పార్టీల గుప్త విరాళాలపై వీడని గుట్టు

Funds

పార్టీల గుప్త విరాళాలపై వీడని గుట్టు

సంస్థలు కానీ వ్యక్తులు కానీ భారీగా పార్టీలకు విరాళాలు సమకూర్చితే ఆ పార్టీలు అధికారంలోకి వస్తే ఎవరైతే విరాళాలు అందించారో వారి ప్రభావం ప్రభుత్వాలపై పనిచేస్తుందని, తమకు అనుకూలంగా చట్టాలను మార్పించుకోవడా నికి ప్రయత్నిస్తారన్న ఆరోపణలున్నాయి. అందుకే ఆనాడు అంబే ద్కర్‌ ఈ విరాళాల ప్రభావానికి దూరం గా ఉండాలన్న అభిప్రాయం వెలిబుచ్చారు. దాతలయిన సంపన్న వర్గాలు అధికార పార్టీలపై ఒత్తిడి తెచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ అనుభవాలను సూచనలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల అపరిమిత వ్యయాన్ని నియంత్రించడం, పార్టీల ఎన్నికల ప్రచారాలకు ప్రభుత్వమే నిధులు అందించడం,పార్టీలకు అందుతున్న విరాళాల్లో పారదర్శకత పాటిం చడం అవసరమని మోడీ సూచించారు.

కానీ రెండువేలకు మించి విరాళాలు అందించే వ్యక్తుల వివరాలు తెలియాలని నిర్దేశిస్తున్నప్పు డు కోట్లకొద్దినిధులు అందించే కార్పొరేట్ల వివరాలు ఎందుకు గుట్టు గా ఉంచవలసి వస్తుందో అర్థం కావడం లేదు. 2004-2005 నుంచి పదకొండేళ్ల కాలంలో జాతీయ ప్రాంతీయ పార్టీల మొత్తం రాబడి 11,367 కోట్ల రూపాయలుగా తేలింది. దాతల్లో 69శాతం గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచే ఈ మొత్తాలు అందాయ ని అధ్యయనాలు చాటుతున్నాయి.ఈ విరాళాల పరిమితి పదో వంతుకు కుదించినా చిన్నమొత్తాల వరకే అందుతున్నా దీనివెనుక భారీ ఎత్తున లావాదేవీల తతంగం నడుస్తోంది. పార్టీలకు చేరే ప్రతిరూపాయి ఎలా ఎక్కడనుంచి వచ్చిందో కచ్చితం గా నమోద య్యేలా పారదర్శకంగా ఉండేలా ఫ్రాన్స్‌, ఇటలీ, జర్మనీ, జపాన్‌ దేశాల్లో చట్టబద్ధ ప్రక్రియ సాగుతున్నప్పుడు మనం ఎందుకు ఆవిధంగా కచ్చితంగా వ్యవహరించకూడదు అన్నదే ప్రశ్న.

రాజకీయ పార్టీలకు ప్రధాన ఆర్థికవనరు విరాళాలే. 20వేల రూపాయల కంటే తక్కువ మొత్తం విరా ళంగా వస్తే ఆ మొత్తాన్ని అజ్ఞాత వ్యక్తుల ఖాతాలో చేరుస్తారు. ఈ విధంగా విరాళం ఇచ్చే దాత పేరు బయటపెట్టవలసిన అవసరం లేదు. స్వచ్ఛంద విరా ళాలు, సమావేేశాలకు విరాళాలు, సహాయ నిధి,కూపన్ల అమ్మకాలు ఇటువంటివన్నీ అజ్ఞాత విరాళాల ఖాతాలోకే వస్తాయి. ఇప్పుడు జాతీయ పార్టీలు అజ్ఞాత విరాళాల ఖజానాతో వర్ధిల్లుతున్నాయి. కాంగ్రెస్‌, బిజెపిలకు 2015-16లో వచ్చిన విరాళాల ఆదాయంలో 77 శాతం అజ్ఞాత దాతల నుంచి వచ్చినదే. 2015-16లో బిజెపికి అజ్ఞాత దాతల నుంచి రూ. 461 కోట్లు రాగా అది ఆ పార్టీ ఆదాయంలో 81 శాతంగా పేర్కొనవచ్చు.

అలాగే కాంగ్రెస్‌కు వచ్చిన 186 కోట్లు ఆ పార్టీ ఆదాయంలో 71 శాతంగా తేలింది. ఈ రెండు పార్టీలకు కలిపి 832.42 కోట్లు ఆదాయం వచ్చింది. ఇందులో బిజెపికి 570.86 కోట్లు రాగా, కాంగ్రెస్‌ ఆదాయం 261.56 కోట్లు. ఈ మొత్తంలో 646.82 కోట్లు అంటే 77 శాతం అజ్ఞాత దాతల విరాళాలు అని చెప్పవచ్చు. 15-16 ఆర్థిక సంవత్సరంలో ఏడు జాతీయ పార్టీలకు కలిపి 1033.18 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇందులో 754.45 కోట్లు ఖర్చయిందని, 278.73 కోట్లు(26.98 శాతం) ఖర్చు కాలేదని పార్టీలు తెలిపాయి. బిజెపి 23 శాతం, కాంగ్రెస్‌ 26శాతం ఖర్చు పెట్టలేదు. 2014-15లో బిజెపికి 970.43 కోట్ల రూపాయలు విరాళాలుగా వస్తే 2015-16లో అది 41 శాతానికి తగ్గి 570.86 కోట్లకు పరిమితమైంది. కాంగ్రెస్‌లో ఈ తగ్గుదల 56 శాతం ఉంది. రాజకీయ పార్టీలకు అందే విరాళాలపై ఎలా వ్యవహరించాలన్నది ఇంకా స్పష్టం కాక కేంద్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. విరాళాల్లో పారదర్శకత పాటించడంపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ అభిప్రాయం. గత ఏడాది నుంచి ఇదే ధ్యాసలో ఆయన ఉంటున్నారు. చట్టపరంగా ఎలాంటి నిషేధం లేకపోయినా ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్‌ 29 సి కింద పరోక్ష పాక్షిక నిషేధం అమలులో ఉంది.

