పాకిస్థాన్‌ ప్రపంచ ఉగ్రవాద దేశం

వార్తల్లోని వ్యక్తి

Terrarist
Terrarist

పాకిస్థాన్‌ ప్రపంచ ఉగ్రవాద దేశం

అని తెలుగులో ఒక దేశభక్తి గీతంవుంది. ఈ గీతం ఇప్పుడు పాక్‌ ఉగ్రవాదులకు అక్షారాలా వర్తిస్తుంది. ‘చూస్తూ వూరుకుంటే, మేస్తూ పోయిందని సామెత. పాక్‌ ఉగ్రవాదాన్ని చూస్తువుంటే ఈ సామెత జ్ఞాపకం వస్తున్నది. మొన్న పఠాన్‌ కోటలోని వైమానికి స్ధావరంపై దాడి! నిన్న కాశ్మీర్‌లోని యురిపై ఆకస్మిక దాడి చేసి, 18మంది సైనికులను ఓక గదిలో పెట్టి, సజీవదహనం! పైగా, ఇది కేవలం నలుగురు పాక్‌ ముష్కరుల పట్టపగటి దారుణం. ఎంతకాలం పాక్‌ ఉగ్రవాదు లు భారతపై విశృంఖల విహారం చేస్తారు? 1947లో ఇండియాకు స్వాతంత్య్రం వచ్చిన వెంటనే పాకిస్తాన్‌ కాశ్మీర్‌పై దాడి చేసి, నాలుగు జిల్లాలను పూంఛ్‌, విూర్‌పూర్‌, గిల్గిత్‌, ముజఫరాబాద్‌ జిల్లాలను దురాక్రమణ చేసింది. అదేమంటే, ఆ పని చేసింది మా సైనికులు కాదు, కొండజాతివారని బుకాయించింది. బూకరింపులు, అసత్యప్రలాపాలకు, అభూతకల్పనలకు పాకిస్తాన్‌ పెట్టిందిపేరు.
దాని బతుకే అసత్యాలు, ఆ భూతకల్పనలపై ఆధారపడింది. స్వదేశంలో తమనాయకత్వానికి ప్రమాదం ఏర్పడినప్పుడల్లా పాక్‌నాయకులు తమ ప్రజల దృష్టిని అన్య దిశకు మరల్చడానికి ‘భారత్‌బూచిని చూపిస్తారు. ‘మొగుణ్ణి కొట్టి మొగసాలకు మొర పెట్టుకున్న సామెత వలే తాము భారతపై దాడి చేసినప్పుడల్లా భారతపై వేలు చూపుతారు. ఇదివారి నంగనాచితనం. తీరా ఐక్యరాజ్యసమితి పరిశీలక బృందంవచ్చి ‘కొండజాతి వారుకాదు దురాక్రమణదారులు! విూ సైనికులే! అని చెంప దెబ్బకొట్టినప్పుడు పాకిస్తాన్‌ తలవంచుకు న్నది. మొన్నటికి మొన్న చూడండి తమ దేశంలో అన్నింటికన్న చిన్న రాష్ట్రమైన బెలూచిస్తాన్‌లో స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న దేశభక్తులపై విమాన బాంబుల దాడి చేయిస్తూ, మరోవంక కాశ్మీ ర్‌లో భారతదేశం మానవ హక్కులకు భగం కలిగిస్తున్నదని కల్ల బొల్లి కన్నీరు కారుస్తున్నది! అందువల్లనే, ప్రధాని మోడీ ‘విూబెలూచిస్తాన్‌పై బాంబులదాడి సంగతి ఏమిటిని ప్ర్రశించేసరికి ‘అది మా ఆంతరంగిక సమస్య. విూకెందుకు? అని బుకాయిస్తు న్నది.

కాగా, ఇప్పుడు పాకిస్తాన్‌ పీకల మీదకు కొత్త సమస్య వచ్చి పడింది. ఇదివరకు పాక్‌ ఉగ్రవాదం గురించి ప్రపంచానికి తెలిసి వచ్చినా, ఇప్పుడు అమెరికన్‌ కాంగ్రెసు పార్లమెంట్‌లో అటు అధికార పక్షం డెమెక్రాటిక్‌పార్టీ, ఇటు ప్రతిపక్షం రిపబ్లికన్‌పార్టీ పాక్‌ మెడకు ఉరితాడు తగిలించాయి. అమెరికా కాంగ్రెసులోని దిగువ సభకు చెందిన ఉగ్రవాద సబ్‌ కమిటీ ఛైర్మన్‌ టెడ్‌పో(అధికారపక్షం), ప్రతిపక్షమైన రిపబ్లికన్‌ పార్టీ సభ్యుడు పాకిస్తాన్‌ ‘అంతర్జాతీయ ఉగ్రవాదదేశంగా ప్రకటించాలని ప్రెసిడెంట్‌ ఒబామాను కోరుతూ రెండు వేర్వేరు బిల్లులను ప్రవేశపెట్టారు. అతి కీలకమైన ఉగ్రవాద వ్యతిరేక సబ్‌ కమిటీ ఛైర్మన్‌ బిల్లును అమెరికా అధ్యక్షుడైనా కాదనలేడు. అయినా, ఆయన కూడా పాకిస్తాన్‌ ‘ఉగ్రచర్యలను ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వున్నారు. ఇక, కాంగ్రెస్‌లోని ప్రతిపక్షం కూడా అలాంటి బిల్లునే ప్రవేశపెట్టింది కదా! చేసుకున్నవారికి చేసుకున్నంత! ఆ బిల్లును అధ్యక్షుడు ఆమోదించిన తరువాత పాకిస్తాన్‌కు అమెరికా చేస్తున్న భారీ ఆయుధ, ఆర్ధిక సహాయాలు బంద్‌! అమెరికా సహాయమే లేకపోతే, పాకిస్తాన్‌కు ఊపిరే ఆడదు. పాకిస్తాన్‌కు అమెరికా మొన్నటి వరకు ఆప్తమిత్రదేశం. కాశ్మీర్‌ సమస్య ఐక్యరాజ్యసమితిలో ఎప్పుడు చర్చ కు వచ్చినా, అమెరికా పాకిస్తాన్‌కే వత్తాసు పలికేది! ఇప్పుడా అమెరికాయే పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ఉగ్రవాద దేశంగా ప్రకటించ బోతున్నది. ఇకనైనా పాకిస్తాన్‌ తన ‘ఉగ్రవాద దేశముద్రను చెరిపి వేయడానికి ప్రయత్నించగలదా?

డాక్టర్‌ తుర్లపాటి కుటుంబ రావు (”పద్మశ్రీ అవార్డు గ్రహీత)