ప్రజావాక్కు

ఎడిట్‌ పేజీకి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిణామాలకు సంబంధించిన విశ్లేషణాత్మక వ్యాసాలు పంపగోరేవారు ఈ కింది  మెయిల్‌ www.vaarha.com చిరునామాకు పంపగలరు.

prajavakku

 

ప్రజావాక్కు

తెలుగు పేర్లు తెలుసుకోండి: వులాపు బాలకేశవులు, గిద్దలూరు, ప్రకాశంజిల్లా

గుడిలో పూజలు చేయించే కొంత మందికి వాళ్ల గోత్రనామా లు, జన్మనక్షత్రం ఏమిటో తెలియవ్ఞ. దీనికి కారణం వాళ్లు ఇంగ్లీషు మీడియంలో చదవడం,వాళ్ల తల్లిదండ్రులు వాటి గురిం చి పిల్లలకు చెప్పకపోవడం. ప్రస్తుతం మాసం అంటే ఇంగ్లీషు నెలపేరు చెప్తారు గాని తెలుగులో ఆ నెల పేరు వారికి తెలీదు. రుతువులు,నక్షత్రాలు వీటిపేర్లుకూడా చాలా మందికి తెలియదు. ఈ తెలుగుపేర్లు అందరికి తెలియపరచడానికి ఆరవ తరగతి నుంచి ఒక క్రమంలో తెలుగు మాసాలు,రుతువులు, సంవత్స రాలు నక్షత్రాలు, వీటి పేర్లను తెలుగు క్లాసులో కానీ, సంస్కృ తం క్లాసులో గానీ నేర్పడం మంచిది.అసలు ఉపాధ్యాయులకైనా ఇవివస్తాయా అని అనుమానం.తెలుసుకోవడం అవసరంకూడా.

నియోజక వర్గాల అభివృద్ధి: జి.అశోక్‌, గోదూరు,జగిత్యాలజిల్లా

ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవడానికి ఎంపీలకు కేటాయిస్తున్న కోట్ల రూపా యల నిధులు వాస్తవానికి పక్కదారి పడుతున్నట్లు అనేక ఆరో పణలున్నాయి. ఎంపీలకు సంవత్సరానికి ఐదుకోట్లు కేటాయి స్తున్నారు. వాటి నుండి ఎన్ని నిధులు దేని కోసం ఖర్చు చేశారో ఎవరికీ తెలియదు. ప్రజాప్రతినిధులు కూడా ప్రజలకు ఆ నిధుల గురిం చి, ఖర్చుల గురించి వివరించడం లేదు. ప్రజల నుంచి పన్నుల ద్వారా వసూలైన నిధులు అనేకం అభివృద్ధి పనులకు ఉపయోగపడక పోగా అవినీతి పరులైన రాజకీయ నాయకులు జేబుల్లోకి చేరుతుండటం దురదృష్టకరం.

ఆర్థిక నేరాలకు శిక్షలేదా?: ఎన్‌.శివసాయి, హైదరాబాద్‌

చట్టాల బలహీనతలు,పోలీసువ్యవస్థ లోపాయికారి ప్రవర్తన, కోర్టుల కాలయాపన,రాజకీయ నాయకుల జోక్యం వల్ల దేశంలో ఆర్థిక నేరస్తులు సులభంగా తప్పించుకోగలుతున్నారు. ఈ వ్యవ స్థల బలహీనతల వల్ల దేశంలో నేరస్తులు రెచ్చిపోతున్నారు. ఆర్థికనేరస్తులు ఏ భయం లేకుండా ప్రజాధనాన్నే కాక, ప్రభుత్వ ఆస్తులను విచ్చలవిడిగా దోచి,ఆనిధులను దేశాన్ని దాటిస్తు న్నా రు. ఇండియాలో ఉన్న ఆర్థిక నేరస్తులను కూడా మన ప్రభు త్వాలు ఏమి చేయలేకపోతున్నాయి.చాలామంది ఆర్థిక నేరస్తులు రాజకీయపార్టీల ముసుగులో తలదాచుకుంటున్నారు. పెద్ద మనుషుల్లా గొప్పవారిగా తిరుగుతున్నారు.

శబ్దకాలుష్యాన్ని అరికట్టాలి: టి. సురేష్‌, వరంగల్‌

జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాహనాలు ముఖ్యంగా లారీలు అవసరమున్నా లేకపోయినా సౌండ్‌ హారన్‌ ఉపయోగి స్తూ ప్రజానీకానికి ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. నిబంధనల ప్రకారం పట్టణాల్లోకి ప్రవేశించిన లారీలు సౌండ్‌హారన్‌ను చాలా తక్కువ స్థాయిలో ఉపయోగించాలి.కానీ లారీడ్రైవర్లు ఈ నిబం ధనను పాటిస్తున్న సూచనలే లేవ్ఞ. పరిమితికి మించిన సౌండ్‌ వల్ల ప్రజలకు వినికిడిసమస్య తలెత్తేప్రమాదం ఉంది.

