సేంద్రియ పద్ధతులే మేలు

organic food
organic food

ప్రజావాక్కు
సేంద్రియ పద్ధతులే మేలు
వ్యవసాయానికి నేల, నీరు,విత్తనాల తర్వాత ఎరువ్ఞలే ప్రధాన అవసరం. అయితే చీడపీడల నివారణకు సస్యరక్షణ మందులు కూడా అవసరం అవ్ఞతున్నాయి. ప్రకృతి సేంద్రీయ పద్ధతుల ను విడనాడి రసాయన పద్ధతులను అనుసరించడం వలన రైతులకు ఖర్చు తడిసి మోపెడవ్ఞతోంది.పైగా మందులు, రసా యన ఎరువ్ఞలు ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బయోఫెర్టిలైజర్లను ఉత్పత్తి చేసేందుకు భారీ ఎత్తున కంపెనీలను స్థాపించాల్సిన అవశ్యకత ఎంతో వ్ఞంది. వీటి వలన వ్యవసాయ భూములలో జీవ చైతన్యం తొణికి సలాడుతుంది.పోషకాల సమతుల్యత పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా జీవన ఎరువ్ఞల వాడకంలో భారతదేశం 71వస్థానం లో ఉంది. అంతర్జాతీయంగా కూడా వీటికి మంచి మార్కెట్‌ రాబోతోందన్న అంచనాలనేపథ్యంలో బయోఫెర్టిలైజర్‌ ప్లాంట్ల స్థాపనకు ప్రభుత్వం విశేషంగా కృషి చేయాలి.

  • సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

నూతన పెన్షన్‌ పథకం
2013లో నియామకం పొందిన ఆంధ్రప్రదేశ్‌ మోడల్‌ హై స్కూల్స్‌ రెగ్యులర్‌ బోధనా సిబ్బందికి సుమారుగా ఐదు సంవ త్సరాల తరువాత అధికారికంగా నూతన పెన్షన్‌ పథకంలో విధి విధానాల ప్రకారం పాత పెన్షన్‌ పరిధిలోకి తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఉద్యోగంలో చేరినవెంటనే ఈ ప్రక్రియ మొదలు కావాలి.కానీపలు సాంకేతి క కారణాల వలన ఆలస్యమైనది. అయితే ఈ ఐదు సంవత్స రాల కాలంలో మోడల్‌ స్కూల్స్‌లో పనిచేస్తున్న కొంత మంది సిబ్బంది చనిపోయారు. ఈ సిబ్బందికి సంబంధించి కుటుంబ సభ్యులకు ఎటువంటి సామాజిక భద్రత కానీ, ఆర్థిక భరోషా కానీ లభించలేదు.కనుక ప్రభుత్వ ఫ్యామిటీ పెన్షన్‌, గ్రాట్యూటీ కి సంబంధించి ఉత్తర్వులు విడుదల చేయాలి.

  • బి.సురేష్‌, శ్రీకాకుళం

పౌష్టికాహార లోపం
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో 53 శాతం మహిళలుపౌష్టికాహార లోపాలతోతీవ్ర అనారోగ్యాల బారినపడుతున్నారు. కేవలం 33 శాతం వారానికి ఒక్క సారి మాత్రమే పోషక ఆహారం తీసుకుంటున్నారు. 47 శాతం గర్భిణులు సరైన ఆహారం లేక ప్రసవ సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురవ్ఞతున్నారు.మహిళా సాధికారత పేరిట ప్రచారానికే ప్రభుత్వాలు పరిమితమైపోన్నాయి.

  • ఎన్‌.శశికళ, విజయవాడ

రాజకీయాలతో ముడిపెట్టొద్దు
ప్రపంచకప్‌ క్రికెట్‌లో ఇండియా, పాకిస్థాన్‌లు షెడ్యూల్‌ ప్రకా రం ఇంగ్లాండ్‌లో జూన్‌ నెలలో ఢీకొనబోతున్నాయి. అయితే పుల్వామా ఉగ్రవాదుల దాడిలో 43 మంది భారత జవాన్లు మరణించడంతో ఇండియా,పాకిస్థాన్‌ సంబంధాలుయుద్ధ వాతా వరణంనెలకొంది.ఈనేపథ్యంలో ఇండియా,పాకిస్థాన్‌తో వ్యాపా ర, వాణిజ్య సంబంధాలు తెంచుకుంది. పాకిస్థాన్‌తో జరిగే క్రికెట్‌మ్యాచ్‌ను కూడా రద్దు చేసుకోవాలనే డిమాండ్లు ఊపందు కుంటున్నాయి.ఇండియా, పాకిస్థాన్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ అంటే క్రికెట్‌ ప్రపంచమంతా విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తుంది. క్రికెట్‌లోఇంతకుమించి ఉత్కంఠ రేకెత్తించేమ్యాచ్‌ మరొకటి ఉం డదు. ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్‌ను రాజకీయాలతో ముడి పెట్టకూడదు. ఆటలను కొనసాగిస్తూనే, మరోపక్క ఉగ్రదాడుల ను, పాకిస్థాన్‌కపట పన్నాగాలను రాజకీయంగా ఎదుర్కోవాలి.

  • జి. అశోక్‌,గోదూర్‌, జగిత్యాలజిల్ల్ల్లా

వడదెబ్బ నుండి కాపాడండి
రాబోయే ఎండ తీవ్రను దృష్టిలో పెట్టుకొని ప్రజలు వడదెబ్బ భారీన పడకుండా సంబంధిత వివిధ శాఖలు, స్వచ్ఛంద సంస్థ లు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలి. రహదా రులపై బస్‌స్టాండ్‌ల వద్ద, మండల కార్యాలయాల వద్ద, హాస్పిటల్స్‌ వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఆరోగ్య శాఖ వడదెబ్బకు ప్రజలు గురికాకుండా ఉండేందుకు అవగాహన కల్పించే దిశగా పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ చేయాలి. ఓరల్‌ రీ హైడ్రేషన్‌ ప్యాకెట్స్‌ సరఫరా చేయాలి.

  • తూలుగు రమణారావ్ఞ, అక్కరాపల్లి

దేశరక్షణలో వెనుకబాటు
కాశ్మీర్‌లోని ఉగ్రదాడిలో అమరులైన వీరజవానులకు ఈ దేశం మొత్తం బాసటగానిలిచింది.జవాన్ల ఆత్మశాంతికి ప్రజ లు ర్యాలీలు నిర్వహించారు. పెద్దఎత్తున నివాళులర్పించా రు. ఈ దాడి నుంచి దేశం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. స్వాతంత్య్రం వచ్చినతర్వాత మనదేశ త్రివిధ దళాలు ఎంత గా అభివృద్ధి చెందినా అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌ వంటి దేశాలంతగా ఆధునికం కాలేదు. రక్షణ సామాగ్రి కొనుగోళ్లు సైతం వివాదాస్పదమైన దాఖలాలు అనేకం ఉన్నాయి. ఇక బలగాల పాటవానికి తోడు నిఘా వ్యవస్థలు శత్రు దుర్బే ధ్యంగాఉండాలి.దేశంలోకి ఉగ్రవాదులు చొరబడి దాడులు చేస్తుంటే మన వెనుకబాటు స్పష్టంగా కనబడుతోంది.

  • వ్ఞలాపు బాలకేశవ్ఞలు గిద్దలూరు, ప్రకాశంజిల్లా