ఆలయాలపై పర్యవేక్షణ లోపం

ప్రజావాక్కు

                         ఆలయాలపై పర్యవేక్షణ లోపం

damaged temples
damaged temples

ఆలయాలపై పర్యవేక్షణ లోపం
తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల నిర్వహణ అస్తవ్యస్తంగా సాగుతోంది. ‘ధూపదీప నైవేద్యం పథకం అమలవ్ఞతున్నా దేవాదాయ ధర్మాదాయ శాఖ అజమాయిషీ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. చాలాఆలయాలకు కమిటీల్లేవ్ఞ. కార్యనిర్వహణాధి కారి పర్యవేక్షణ అసలే లేదు. అక్కడ ఇష్టమొచ్చినట్లుగా ధరలు రాజ్యమేలుతున్నాయి. కొన్ని మందిరాలు కొందరి ప్రైవేటు ఆస్తిగా చెలామణి అవ్ఞతున్నాయి. దేవాలయాల్లో పూజాదికారా లు క్రమపద్ధతిలో సాగడం లేదు. భక్తి ప్రపత్తులు పొంగిపొర్లే వాతావరణం లేదు. ప్రత్యేక కార్యక్రమాల సందర్భంగా భక్తిపా టలు, పాతసినిమా పాటలు,ఆధునిక సంగీతం కలగాపుల గంగా హోరెత్తించి కంపరత్తిస్తున్నారు.  ఇలా భక్తి భావనను మంటగలుపుతున్న తీరు జుగుప్సకలిగిస్తోంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయాల నిర్వహణను పర్యవేక్షించి మార్గదర్శకాలు జారీ చేయాలి.

-జి.అశోక్‌,గోదూర్‌,జగిత్యాలజిల్లా

కల్తీ రాజ్యం
ఉభయ తెలుగు రాష్ట్రాలలో విశృంఖలంగా సాగుతున్న కల్తీ రాజ్యాన్ని అరికట్టేందుకు తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేయడం శుభపరిణామం. కాగ్‌ నివేదిక ప్రకారం 2006నాటి ఆహారభద్రత ప్రమాణాల చట్టా నికి రెండు తెలుగురాష్ట్రాలలో దారుణంగా తూట్లు పొడుస్తు న్నారన్న విషయం క్షేత్రస్థాయిలో కల్తీనివారణా చర్యలు ఎలా విఫలమయ్యాయో అర్థమవ్ఞతోంది. కల్తీ నివారణలో అధికారు లకు చిత్తశుద్ధి కొరవడడం,వ్యాపారులు, అధికారుల అలసత్వా న్ని ఆసరాగా తీసుకొని లాభాపేక్షతో విశృంఖలంగా కల్తీకి పాల్పడడం బాధాకరం. ప్రభుత్వాలు చేపడుతున్న కల్తీ నివారణ చర్యలు ఏమాత్రం సత్ఫలితాలను ఇవ్వడం లేదు. అన్నీ కల్తీమయం. సాక్షాత్తు ప్రభుత్వ ఆస్పత్రులలో కల్తీ ఆహారం, కల్తీ మందులు రాజ్యమేలుతున్నా పట్టించుకునే నాధుడే లేడు.
-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

తెలుగు రాష్ట్రాలకు మొండిచెయ్యి
మనదేశ పాలకులు దేశానికి పాలకులా లేక వారి ప్రాంతా లకే పాలకులా అర్థంకావడం లేదు. రైల్వే బడ్జెట్‌లో ప్రతి సారీ వారి రాష్ట్రాలనే అభివృద్ధి చేసుకుంటూ, వేరే రాష్ట్రా లపై వివక్ష చూపించడం మామూలైంది. ఈసారీ అదే జరి గింది. కొత్త రైల్వేలైన్లు వేయడం కానీ, కొత్త రైళ్లను ప్రవే శపెట్టడంలో కానీ,రైల్వేలైన్ల డబ్లీకరణ, త్రిబులీకరణ విద్యు ద్ధీకరణలలో తెలుగు రాష్ట్రాలకు అన్యాయమే జరిగింది.
-ఎస్‌.శ్రీనివాస్‌, హైదరాబాద్‌

చట్టసభల్లో నేరస్తులు
దేశంలో చట్టసభలలో పదిహేను వందల మంది దాకా నేరా రోపితులు ఉన్నారని జాతీయ నేర గణాంకాల బ్యూరో వార్షిక నివేదిక తెలియ చేస్తోంది. ఇందులో సైబర్‌, ఆర్థిక నేరాలు, హత్యలు,మానభంగాలు, కిడ్నాప్‌లు, మహిళల అక్రమ రవాణా వంటి దారుణమైన నేరాలు ఎన్నో ఉన్నాయి. అన్ని కోర్టులలో కలిపి ప్రజాప్రతినిధులపై పదిహేనువేల వాజ్యాలు నడుస్తున్నా యి. ఈ నేర విచారణ వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నెండు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభించింది.
-ఎం.కనకదుర్గ,తెనాలి, గుంటూరుజిల్లా

తగ్గని పుస్తకాల బరువ్ఞ
ప్రతి పాఠశాలలోనూ విద్యార్థులు వారి సామర్థ్యానికి మించి ఎక్కువ బరువ్ఞన పుస్తకాల సంచీ మోస్తున్నారు. దీంతో వారి ఆరోగ్యం దారుణంగా దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో తెలం గాణా ప్రభుత్వం కె.జి నుండి 10వ తరగతి వరకు తరగతి వారీగా ఉండాల్సిన పుస్తకాల బరువ్ఞను నిర్దేశించింది. అది అతి క్రమించిన పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. అమలులో వైఫ్యలం కనిపిస్తుంది. చాలా పాఠశాలల్లో పుస్తకాల బరువ్ఞ తగ్గలేదు. దీనిపై ఉపాధ్యాయు లకు, పాఠశాలల యాజమాన్యానికి ట్రైనింగ్‌ అవసరం.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

ఆనాటి సంగీతం ఏమైంది?
సంగీతం భారతదేశంలో అతిప్రాచీనమైంది.నిజానికి సంగీ తం వేదాలలోనుండి ఉద్భవించింది.సాహిత్యంతో జతకట్టి దుఃఖంలో సుఖంలో మన వెంట ఉండేది. కాని సంగీతం నేడు ధ్వని కాలుష్యంతో విలవిలలాడుతోంది. ఆనాడు సా హిత్యానికి అనుగుణంగా సంగీతం అంటూ వినడానికి విన సొంపుగా ఉండేది.నేడు సంగీత సాహిత్యాలు వికలాంగుల య్యాయి. దీనికి కారణం మన సినిమా మ్యూజిక్‌ డైరెక్టర్లే.
-విజ్జురాజ్‌, హైదరాబాద్‌

ఇదీ నేటి తరం
నాయకుల తీరు అధికారం పదవ్ఞలు వద్దనుకున్న నిస్వార్థపరులు నాటితరం నాయకులు. ఎప్పటికీ తామె అధికారంలో ఉండాలని పదవ్ఞలు అనుభవించాలని అధికార పదవ్ఞలు వేరే వారికి దక్కకూడదని అనుకుంటున్న స్వార్థపరులు నేటి తరం నాయకులు. నాటి తరం నాయకులు ఆశయంతో పనిచేస్తే నేటి తరం నాయకులు ఆశపోతులై పనిచేస్తున్నారు.
-ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