ప్రజవాక్కు

PEOPLE VOICE
Voice of the People

ప్రజవాక్కు

అసత్య ప్రచారాలపై కొరడా ఝుళిపించాలి: సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

కరెన్సీ నోట్లు, నాణేల చెల్లుబాటుపై అసత్య ప్రచారాలు మా మూలైపోతున్నాయి. గతంలో పొరుగు రాష్ట్రాలలో 10 పైసలు, ఐదు పైసలు నాణేలు విరివిగా చెల్లుబాటు అవ్ఞతున్నవేళ మన రాష్ట్రంలో అవి చెల్లవని వదంతులు సృష్టించి బాగా ప్రచారం చేసి అవి బలవంతంగా రద్దు అయ్యేలా చేశారు. ఆ తరువాత పావలాలు, అర్థరూపాయిల వంతు.ఆ తదుపరి ఐదు రూపాయ ల నోట్లు చెల్లవని వదంతులు వ్యాపింపచేసి, వాటి రద్దుకోసం యధాశక్తి కృషి చేశారు. కానీ ఆ పప్పులు ఉడకలేదు. తాజాగా ఇప్పుడు పదిరూపాయల నాణేలు చెల్లవని వదంతులు సృష్టిస్తు న్నారు. ఈ వదంతులు నమ్మి చాలా మంది వ్యాపారస్తులు 10 రూపాయల నాణేలు తీసుకోవడం లేదు. ఈ పది రూపాయల నాణేల రద్దు నిజం కానందున చిల్లరగా తీసుకోక తప్పడం లేదు. మరి ఈ నాణేలను ఏం చేయాలి? అధికారులు తక్షణమే స్పందించాలి.ప్రచారాలతో ఒక టోల్‌ఫ్రీనెంబర్‌ ఇవ్వాలి. అసత్య ప్రచారాలతో నాణేలు, కరెన్సీనోట్లు చెల్లవని తీసుకోనివారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

ఆవుకు ఆధార్‌ నంబరు: బి.ఎన్‌.సత్యనారాయణ, హైదరాబాద్‌

ప్రభుత్వం జనాభా గణన కోసంవారి గుర్తింపుకొరకు ఒక విశి ష్టమైన నంబరుతో కూడిన ఆధార్‌ కార్డును జారీ చేసింది. ఇది దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడు కలిగి ఉండాలని నిర్దేశించింది. దేశ పౌరునిగా గుర్తింపు కోసంప్రభుత్వం పథకాలకు అర్హత కోసం ప్ర భుత్వంతో సంబంధాలు నెరపేందుకు అన్నివిషయాలకు ఆధార్‌ కార్డును తప్పనిసరి చేసి అమలు పరచింది. ఇప్పుడు కేంద్ర ప్ర భుత్వం నూతనమైన ఆలోచనలతో మరో విశిష్టమైన కార్యక్రమా న్ని చేపట్టింది.అది ఆవులకు ఆధార్‌ నంబర్‌ ఇవ్వనుంది. ఆవ్ఞల గణనకు వాటి పాలకులకు పోషకులకు సంబంధించిన వివరాల తో కూడిన ఆధార్‌ సంఖ్యను ప్రతిఆవ్ఞకు ఇవ్వడానికి సిద్ధమవ్ఞ తోంది.అందుకుగాను ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని పర్యవేక్షణను ఏర్పాటుచేసి అందుకు అవసరమయ్యే నిధులను కేటాయిస్తుంది.

టిక్కెట్ల ధరలు రెట్టింపు: సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో విడుదల అవ్ఞతున్న తెలుగు సినిమాల ధరలను మొదటి రెండు వారాలకు రెట్టింపు చేసారు. పారదర్శకత కోసంకోర్టు ఆన్‌లైన్‌ టిక్కెట్ల అమ్మకాలకు ఆమోదం తెలుపగా కొందరు టిక్కెట్లను రకరకాల పేర్లతో బుక్‌ చేసి వాటి ని బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. ఇక థియేటర్‌ సిబ్బంది టిక్కెట్లను బాహాటంగా ఎక్కువధరలకు అమ్ముతున్నాఅడిగే నాధుడు లేడు. పోలీసులు కాపలా వ్ఞంటున్నా వారి ఎదురుగానే బ్లాక్‌లో టిక్కె ట్ల విక్రయం జరుగుతున్న వైనం బాధాకరం. వీటి నియంత్రణ కు ఏర్పాటు చేసిన టస్క్‌ఫోర్స్‌ సిబ్బంది నిర్లిప్తంగా ఉండిపోవడం దీనికి కారణంగా చెప్పొచ్చు. అభిమానహీరోల సినిమాలు త్వర గా చూడాలన్న ఆతృతను ఆధారం చేసుకొని రకరకాల మార్గాల లో బ్లాక్‌ టిక్కెట్ల విక్రయం సాగుతుంది.

