ఆర్టీసీ బస్సుల్లో అపరిశుభ్రత

        ప్రజావాక్కు

                                    ఆర్టీసీ బస్సుల్లో అపరిశుభ్రత

tsrtc busses
tsrtc busses

ఆర్టీసీ బస్సుల్లో అపరిశుభ్రత
తెలంగాణ ఆర్టీసీబస్సుల్లో పరిశుభ్రత కరవ్ఞ అవ్ఞతోంది. అంతేగాక సీట్లు సక్రమంగా ఉండటం లేదు. గ్రామీణ ప్రాంతా ల్లో తిరిగే ఎర్రబస్సులలో ఈ పరిస్థితి మరీఎక్కువ.డిపో నుండి బయలుదేరే సమయంలోనే బస్సు అద్దాలను, కిటికీలను, సీట్ల ను శుభ్రం చేయాలనే స్పృహ కరవవ్ఞతోంది. ఆర్టీసీ అధికారులు ఈ పనులు చేయించడానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమిం చుకోవాలి. ఆర్టీసీ బస్సు ప్రయాణమంటేనే ప్రయాణికులకు వెగ టు కలుగుతోంది.బస్సు ఛార్జీల పెంపుదలలో చూపిస్తున్న శ్రద్ధ, ఆత్రుత సౌకర్యాల కల్పనలో కనిపించడం లేదు. సీట్లు ఎంత అపరిశుభ్రంగా ఉన్నా, ఎన్ని అసౌకర్యాలున్నా గత్యంతరం లేని ప్రయాణికులు వీటిపైనే ఆధారపడుతున్నారు. ఇకనైనా ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ప్రయాణీకుల ఇబ్బందులను గమనించి తగిన చర్యలు తీసుకోవాలి.
 జి.అశోక్‌, గోదూర్‌, జగిత్యాలజిల్లా

ప్రజలలో అవగాహన కల్పించాలి
వైద్య,ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు సంభవిస్తు న్నా దేశంలో హెచ్‌.ఐ.వి రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంద న్న ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేదిక ఆందోళన కలిగిస్తోంది. ము ఖ్యంగా రెండు తెలుగురాష్ట్రాలు ఎయిడ్స్‌రోగుల సంఖ్యలో ప్రథ మస్థానంలో ఉండటం క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల వైఫల్యా న్ని సూచిస్తోంది. ప్రజలలో అవగాహన లేమి, అరకొర నిదుల కేటాయింపు,సిబ్బంది, మౌలికసదుపాయాల లేమితో కొనవూపిరి తో పనిచేస్తున్న ఎ.ఆర్‌.టి సెంటర్లు, గ్రామీణ ప్రాంతాలలో విజృంభిస్తున్న వ్యభిచారం, పౌష్టికాహారలేమి, వివాహేతర సంబంధాలు, కల్తీ ఆహారం వంటివి ఎయిడ్స్‌ వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి. జాతీయ రహదారులను ఆనుకున్న ప్రాంతాలలో, మురికివాడలలో అధికంగా కేసులు నమోదవ్ఞతున్న కారణంగా ప్రభుత్వం అసురక్షిత లైంగిక సంబంధాలను నిరోధించే దిశగా చర్యలు చేపట్టాలి. ప్రజలలో అవగాహన పెంచి వారిని చైతన్యపరిచే కార్యక్రమాలను విరివిగా చేపట్టాలి.
సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

పనిగంటలు తగ్గింపు
అన్ని దేశాలలోను 8గంటలు పనివిధానం అమలులో ఉంది. దానితో కొంత మార్పు ఆశించడం ఇబ్బందికరమైనా అనుసర ణీయమే.అతిపెద్ద దేశమైన మనదేశం శ్రేయస్సుదృష్ట్యా కూడా ఇది ఎంతో అవసరం. పనిగంటలు 8 నుండి 6కు తగ్గించడం వలన ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఒక మేధావి చేసిన సూచనలపైప్రభుత్వం ఆలోచన చేయడం అవసరమే. పనిగంట లు తగ్గిననాడు ఉద్యోగి శారీరకంగాను,మానసికంగాను మరి కొంత విశ్రాంతి లభిస్తుంది. దీనితో అతడు అధిక సమయాన్ని తన కుటుంబంతో గడిపే వీలు కలుగుతుంది. విప్ల వాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అంతేకాకుండా పనిగంటలు కుదించిననాడు ఆ తగ్గిన కాలానికి ఉద్యోగులు తమ పనిని సరైన సమయానికి చేయడానికి ఉత్సాహం చూపుతారు.
 బి.ఎన్‌.సత్యనారాయణ, హైదరాబాద్‌

