ఆన్‌లైన్‌ పరీక్షా విధానంతో నష్టాలు

ప్రజావాక్కు

               ఆన్‌లైన్‌ పరీక్షా విధానంతో నష్టాలు

online exam
online exam

ఆన్‌లైన్‌ పరీక్షా విధానంతో నష్టాలు
లక్షలాది విద్యార్థుల మనోభిష్టానికి విరుద్ధంగా టెట్‌ పరీక్షను మొదటిసారిగా ఆన్‌లైన్‌లో జరిపిన ప్రభుత్వం అభాసు పాలైం ది. ఇంటర్నెట్‌ సరిగ్గా పనిచేయకపోవడం, సర్వర్లు ఆగిపోవ డం, కంప్యూటర్లు హ్యాక్‌ అయిపోవడం, ప్రశ్నలు పునరావృ తం అవడం, జవాబులు సరిగ్గా నమోదుకాకపోవడం వంటి సమస్యల కారణంగా విద్యార్థులు నానా ఇబ్బందులు పడ్డారు. అంతేకాక ఒక జిల్లాకు చెందిన అభ్యర్థులు వివిధ రోజుల్లో పరీ క్షలు రాయడం వలన మొదటి రోజులోనే ఎలాంటి ప్రశ్నలు వస్తాయన్న విషయంలో అవగాహన ఏర్పడింది. మిగతా రోజులలో ఆ ప్రశ్నలు తిరిగి రావడం వలన అభ్యర్థుల పని సులువ్ఞ అయింది. ఇందువలన ఆన్‌లైన్‌ పరీక్ష వలన తీవ్రంగా నష్టపోయామని లక్షలాది అభ్యర్థులు నిరుత్సాహానికి గుర య్యారు. ఇది చాలదన్నట్లు ప్రభుత్వం రెండో టెట్‌ పరీక్ష కూడా ఆన్‌లైనలోనే జరపాలని నిర్ణయించడం అహేతుకం.
-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

విద్యుత్‌రంగం అస్తవ్యస్తం
దేశంలో విద్యుత్‌రంగం అస్తవ్యస్తంగా ఉందని, సంప్రదాయక విద్యుదుత్పాదన, పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా తయారైన విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఆర్థికంగా సంక్షోభంలో చిక్కుకుంటున్నాయన్న కేంద్ర విద్యుత్‌ పంపిణీ నియంత్రణ సంస్థ నివేదిక ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మొత్తం ఉత్పా దనసామర్థ్యం 3.30 లక్షల మెగావాట్లు కాగా ప్రైవేట్‌ సంస్థల వాటా 60శాతంగా ఉంది.40వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న 35 ప్రైవేట్‌ ధర్మల్‌ కేంద్రాలకు మొండిబకాయిలు పెరిగిన కార ణంగా నిరర్థక ఆస్తులుగా మారిపోతున్నాయి. 25వేల మెగా వాట్ల సామర్థ్యం ఉన్న సహజవాయు విద్యుత్‌ కేంద్రాలు గ్యాస్‌ కొరత కారణంగా మూతపడిపోయాయి.వీటిని ఆదుకునేందుకు రుణాలు ఇవ్వడమో లేక ప్రభుత్వాలు వాటిని స్వాధీనం చేసుకొని ఉత్పాదన సాగించడమో జరగాలి.
-సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

శాసనమండలి కమిటీ సిఫార్సు
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంచుతామం టూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంది. నాల్డెజ్‌ హబ్‌గా మారు స్తామంటూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారన్న ప్రభుత్వం ఆద ర్శపాఠశాల విషయంలో తమ చిత్తశుద్ధిని నిరూపించలేకపో యింది. కేవలం 164 ఆంధ్రప్రదేశ్‌ మోడల్‌ స్కూల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో తీసుకొని పాలనాపరమైన నిర్ణయాన్ని ప్రకటించడానికి మూడు సంవత్సరాలుగా నాన్చుతుంది.
-బి. సురేష్‌, శ్రీకాకుళం

మొక్కలు నాటడమే కాదు వాటిని పెంచాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటడాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుండడం మంచిదే కానీ నాటుతున్న మొక్కలు భవిష్యత్తులో ఉపయోగపడేవైతే బాగుంటుంది. రోడ్ల పక్కన పూల మొక్కలను, నీడనిచ్చే మొక్కలను నాటడం శ్రేయస్కరం. అటవీ ప్రాంతాల్లో పల్లెల్లో మైదానాల్లో పెద్దఎత్తున నాటే మొక్కల్లో చాలా వరకు భవిష్యత్తులో వంట చెరకుగా మినహా ఎందుకూ పనికిరావ్ఞ. చింత, మామిడి లాంటి మొక్కలను పంపిణీ చేసి తద్వారా ఫలసాయం పొందే వీలును పేదలకు కల్పించవచ్చు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మొక్కలు నాటాలి. మొక్కలు నాటి ఫొటోలకు ఫొజులిచ్చి చేతులు దులుపుకుంటే చాలదు. వాటిని పెంచడంలోనూ శ్రద్ధ చూపితే హరితహారం విజయవంతమవ్ఞతుంది.
-జి.అశోక్‌,గోదూర్‌, జగిత్యాలజిల్లా

ఫ్రాన్స్‌తో మైత్రీబంధం
ఇటీవల భారత్‌లో నాలుగు రోజుల పాటు ఫ్రాన్స్‌అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌ పర్యటించినప్పుడు రక్షణ, విద్య, సముద్రయానం, అంతరిక్షం, అంతరంగిక భద్రత, ఇంధన రంగాలకు సంబంధించి రెండు దేశాల మధ్య ఇరవైవేల కోట్ల రూపాయల మేరకు వాణిజ్య ఒప్పందాలు కుదరడం ముదా వహం. 1998 నాటి నుండి భారత్‌-ఫ్రాన్స్‌ల మధ్య మైత్రీ బంధం బలపడుతూ వస్తుండగా నరేంద్రమోడీ అద్భుతమైన చతురత, పారదర్శకతతో కూడిన విదేశీ విధానం కారణంగా ఇటీవల ఈ మైత్రీ బంధం మరింత పటిష్టంగా అయింది. సౌర శక్తి ఉత్పాదన, యుద్ధవిమానాల తయారీ, అంతరిక్షయానంలో సాంకేతిక పరిజ్ఞానం బదలాయించడానికి ఆ దేశం సుముఖత చూపడం శుభపరిణామం.
-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

రైతే రారాజు కావాలి
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టు కుని రైతన్నపై ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నాయి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల దృష్టితో చూడకుండా రైతు సంక్షేమమే పరమావదిగా తలిస్తే క్షేత్రస్థాయిలో వారుపడుతున్న ఇబ్బం దులను పరిగణనలోనికి తీసుకుంటే రైతు, రారాజే కాగలడు. ప్రపంచంలో అత్యధిక శాతం జనాభా సేద్యంపై ఆధారపడ్డారు. ప్రభుత్వం ప్రకృతి చిన్నచూపు కారణంగా రైతులు అణగారిపో తున్నారు.పచ్చనిపంటపొలాలు పారిశ్రామిక కారిడార్లు, సెజ్‌లు, అపార్టుమెంట్లు,రహదారులుగా రూపాంతరం చెందుతుంది. ప్రభుత్వాలు తాత్కాలికసహాయం కంటే శాశ్వతమైన ప్రణాళికల తో రైతన్నలను ఆదుకున్న నాడే రైతే రారాజు అవ్ఞతాడు.
-వ్ఞలాపు బాలకేశవ్ఞలు, గిద్దలూరు, ప్రకాశంజిల్లా