ప్రజావాక్కు

Voice of the People
Voice of the People

రావణకాష్ఠంలా కాశ్మీర్‌ సమస్య: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ
భారత్‌లో కాశ్మీర్‌ సమస్య గత 70సంవత్సరాలుగా రావణ కా ష్టంగా నలుగుతూనే ఉంది. గత, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాలు ఈ సమస్య పరిష్కారానికి ఎంత చిత్తశుద్ధితో కృషి చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. పొరుగుదేశం కాశ్మీర్‌లో ఉగ్రమూకల ద్వారా, కాశ్మీర్‌ యువతలో వేర్పాటు వాదం రగి లించడం ద్వారా ఆందోళనలు, అశాంతి సజీవంగా ఉండేటట్లు చేస్తోంది. ఈ సమస్యపై భారత్‌లో రాజకీయ పార్టీలు కూడా విద్వేషపూర్తి ప్రకటనలు చేయడం ద్వారా మరింత గందర గోళం సృష్టిస్తున్నాయి. ఇటీవల పిడిపి అధ్యక్షురాలు ముఫ్తీ మోహబూబా కాశ్మీర్‌ వేర్పాటు వాదులను చర్చలకు పిలవాలని సూచించగా, ఫరూక్‌ అబ్దుల్లా ఉగ్రవాదం పేరిట కేంద్ర ప్రభు త్వం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని ప్రకటన చేశారు. పూల్వామా ఘటన అనంతరం వివిధ రాజకీయ పక్షా లు రాజకీయ లబ్ధికోసం అసత్యపు ప్రకటనలు చేయడం, కేంద్ర ప్రభుత్వం సైతం అమరవీరజవానుల ఫొటోలను ఎన్ని కల ప్రచారంలో ఉపయోగించుకోవడం దురదృష్టకరం.

కులమతాలతో పనేంటి?:-మిథునం, హైదరాబాద్‌
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల వారికి పేదల ఆకలి తిప్పలు గుర్తుకురావ్ఞ. కాని కులం, మతం వంటివి మాత్రం తప్పక గుర్తుకు వస్తుంటాయి. కొన్ని కులాలను కాకా పట్టడం మతాలకు గాలం విసరడం, ప్రజలను ఓటు బ్యాంకులుగా చూ డటం, కులమతాలను బ్రహ్మాస్త్రంలా ప్రయోగించి తమ రాజ కీయ ప్రత్యర్థులను దెబ్బతీయడం, వారు పదవ్ఞల్లోకి రాకుండా అడ్డుపడటం ప్రజాసేవ చేయడానికి అనర్హులని ప్రచారం చేయడం వంటివి పనులు చేస్తూ పబ్బం గడుపుతున్నారు రాజకీయ నాయకులు. ఇలా చేయడం సమంజసం కాదు.

పోస్టులను భర్తీ చేయాలి: -సయ్యద్‌ షఫీ, హన్మకొండ
తెలంగాణ రాష్ట్రంలోప్రభుత్వం డిస్టిక్‌ఇనిస్టిట్యూషన్స్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ కాలేజీలకు మంచి ప్రతిష్టాత్మ కమైన విద్యాసంస్థలుగా మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం డైట్‌ కాలేజీలో పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి.డైట్‌ కాలే జీలు ఇన్చార్జ్‌, రిటైర్డ్‌ వాటితో కాలం వెళ్లదీస్తున్నారు. ఇలా గే కొనసాగితే రాబోయేతరాలకు గురువ్ఞ లేక విద్యావ్యవస్థ కుంటుపడుతుంది. ప్రభుత్వం ఇకనైనామేల్కొని విద్యా ప్ర మాణాలు దిగజారకుండా ఖాళీలనువెంటనే భర్తీ చేయాలి.

గోదావరికి గర్భశోకం: -యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

నాసిక్‌లో నడక ప్రారంభించి నరసాపురం సముద్రగర్భంలో కలిసే గోదావరినది గత రెండుదశాబ్దాలుగా ఉనికి కోల్పోతుంది. నూటఅరవై ఏళ్ల క్రితం కాటన్‌ మహాశయుడు ధవళేశ్వరం వద్ద మూడడుగుల నీటిసామర్థ్యంతో ఆనకట్ట నిర్మించారు. మూడు దశాబ్దాల క్రితం సుమారు పధ్నాలగు అడుగుల నీటి నిల్వలు పెంచే విధంగా నిర్మించినా నది అంతర్భాగంగా సంరక్షణ చర్య లు చేపపట్టక సగభాగం ఇసుకమేటలు,లంకలు పేరుకుపోయా యి.అప్పట్లో ధవళేశ్వరం నుండి భద్రాచలం వరకు లాంచీలలో ప్రతిరోజూ ప్రయాణించేవారు. ప్రస్తుతం పోలవరం దాటితేనే గాని లాంచీలుతిరగనిపరిస్థితి.లంకభూముల్లో పసుపు, మిరప, పొగాకు, మొక్కజొన్న,అరటి వంటి పంటలు పండించగా మరి కొందరు నాటుసారా కేంద్రాలుగా రూపాంతరంచెంది గోదావరి మాత కడుపునచిచ్చుపెడుతున్నారు.

మహిళా బిల్లుకు మోక్షం ఎప్పుడు?: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

అధికారంలోకి రాగానే మహిళారిజర్వేషన్‌ బిల్లుఆమోదం ఖాయ మని బిజెపి2014లో ఘనంగా ప్రకటించింది.కాని అయిదేళ్లు అధికారంలో ఈ విషయంలో ఎలాంటి చొరవ చూపకపోవడం బాధాకరం.ఆధార్‌, జియస్‌టి, తలాఖ్‌ వంటి వివాదస్ప దమైన బిల్లులను ఆమోదింపచేసుకున్న ప్రభుత్వం చివరకు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలవారికి కూడా పది శాతం రిజర్వేషన్లు కల్పించింది.కాని అన్ని రాజకీయపక్షాలవలె మహిళా రిజర్వేషన్‌ బిల్లు విషయంలో ఒక్కఅడుగు కూడా ముందుకుపడలేదు. చివరకు ఇది మహిళాదినోత్సవం సందర్భంగా మాత్రమే రాజ కీయ పార్టీలకు గుర్తుకువచ్చే అంశంగామిగిలి పోయింది.

ఒక నమూనాతో ఎన్నిక రద్దు చేస్తారా?:- గరిమెళ్ల రామకృష్ణ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా

ఓట్ల లెక్కింపులో ఇవిఎం ఓట్లకు వీవీప్యాటక్‌ ఓట్లకు తేడా వస్తే వీవీప్యాట్‌ఓట్లనే పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివరణ ఇస్తున్నారు.అయితే ఇదే విషయంపై రక్తం నమూనా ఒకటి చాలన్న కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి ఇచ్చిన వివరణ ప్రకారం తేడా ఉన్నందు న నమూనా ప్రాతిపదికగా మొత్తం ఎన్నికను రద్దు చేస్తారా లేక మొత్తం వీవీప్యాట్‌లను లెక్కిస్తారా?స్పష్టత లేదు? ఎన్నికల సంఘం వారు ప్రకటనలు, వివరణలతో మరింత గందరగోళం సృష్టిస్తున్నట్లుగా భావించాల్సి వస్తుంది.