రిజర్వేషన్ల రాజకీయాలు
న్యాయస్థానాలు అంగీకరించవని రాజ్యాంగం అనుమతించదని తెలిసినా, రాజకీయ లబ్ధికోసం ప్రభుత్వాలు రిజర్వేషన్లను ఇష్టం వచ్చిన రీతిలో పెంచుతున్నాయి. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదని సుప్రీంకోర్టు చెప్పినా వివిధ రాష్ట్రాలు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్లు వాగ్దానాలు ఇవ్వడం వాటిని అమలు చేసేయడం అంతా రాజకీయ డ్రామానే. కోర్టులు కొట్టేస్తాయని తెలిసినా రిజర్వేషన్లను పెంచడంలో అర్థం అదే. ఇటీవల ఐదు శాతంరిజర్వేషన్లు పెంచడం ఒక రాజకీయ ప్ర హసనం. కోర్టులు అడ్డుపడుతున్నాయంటూ నిందమోపి పబ్బం గడుపుకోవడం ఆయా ప్రభుత్వాల రాజకీయం.
వ్ఞలాపు బాలకేశవ్ఞలు, గిద్దలూరు, ప్రకాశంజిల్లా

అనుకున్నదొకటి…
కేంద్రంలో పనిచేస్తున్న బి.జె.పి ప్రభుత్వానికి సమస్యలను పరి ష్కరించాలనే చిత్తశుద్ధి పట్టుదల ఉండి ఉంటే కాశ్మీర్‌లో శాంతి యుత వాతావరణం నెలకొని ఉండేది.అక్కడి పౌరులు, సైనికులు గుండెల మీద చేతులు పెట్టుకొని కంటినిండా నిద్రపోయి ఉండేవా రు. ఎప్పటిక నుంచో ఆకాశం దాటి పాతుకుపోయి కూర్చున్న ధరలు కిందికి దిగివచ్చి ఉండేవి. యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగి నిరుద్యోగం తగ్గిపోయి ఉండేది. గతంలోలా కాకుండా మహిళలపై, యువతులపై బాలికలపై ఆత్యాచారాలు తగ్గిపోయి ఉండేవి. వారు స్వేచ్ఛగా తిరగగలిగే వారు. ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల ప్రజలకు సుఖశాంతులు లేకుండాపోతున్నాయి.
  ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌

వ్యర్థంగా మారిన విలువైన యంత్రాలు
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో పట్టణం నుండి చెత్త ను సేకరించి, సేంద్రీయ ఎరువ్ఞను తయారు చేసేందుకు రెండు సంవత్సరాల పూర్వం మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన డంపింగ్‌ యార్డు నిరుపయోగంగా ఉంది. దాదాపుగా పదిలక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈప్లాంట్‌లో50టన్నుల వ్యర్థాలను ప్రక్షాళన చేసే సామర్థ్యం గల యంత్రాలను ఏర్పాటు చేసారు. తడి,పొడి చెత్తలను వేర్వురుగా సేకరించేందుకు పట్టణంలో ఏర్పాట్లు చేయడంతోపాటు పెద్దఎత్తున ప్రచారం కూడా నిర్వహించారు. అయితే మొదటి రోజు నుండి ఈ వ్యవస్థ పనిచే యకపోవడం వలనలక్షలాది రూపాయలు విలువచేసే పల్వరైజింగ్‌ యంత్రాలు నిరుపయోగంగా మారాయి.ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి.
సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

సెలవ్ఞల్లో హోంవర్కు ఇవ్వకూడదు
ప్రతిరోజు నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే దాకా చదువ్ఞ, హోంవర్కు, ప్రాజెక్టులు,ప్రత్యేక అధ్యయనాలు అంటూ చిన్నారుల ను స్కూళ్లు చదువ్ఞ పేరిట అనేక రకాలుగా ఒత్తిళ్లకు గురి చేస్తు న్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అన్నా, దసరా, సంక్రాంతి సెల వ్ఞలు అన్నా పిల్లలకు ఎంతో ఆటవిడుపుగా ఉంటుంది. తమకు నచ్చిన రీతిలో ఆడుతూ, పాడుతూ సెలవ్ఞలను గడపనిస్తే తర్వాత రెట్టింపు ఉత్సాహంతో వారు స్కూళ్లకు వెళతారు.
ఎం.కనకదుర్గ,తెనాలి, గుంటూరుజిల్లా