ఇ పట్టాదారు పాసుపుస్తకాలు

ఇ పట్టాదారు పాసుపుస్తకాలు
భూమి రికార్డుల్లో పారదర్శకత కోసం ఆధునిక విజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.భూములకు సంబంధించినవివరాలను అన్నదాతలకు అందుబాటులో ఉంచడానికి మీ భూమిఅనే వెబ్‌పోర్ట ల్‌ను కూడా ప్రారంభించారు. ఈ వెబ్‌పోర్టల్‌ ద్వారా భూమి రికార్డుల్లో తప్పు ఒప్పులను సరిచేస్తున్నారు. ఇ పాసుపుస్తకాల ప్రక్రియ ప్రారంభించిన తర్వాత రైతుల ఇబ్బందులు రెట్టింపయ్యాయి.పట్టాదారు పాసుపుస్తకాల కోసంనెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయ మేమింటే మన రాష్ట్రంలో ఇ పాసుపుస్తకాలను చెన్నైలో ప్రింట్‌ చేస్తున్నారు.ఇ పాసుపుస్తకాల కోసం రైతులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇ పాసుపుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్న 30రోజుల తర్వాత పట్టాదారుపుస్తకం రైతుకు చేరా ల్సిఉంది.ఆరు నెలలనైనా ఇ పాసుపుస్తకాలకు అతీగతీ ఉండడం లేదు. మరోపక్క కాల్‌మనీ వ్యవహారంతో వడ్డీ వ్యాపారులు, ప్రైవేట్‌సంస్థల్లో అప్పులు పుట్టడంలేదు. పట్టాదారు పాసుప్తుకం లేకపోతే బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు. రైతులు మీ సేవా కేంద్రాల్లో ఇపట్టాదారు పాసుపుస్తకంకోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత రెవెన్యూ శాఖ భూమి రికార్డులను పరిశీలించి పాసు పుస్తకం డేటాను చెన్నైకి పంపిస్తున్నారు. ఆధునిక పరిజ్ఞానం వినియోగించుకోవడంలో మనరాష్ట్రం ముందు వరుసలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇ పాసుపుస్తకాలను ప్రచురించే పరిజ్ఞానం మన రాష్ట్రంలో లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నా యి.ఇప్పటికే ఇ పాసుపుస్తకాలను మంజూరుచేయడంలో రెవె న్యూశాఖ తీవ్ర జాప్యంచేస్తోంది.ప్రతీతహశీల్దార్‌ కార్యాలయంలో ఇ పాసుపుస్తకాలు వేలల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఇ పట్టాదారు పాసుపుస్తకాల కోసం తహశీల్దార్‌ కార్యాలయాలకు వెళ్తున్న రైతు లకు మీపుస్తకం చెన్నైలో ప్రింట్‌ అవుతోందంటున్నారు. రావడా నికి సమయం పడుతోందంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో రైతులు చెన్నై నుంచి ఇ పాసుపుస్తకంఎప్పుడు వస్తుం దా అని అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు ఆలోచించాలి.
– దేవవరపు వెంకటరమణ, నక్కపల్లి, విశాఖపట్నంజిల్లా

పాఠశాలల్లో సెల్‌ఫోన్‌లపై నిషేధం
పాఠశాలల్లో ఉపాధ్యాయులు సెల్‌ఫోన్‌ఉపయోగించడం నిషే ధం అని పాఠశాల విద్యా డైరెక్టర్‌ ప్రకటించడం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షించతగిన విషయం. ఎందుకంటే క్లాసు లో ఉపాధ్యాయులు పాఠం చెప్పే సమయంలో సెల్‌కాల్‌ వస్తే, మరల పాఠం చెప్పే ఉపాధ్యాయులకు వినే విద్యార్థులకు పాఠం మీద ఉన్న దృష్టి పక్కదారి పడుతుంది.ఉపాధ్యాయులు పాఠశా లకు రాగానే సెల్‌ఫోన్‌ హెచ్‌ఎంవద్ద డిపాజిట్‌ చేయాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవన్నారు. జనవరికల్లా టెన్త్‌ సిలబస్‌ పూర్తి చేయాలని, ఫిబ్రవరిలోరివిజన్‌ క్లాసులను ప్రారంభించా లన్నారు. మార్చి మొదటి వారంలో ప్రీఫైనల్‌ పరీక్షలను నిర్వహించాలని ఆదేశించారు.
– సి.వి.ఆర్‌.కృష్ణ హైదరాబాద్‌