ఓటు ఆయుధం: ఎం. రామచంద్ర, గుంటూరుజిల్లా

ప్రజాస్వామ్య దేశంలోనైనా ప్రజలేన్యాయనిర్ణేతలు. జనాభీష్టం ప్రతిఫలించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థకు సార్థకత ఉంటుందని చర్చిల్‌ మహాశయుడు సెలవిచ్చారు. ప్రజలు తమ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధం ఉపయోగించి సచ్చీలురులనే ఎన్నుకోవాల్సిన అవసరం తైనాఉంది. పాలనా వ్యవస్థ సక్రమంగా పనిచేయన ప్పుడు ఓటు ఆయుధంతో అసమర్థులను గద్దెదించి అనుభవజ్ఞులను సమర్థులను ఎన్నుకొని ఎన్నోసార్లు ఓటర్లు తమ విజ్ఞతను చాటుకొన్నారు. అందుకే ఓటు హక్కు ఉన్నవారు ప్రతీ ఎన్నికలలో విధిగాఓటువేయాలి.లేకుంటే రాజ్యాంగపరంగా చర్యలుతీసుకునే విధంగా ప్రత్యేకచట్టాలు తీసుకోవాలి.

దోమల నివారణ: పి. రాజశేఖర్‌, తూ.గోజిల్లా

చిన్న జాగ్రత్త పెద్దరక్షణ, దోమకాటు నుండి చిన్న చిన్న జాగ్ర త్తలు పాటిస్తే అనేక వ్యాధుల బారి నుండి రక్షించబడవచ్చు. ప్రస్తు తం అందరిని వణికిస్తున్న డెంగ్యూదోమ వల్ల వస్తుంది. ఈ వైరస్‌ నుండి అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేయాలి.ప్రజల్లో అవగాహన అవసరం.ఈ వైరస్‌ను నివారించాలంటే దోమల నివారణ ఒక్కటే మార్గం. ప్రపంచంలో దాదాపు 70 కోట్ల మంది దోమకాటుకు గురి అవుతున్నారు. ఈ దోమకాటు వల్ల అనేక వ్యాధులు సంక్రమించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దోమకాటు నుండి నివారణ మార్గం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలి. స్వచ్ఛ భారత్‌ వల్ల ఎక్కువ శాతం నివారించవచ్చు.

ఆయుర్వేద వైద్యశాలలు: సి. విన§్‌ు, పశ్చిమగోదావరి జిల్ల్లా

దేశీయ సంప్రదాయ వైద్య విధానాన్ని ప్రోత్సహించాలన్న సదు ద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఆయుర్వేద వైద్యశాలలను స్థాపించింది. ఈ వైద్యశాలలు ప్రభుత్వ ఆశయానికి విరుద్ధంగా పనిచేస్తున్నాయి.ఇవి పేరుకుమాత్రమే ఆయుర్వే ఆస్పత్రులు. రోగు లకు ఆయుర్వేద మందులు ఇవ్వాల్సి ఉండగా అల్లోపతి ఔషధాలు వాడుతున్నారు.ఆయుర్వేద పట్టాపొందిన కొందరు డాక్టర్లు ఇంగ్లీషు మందులను వాడటంలో అంతర్యమేమిటో అర్థంకాదు. ఆయుర్వేద మందులు రోగాలను నయంచేయలేవా?అదే నిజమైతే ప్రత్యేక ఆ యు ర్వేద వైద్యశాలలు ఎందుకు? ప్రభుత్వ ధనం వృధా కావడం తప్ప! పేద ప్రజలకు ఆయుర్వేద వైద్యవిధానాన్ని అందుబాటులోకి తెచ్చేమంచి లక్ష్యానికి గండి కొడుతున్న వారిని ఏమనాలి?

విద్యార్థులకు సహకరించాలి: సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్‌

పదవ తరగతి, ఇంటర్మీడియేట్‌ పరీక్షలు సమీపిస్తున్నాయి. విద్యార్థులు అతిశ్రద్ధగా చదివేరోజులివి.విద్యార్థుల కృషికి కరెంట్‌ కోతలు ప్రతిబంధకం కారాదు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థు లు మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. పదవ తరగతి పరీక్షలు ముగిసే వరకు విద్యుత్‌ కోతలు విధించకుండా చూడాల్సి న బాధ్యత అధికారులలో ఉంది. పట్టణాలకే కాక గ్రామాల్లోనూ నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలి.

=======