపల్లి మండలంలో నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వపై గల బ్రిడ్జిలు ప్రమాదకరంగా మారాయి. ఐదు దశాబ్దాల క్రితం సాగర్‌ ఎడమ కాలువ నిర్మాణంలో భాగంగా కాల్వకు ఇరువైపులా ఉన్న గ్రామాలను అనుసంధానం చేయడానికి పలు వాగులపై బ్రిడ్జీలు నిర్మించారు. పలుచోట్ల రక్షణ గోడలు నిర్మించ కుండా రెయిలింగ్‌లు ఏర్పాటు చేసి వదిలేసారు.తర్వాత ఈ రెయి లింగ్‌లకు ఎలాంటి మరమ్మతులు చేపట్టనందున అవి శిధిలావస్థకు చేరుకొని ప్రయాణం ప్రమాదకరంగా మారింది. సాగర కాల్వ కట్ట ద్వారానే పలు గ్రామాలకు మార్గం ఉన్నందున నిత్యం వేలాది ప్రజలు ఈబ్రిడ్జీలపై ప్రయాణం చేస్తుంటారు. రక్షణ వ్యవస్థ లేనందునే రాత్రిళ్లు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ బ్రిడ్జీలపై రోడ్లు కూడా బాగా దెబ్బతిన్నాయి. ఈ బ్రిడ్జీలపై లైట్లు ఏర్పాటు చేస్తే ప్రయాణీకులకు సౌకర్యంగా ఉంటుంది.
                                                                                                                                                                సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

ఎక్కువ జరిమానా విధించాలి
ట్రాఫిక్‌ పోలీసులు విస్తృతంగా తిరుగుతూ హెల్మెట్‌ లేకుండా వాహనాలను నడిపేవారిని, రాంగ్‌రూట్‌ డ్రైవింగ్‌ చేస్తున్నవారినీ, రాంగ్‌ పార్కింగ్‌ చేస్తున్న వారినీ, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేస్తున్న వారి నీ ఫొటోలుతీసి, బుద్ధి చెబుతున్నారు.బాగానేఉంది. కానీ ప్రమాద కారులు, ఇంకొన్ని రకాలుగా ప్రజలను ఇబ్బంది పెడుతు న్నారు. సెల్‌మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేసేవారు, చెవిలో ఇయర్‌ఫో న్స్‌ పెట్టు కొనిపాటలు వింటూ డ్రైవింగ్‌ చేసే వారి సంఖ్య అసం ఖ్యాకం. మరివీరి మూలంగా కూడా రోడ్డు ప్రమాదాలు జరుగు తు న్నాయి. వీరిని పట్టుకొని భారీగా జరిమానా కట్టిస్తే మరింత బాగుంటుంది.
                                                                                                                                                                        ఎస్‌.శ్రీనివాస్‌, హైదరాబాద్‌