దోమల నివారణ
చిన్న జాగ్రత్త పెద్దరక్షణ, దోమకాటు నుండి చిన్న చిన్న జాగ్ర త్తలు పాటిస్తే అనేక వ్యాధుల బారి నుండి రక్షించబడవచ్చు. ప్రస్తు తం ప్రపంచాన్ని వణికిస్తున్న ‘జికా’ ఈ వైరస్‌ దోమ వల్ల  వస్తుంది. ప్రస్తుతం ప్రమాదం ఏమీ లేదు. మన భారతదేశంలో ఈ వైరస్‌ నుండి అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేయాలి.ప్రజల్లో అవగాహన అవసరం. జికా వైరస్‌కు ఎటువంటి టీకాలు లేవు. మందులు లేవు.కావున ఈ వైరస్‌ రాకుండా నివారణ ఒక్కటే మార్గం. కాబట్టి దోమల నివారణ ఒక్కటే మార్గం. ప్రపంచంలో దాదాపు 70 కోట్ల మంది దోమకాటుకు గురిఅవుతున్నారు. ఈ దోమకాటు వల్ల అనేక వ్యాధులు సంక్రమించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దోమకాటు నుండి నివారణ మార్గం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలి. స్వచ్ఛభారత్‌ వల్ల ఎక్కువ శాతం నివారించవచ్చు. చిన్నచిన్న జాగ్రత్తలు పెద్ద ప్రమాదాల ఉండి రక్షిస్తాయి. పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవడం,దోమతెరలువాడుకోవడం, ఇంట్లోగాని, పరిసరాల్లోగాని నీటిని నిల్వ ఉండకుండా చూసుకోవడం. ఎందు కంటే దోమలు నిల్వఉన్న నీటిలో గుడ్లుపెడతాయి. పూల కుండీ లను సెప్టిక్‌ ట్యాంకులను, ఓవర్‌హెట్‌ ట్యాంక్‌లను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూండాలి. వారానికి ఒకసారిడ్రైడేగా ఇంట్లో వస్తువ్ఞల న్నింటిని శుభ్రంగా ఉంచుకోవాలి.
– పి. మహమ్మద్‌ రఫి, డోన్‌ తాలుకా

నత్తనడకన మేడారం పనులు
వరంగల్‌ జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ఈ నెల 17 నుండి సమ్మక్క సారలమ్మ జాతర కోసం చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. రూ.102 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు జనవరి 31వ తేదీలోగా పూర్తి కావాలని ప్రభు త్వం గడువు విధించినా ఏ ఒక్క శాఖపనులు పూర్తికాలేదు. ఇప్పటి వరకు నిత్యం లక్షలాది మంది భక్తులు చీమలబారుల్లా మేడారానికి తరలివెళ్లి మొక్కులు సమర్పించుకుంటున్నారు. జెంపన్నఓడ్డున కల్యాణకట్ట పనులు కూడా మందకొడిగా సాగుతున్నాయి. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్న చందంగా కాంట్రాక్టర్లు నాణ్యతకు తిలోద కాలిచ్చి తూతూ మంత్రంగా పనులుచేస్తూ సొమ్మును మిగిలించు కునే ప్రయత్నం చేస్తున్నారు. మరుగుదొడ్ల పనులు, వ్యాపార సముదాయాలు, స్నానఘట్టాల పనులు నెమ్మదిగా నడుస్తున్నాయి. తాజాగా ఉపముఖ్యమంత్రి, మంత్రులు, మేడారానికి వచ్చి పనుల పనితీరును సమీక్షించి అధికారులకు సూచనలు చేసారు. ఇకనైనా అధికారులు,కాంట్రాక్టర్లు త్వరితగతిన పనులుపూర్తయ్యేలా ప్రభు త్వం చొరవ చూపాలి. సీనియర్‌ ఐ.ఎ.ఎస్‌ అధికారిని మేడారం జాత పూర్తయ్యేవరకు పర్యవేక్షణా అధికారిగా నియమించాలి. మేడారం జాతరకు వచ్చేభక్తులకు ఎటువంటి ఆటంకాలు కలుగకుం డా ,ఎవరికి ప్రాణనష్టం జరగకుండా కూడా అధికారులు జాగ్రత్త వహించాలి. విఐపిలగురించి సామాన్య ప్రజలను బలిచేయకూడ దు. ముఖ్యమంత్రి తరచుగా సమీక్షించి మేడారం జాతర విజయ వంతం చేయడానికి కృషి చేయాలి.
– కామిడి సతీష్‌రెడ్డి, పరకాల, వరంగల్‌జిల్లా