ప్రజావాక్కు

Voice of the people
Voice of the people

ప్రాథమిక వసతులపై దృష్టి సారించాలి: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

రెండు తెలుగురాష్ట్రాలలో గ్రామాలలోప్రాథమిక వసతుల కల్ప నపై ప్రభుత్వాలు దృష్టిసారించాలి. పారిశుద్ధ్యం రహదారులు, రక్షిత మంచినీరు,ప్రాథమిక వైద్యం, విద్యుత్‌, విద్యావసతులు 70శాతం గ్రామాలలో అధ్వాహ్నంగా ఉంటున్నాయి. ప్రభు త్వాలు ఏటా వేల కోట్ల గ్రామాల సంక్షేమం, అభివృద్ధి కోసం విడుదల చేస్తున్నామని ఘనంగా ప్రకటించుకుంటున్నా తగి నంత అభివృద్ధి కానరాకపోవడం దురదృష్టకరం. వాస్తవానికి ప్రతీపంచాయతీ తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నా ప్రభు త్వ నిధులు ఎక్కడికిపోతున్నాయో అర్థంకావడం లేదు. గ్రామ పంచాయతీలలో ఆదాయ,వ్యయాలకు పొంతన ఉండటం లేదు. అంతర్గత పన్నులవసూలు, ప్రభుత్వం నుండి గ్రాంట్లు మంజూరు, వసతుల కల్పన కోసం సామాజిక బాధ్యత కింద కార్పొరేట్‌ సంస్థలను ఆశ్రయించడం వంటి చర్యలపై గ్రామపంచాయతీలు దృష్టి సారించాలి.

రోడ్డు ప్రమాదాలు అరికట్టండి: – తూలుగు రమణారావు, అక్కరాపల్లి
ప్రతినిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్లు ఇరుకుగా ఉండటం, రోడ్డు మలుపు తిరగే చోట, స్కూల్‌జోన్స్‌ వద్ద ప్రమాదాన్ని సూచించే హోర్డింగ్‌లను ఏర్పాటు చేయకపోవడం, మద్యం సేవించి మితిమీరిన వేగం తో వాహనాలు నడపడం దీనికి ప్రధాన కారణాలు. సరైన శిక్షణ లేకుండా వాహనాలు నడిపే వారిపై, మద్యం సేవించి డ్రైవింగ్‌ చేసే వారిపైన తగిన చర్యలు తీసుకోవాలి. క్రాస్ట్‌రోడ్స్‌ వద్ద గల చెట్లను తొలగించాలి. రోడ్లు వెడల్పు చేయాలి. సంబంధిత శాఖల వారందరూ అప్రమత్తమై తగిన చర్యలు తీసుకొని రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి.

ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలి:- కె.రమణాచారి, సికిందరాబాద్‌
ప్లాస్టిక్‌ నిషేధించి, ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం కృషి చేయ డం మంచి పరిణామమే.కానీ ప్రజలు ఇబ్బందులకు గురవ్ఞతు న్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జనపనార సంచులు,గుడ్డ సంచులుకాగితం సంచులు సప్లయి చేయాల్సిన బాధ్యత దుకాణాదారులదే. కానీ దుకాణాదారులు వినియోగ దారుల గోడువినే స్థితిలోలేరు. ప్రభుత్వం జనపనారా సంచుల తయారీని ప్రోత్సహించాలి. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగామార్కెట్లకు సప్ల§్‌ుఅయ్యేటట్లు చర్యలు తీసుకోవాలి..


కార్యకర్తల పరిస్థితి ఏమిటి?: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా
సామాన్యులను పార్టీల కోసం అహర్నిశలు శ్రమించి కార్యకర్తల కు పదవ్ఞలు లభించడం అనేది కలలో కూడా సాధ్యంకాదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం మీద 83 శాతం కోటీశ్వరులు, తీవ్రమైన నేరచరిత్ర కలిగినవారు, కోట్లల్లో ఆస్తు లు వ్ఞన్నా ఐటి రిటర్న్‌లు దాఖలు చేయని వారు, ఆదాయానికి సంబంధించిన వివరాలు సమర్పించని వారే ఉన్నారు. 45 శాతం సిట్టింగ్‌ అభ్యర్థుల ఆస్తులు నూరు నుండి ఆరువందల శాతంపెరిగాయి. హత్యలు,హత్యాయత్నం,కిడ్నాప్‌, మహిళలపై అత్యాచారాలు, లక్షల్లో ఆదాయపు పన్నులు ఎగొట్టిన వారికి అన్ని పార్టీలు ముందు వెనుక చూడకుండా టిక్కెట్లు ఇచ్చేసారు. రాజకీయ ప్రక్షాళనకు కట్టుబడి ఉన్నామని ప్రకటించే పార్టీలన్నీ ఈ విషయంలో ఒకే తానులోని ముక్కలని అర్థమవ్ఞతోంది.

ఐక్యమత్యం మహాబలం: -ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌

కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజాసమస్యలపై దృష్టిపెట్టాలి. గత ప్రభుత్వాలలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి.అవినీతి అక్రమాలకుతావ్ఞలేని స్వచ్ఛమైన పాలన అందించాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల న్నింటిని కచ్చితంగా అమలు చేసి తీరాలి. అధికార పీఠం అధిష్టించిన మరుసటి రోజు నుంచే అసమ్మతి అసంతృప్తిలతో కీచులాడు కోకూడదు. ఐకమత్యంతో పరస్పరం సహకరించుకుంటూ ప్రభుత్వాలను నడపాలి.అధికారంలోకి వచ్చేసాం కదా ఎలా ఉన్నా నడుస్తుందనుకోవడం పొరపాటు.

పల్లెల్లో వైద్యం కొరత: -ఎన్‌.రాంబాబు, శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లాలో డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ, కలరా వంటి ప్రమాద కరమైన వ్యాధులను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం తక్షణం హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించాలి. గత కొద్ది వారాలుగా జిల్లాలో పలు మండలాలలో ప్రాణాంతక విషజ్వరాలు ప్రబలుతున్నా యి. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 260 డెంగ్యూ కేసులు ఇక్కడ నమోదయ్యాయి. పల్లెల్లో పారిశుద్ధ్యం పడకవేయడం, వర్షాకాలంలో జిల్లా యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం ముఖ్య కారణాలు. ఈ జ్వరాలకు తగిన సదుపాయాలు,వైద్యసేవలు ప్రభుత్వ ఆస్పత్రులలో దొర కకపోవడంతో ప్రైవేట్‌ ఆస్పత్రులను ప్రజలు ఆశ్రయిస్తున్నారు. అన్ని వసతులతో కూడిన ప్రభుత్వ ఆస్పత్రులను ప్రజలకు అందుబాటులోకి తేవాలి.