దీని ప్రకారం 20వేల రూపాయలకు మించి విరాళాలు ఇచ్చిన వ్యక్తుల పేర్లను తప్పక ప్రకటించవలసి ఉంటుంది. అయితే దాతల వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేకుండా పార్టీలు నగదు రూపంలో స్వీకరిం చగల మొత్తాన్ని 20వేల నుంచి రెండువేల రూపాయలకు పరిమి తం చేయడం అంతేకాదు ఆర్‌బిఐ చట్టానికి అదనపు సవరణ చేయ డం ద్వారా ఎలెక్టోరల్‌ బాండ్ల విధానాన్ని అమలులోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. పార్టీలకు విరాళాలు అందించేవారు నిర్దే శిత బ్యాంకులో బాండ్లు కొని పార్టీలకు ఇస్తే అవి నిర్ణయించిన గడు వ్ఞలో అధీకృత ఖాతాల ద్వారా నగదుగా మార్చుకుంటాయని అరుణ్‌జైట్లీ ప్రతిపాదిస్తున్నారు.

దీనివల్ల బ్యాంకుల ద్వారా స్వచ్ఛ మైన నగదు మొత్తాలే పార్టీలకు అందుతాయని, ఎవరో ఏమిటో తెలియని అనామిక నల్లడబ్బు వ్యవహారాలకు అడ్డుకట్ట పడుతుం దని ప్రభుత్వం విశ్వసిస్తోంది. కానీ 2వేల రూపాయలు, ఆపై మొత్తాల్లో సేకరించే గుప్త విరాళాలపై వేటు వేయాలని కేంద్రన్నికల సంఘం గత డిసెంబర్‌లోనే ప్రతిపాదించింది. అభ్యర్థి తరపున పార్టీ భరించిన ఖర్చును కూడా అభ్యర్థి ఎన్నికల వ్యయంలో కల పాల్సిందేనని గతంలో సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్నా పట్టించు కోకుండా గత కాంగ్రెస్‌ ప్రభుత్వం చట్టసవరణ చేసింది. ఈ సూచన లను మోడీ ప్రభుత్వం మన్నించినా ఆచరణలోకి తేవడానికి ఊగిస లాడుతోంది. కార్పొరేట్‌ సంస్థలు గత మూడేళ్ల నికర లాభంతో 7.5 శాతం వరకు రాజకీయ విరాళాలు అందించగలవీలుంది. కానీ చట్టంలో తాజా సవరణతో ఆ పరిమితి తొలగించారు. ఆర్థిక సంవ త్సరంలో తాము ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చిందీ స్పష్టం చేయా లన్న నిబంధనలను సవరించారు. అసలు పార్టీ పేరు ప్రస్తావిం చాల్సిన అవసరం లేకుండా చేశారు.

ఒకవ్యక్తి నుంచి లేదా సంస్థ నుంచి 20వేల రూపాయలలోపు విరాళాన్ని రాజకీయపార్టీలు తీసు కున్నప్పుడు ఆ మొత్తాలకు సంబంధించి పాత 500, 1000 నోట్లకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌ 18న ప్రకటించడం విరాళాల దాతలకు, పార్టీలకు కొంత వెసులుబాటు కల్పించినట్టయింది. అయితే ఆ విరాళం ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలియచేసే ధ్రువీకరణ పత్రాలు పార్టీల దగ్గర ఉండాలని ఆంక్షలు విధించింది. ఈ సందర్భంగా ఎన్నికల పోటీలో లోక్‌సభ లేదా అసెంబ్లీ సీట్లను పొందే రాజకీయ పార్టీలకు మాత్రమే ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వా లని ఎన్నికల కమిషన్‌ ప్రతిపాదించింది.

ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్‌ 13ఎ ప్రకారం రాజకీయ పార్టీలకు స్థిరచరాస్తుల నుంచి వచ్చే ఆదాయం, స్వచ్ఛందంగా వచ్చే విరాళాలు, పెట్టుబ డుల లాభాలు, ఇతర మార్గాల ద్వారా పొందే ఆదాయానికి మాత్ర మే ఆదాయం పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. దీన్ని సాకుగా తీసుకుని ఆదాయం పన్ను మినహాయింపు వెసులుబాటును పొందడానికే కొన్ని పుట్టగొడుగు పార్టీలు పుట్టుకొస్తున్నాయన్న దాఖలాలు ఉన్నాయని ఎన్నికల కమిషన్‌ వాదిస్తోంది.

-కె.అమర్‌