ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్షలు

ప్రజావాక్కు

                         ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్షలు

online exams
online exams

ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్షలు
రెండు తెలుగు రాష్ట్రాలులో నిర్వహించబోవ్ఞ అన్ని ప్రవేశ పరీ క్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నామని ప్రకటించాయి. మారు తున్న కాలంతోపాటు పరీక్షల నిర్వహణలోనూ మార్పులను స్వాగతించాల్సిందే. హైటెక్‌ కాపీని కూడా అరికట్టడానికి ఇది ఉపయోగపడవచ్చు. ఎమ్‌సెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌,ఐసెట్‌ తది తర సెట్‌లతో పాటు జాతీయస్థాయి ప్రవేశపరీక్షలనూ ఆన్‌లైన్‌ లోనే నిర్వహిస్తామని ఆయా ప్రభుత్వాలు ప్రకటించాయి. అదే సమయంలో ఆన్‌లైన్‌ పరీక్షలపై అభ్యర్థులకు అవగాహన కలిగించాల్సిన బాధ్యత ఉన్నత విద్యాశాఖదే. చాలా మంది అభ్యర్థులకు ఇలాంటి పరీక్షల గురించిసరైన అవగాహన లేదు. అలాంటి అభ్యర్థులు నేరుగా పరీక్షలు రాసి సమయాన్ని వృధా చేసుకునే ప్రమాదం ఉంది. కనుక ఆయా ప్రవేశపరీక్షలకు అప్లయి చేసుకునే అభ్యర్థులందరికీ ఆన్‌లైన్‌ మాక్‌టెస్టులు నిర్వహించి, వారి సందేహాలు తీర్చాలి.
-జి.అశోక్‌, గోదూర్‌, జగిత్యాలజిల్లా

బలవన్మరణాలను నిరోధించాలి
పలు ఇంటర్మీడియేట్‌ కళాశాలల్లో ఇంటర్మీడియేట్‌ విద్యార్థుల ఆత్మహత్యలు శోచనీయం. విద్యార్థుల సామర్థ్యం ఎంత ఉంటే అంత చదవగలరు. మరింతగా చదవాలంటే పొగడ్తలు, ప్రోత్సాహాలతో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి కాని మితిమీరిన దండనలు, దూషణలు సరికాదు. ఈ విష యం విద్యార్థుల తల్లిదండ్రులు, గురువ్ఞలు తెలుసుకోవాలి. పిల్లలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారి అభిరుచిని గౌర వించాలి. కాని మితిమీరిన ఆశలు పెంచుకొని విద్యార్థులను బలి చేయవద్దు. ప్రభుత్వం జోక్యం చేసుకొని కళాశాలల్లో ఒత్తి డిని నివారించాలి. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ నివ్వాలి.
-కె .విమలాదేవి, హైదరాబాద్‌

వృద్ధులను ఆదుకోండి
వృద్ధులకు గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా ఫించను పథకం అమలు లో దారుణంగా విఫలమవ్ఞతోంది.అన్ని అర్హతలు ఉన్నప్ప టికీ ఫించన్లు మంజూరు కావడం లేదు. కొంత మందికి ఆధార్‌కార్డు, ఓటరు కార్డు లలో తక్కువ వయస్సు నమోదు అయ్యిందన్న కారణం చేత ఫించను చెల్లింపులు నిలిపివేసారు. ఇటువంటి సందర్భాలలో సరైన ధృవీకరణ పత్రాలు చూపిస్తే రికార్డులు సరిచేసి ఫించనులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు.
-సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

విద్యుత్‌ కోతలు వద్దు
పదవ తరగతి ఇంటర్మీడియేట్‌ పరీక్షలు సమీపిస్తున్నాయి. విద్యార్థులు ప్రతీక్షణం సద్వినియోగం చేసుకుంటూ బహు శ్రద్ధగా పాఠ్యాంశాలను పునర్విమర్శ చేసుకొనే సమయం ఇది. సమయం తక్కువగా పునర్విమర్శ చేసుకునే అంశాలు ఎక్కు వగా ఉంటాయి. కాబట్టి రాష్ట్రంలో పట్టణాలు, గ్రామాలు అంత టా వారి పరీక్షలు ముగిసే దాకా విద్యుత్‌ కోతలు విధించవద్దని అధికారులకు మనవి. అలా ఎడాపెడా కోతలు ఉండటం వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి అంతటా 24 గంటలు విద్యుదుత్పత్తి జరగాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

ఎన్నికల సంఘం జోక్యం అవసరం
తెలుగు రాష్ట్రాల్లో నానాటికీ పెరుగుతున్న రాజకీయ వలసలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయి. అధికార పార్టీ చూపే పదవ్ఞల తాయిలాలకు ఆశపడి స్వంత నియోజకవర్గాల ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా పార్టీలు ఫిరా యించే అవకాశవాదుల వలన ప్రజాస్వామ్యం నిర్వీర్యం అవ్ఞ తోంది. రోజుకో సిద్ధాంతం, నెలకోపార్టీ అన్న రీతిలో రాజకీయ నాయకులవలన ప్రజలువంచనకు గురవ్ఞతున్నారు.ఫిరాయింపు లకు పాల్పడితే సభ్యత్వం రద్దవడం,వచ్చే అయిదేళ్లవరకు ఎన్ని కలలో పాల్గొనకుండా నిషేధించడం వంటి చర్యలు చేపట్టాలి.
-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

పన్ను ఎగవేతదారులను శిక్షించాలి
దేశంలో కొందరు నల్ల వ్యాపారులు అమ్మకం పన్ను అధికారుల కు తప్పుడు లెక్కలు చూపించి లంచాలను ఇవ్వజూపి ఏడాదికి నలభైవేలకోట్ల వరకు పన్నులు ఎగ్గొడుతున్నారని స్వయంగా ఆర్థిక మంత్రిత్వశాఖ అంగీకరించింది. జియస్‌టి అమలు తర్వా త బిల్లు ఇచ్చే విధానాన్ని స్పష్టంగా వస్తుసేవల చట్టం తెలియ చేస్తున్నా వాటిని అమలులో చాలా కంపెనీలు తిలోదకాలిస్తు న్నాయి. రశీదు ఇవ్వాలని చట్టం చెబుతుండగా చాలా సందర్భా లలో షాపు యజమానులు రశీదు ఇవ్వడం లేదు.
-ఎం.కనకదుర్గ,తెనాలి, గుంటూరుజిల్లా

పెరుగుతున్న డ్రగ్స్‌ విక్రయాలు
పలుప్రాంతాల్లో మాదక ద్రవ్యాల విక్రయాలు పెరిగిపోతున్నా యి. డ్రగ్స్‌ బారిన పడి అనేక మంది యువకులు ఆరోగ్యం కోల్పో తున్నారు. ఒళ్లు తెలియని స్థితిలో అనేక నేరాలకు పాల్పడు తున్నారు.ధూమపానం,మద్యపానం, కొకైన్‌, హెరాయిన్‌ వంటి పదార్థాల వాడకంతో ఎంతో నష్టం జరుగుతుంది.
-వి.రామకృష్ణ, హైదరాబాద్‌