మావోయిస్టులు సాధించేదేమిటి?: కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట, జయశంకర్‌జిల్ల్లా

మావోయిస్టులు దేశవ్యాప్తంగా వివిధప్రాంతాలలో రెచ్చిపోతు న్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌ అడవ్ఞలలో సి.ఆర్‌.పి.ఎఫ్‌ జవాన్లపై మెరుపుదాడి చేసి సుమారు 26 మందిని మట్టుబెట్టారు. అనేక మంది జవాన్లు క్షతగాత్రులైనారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణాలలో భాగంగా చింతల్‌నా ర్‌- చింతగుప్ప రహదారి విస్తరణ పనులు వందలాది మంది జవా న్లురక్షణలో సాగుతుండగా ఇదే అదనుగా మాటువేసి రాకెట్‌ లాంఛ ర్లు గ్రేనేడ్లు పేల్చి తూటాల వర్షం కురిపించి అమాయక జవాన్లను మట్టుబెట్టడం మావోయిస్టులకు తగునా?గ్రామీణప్రాంతాలలో రహ దారి వ్యవస్థను మెరుగుపరుస్తూ, రోడ్లను నిర్మిస్తున్న తరుణంలో కాంట్రాక్టర్లకు సంబంధించిన వాహనాలు, రోడ్డురోలర్స్‌, ప్రొక్లెయి నర్లను దగ్ధంచేయడంతోపాటు అధునాతన ఆయుధాలతో దాడులు చేసి జవాన్లను ఊచకోత కోయడం మావోయిస్టుల సిద్ధాంతమేనా? ప్రజాస్వామదేశంలో జీవిస్తూ తుపాకీ ద్వారానే రాజ్యాధికారం సాధిస్తామని మాటలు పలికే మావోయిస్టుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జవాన్ల త్యాగం వృధాకాదు.

ఎర్రబుగ్గ కార్లపై నిషేధం: జి.అశోక్‌, గోదూర్‌, జగిత్యాలజిల్లా

ఎర్రబుగ్గ కార్లను ఇక నుండి విఐపిలు వాడరాదని ప్రధాని తీసు కున్న నిర్ణయం ముదావాహం.రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రులు, గవర్నర్లు,న్యాయమూర్తులు ఇకనుండితమ అధి కారిక కార్లకు ఎర్రబుగ్గ వాడరాదంటూ మంచి నిర్ణయం తీసుకున్నా రు. విఐపిలతోపాటు మామూలు రాజకీయ నాయకులు కూడా వి ఐపిల మాదిరి ఎర్రబుగ్గ కార్లు వాడుతూ దాని విలువను తగ్గిస్తు న్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎర్రబుగ్గ మరింత చులకన కాకుండా కేంద్ర కేబినెట్‌ ఆదర్శంగా ఉండాలని కోరుకోవడం నిజంగా చాలా బాగుంది. ఈ నిర్ణయం పట్ల సామాన్య ప్రజలంతా హర్షిస్తున్నారు. దేశంలోని పౌరులంతా హర్షిస్తున్నారు.

బిజెపిని గెలిపించాల్సిన అవసరం: వింజనంపాటి ఉష, తిరుపతి

భారతదేశంలో గత సార్వత్రికఎన్నికల్లో కాంగ్రెస్‌ను కాదని భార తీయ జనతాపార్టీని ప్రజలు గెలిపించి నరేంద్ర మోడీని ప్రధానిని చేసారు. అలాగే ఈ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఉత్తరాది రాష్ట్రాలలో ప్రధాని నరేంద్రమోడీకి తమ ఐక్యతను చాటుకున్నారు. ఇక ప్రధానికి, భారతీయ జనతాపార్టీకి తమ తమ ఐక్యతను తెలియచేసే తరుణం ఇక దక్షిణాది వారిది. వచ్చే ఎన్నికల్లో దక్షిణా ది ప్రజలు కూడా బిజెపిని గెలిపించాల్సిన అవసరం ఉంది ్ద మిస్సుల శివరామకృష్ణ, అత్తావూరు పది రూపాయల నాణెంపై గందరగోళం పదిరూపాయల నాణేల చెలామణిపై ప్రజలలో గందరగోళ పరి స్థితి అలుముకున్నది.అన్ని రాష్ట్రాలలోను ఇది వివాదగ్రస్థమైన విష యంగా మారింది. ఇకనైన మీడియా ద్వారా అపోహలు తొలగించి పది రూపాయల నాణేల స్థానంలో చెలామణిలో జోరుగా అమలు లో ఉన్న నాణాలను ప్రజల్లోకి తేవాలి.