పసిమొగ్గలపై పైశాచిక కాండ

edt1
Girl

పసిమొగ్గలపై పైశాచిక కాండ

తెలంగాణ రాష్ట్రంలో చిన్న పిల్లలపై నేరాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఒక ఏడాది కాలంలోనే ఏడు శాతం పెరగడం గమనార్హం. గతంలో దొంగతనాలు జరిగేట ప్పుడు నగల కోసం చిన్నపిల్లలను ఎత్తుకెళ్లి వారి ఒంటిపై ఉండే నగలను ఒలుచుకుని విడిచిపెట్టేసేవారు. రానురాను మనిషిలో పైశా చిక ప్రవృతి పెరుగుతోంది. ఆస్థిపాస్థుల కోసం రక్తసంబంధీకులే పిల్లల్ని కిడ్నాప్‌ చేయించడం, కిరాయి దుండగులచే హత్యలు చేయించడం పరిపాటి అయింది.దాదాపు 30ఏళ్ల క్రితం శ్రీకాకు ళంలో ఆస్తివివాదం కక్షతో బాలికను కిడ్నాప్‌చేయడం తదనంతరం మరో వ్యక్తిని హత్య చేయడం గుప్తాహత్యగా ఆకేసు సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేసులు మరోమలుపు తిరుగుతున్నాయి. తల్లిదండ్రులే కొందరు తమ బిడ్డలను నిధుల కోసం మంత్రగాళ్ల సలహాతో బలి ఇవ్వడం మరికొందరు లేనిపోని అనుమానాలతో పసిప్రాణాలను బలిగొనడం వంటి దారుణాలు సాగుతున్నాయి. కడుపున పుట్టిన బిడ్డలను కన్నవారే అమానుషంగా బలిగొనే అమానవీయ సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. వీటివెనుక కారణాలు ఏమైనా కావచ్చు. కానీ తమపేగు చించుకుని పుట్టిన బిడ్డలను చంపే కసాయితనం ఎలా వచ్చిందో అంతుపట్టడం లేదు. 2016 ఏప్రిల్‌ మొదటివారంలో హైదరాబాద్‌ నగరం శివారు నేరేడిమెట్‌లో ఒక ఇంటిలో కొన్ని నెలల వయసు ఉన్న పసికందు గొంతుకోసి దుండగులు చీల్చివేశారు.
ఎవరో దొంగతనానికి వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా నేరవిచారణలో కన్న తల్లే ఈ దారుణానికి ఒడిగట్టిందని బయటపడింది. తల్లి 27ఏళ్ల డి.పూర్ణిమ ఈ ఘోరం కోసం షేవింగ్‌ బ్లేడ్‌ను ఉపయోగించానని చెప్పింది. మరో దుర్ఘటన ఈ ఏడాది మొదట్లో 12ఏళ్ల బాలుడు తన సమీప బంధువ్ఞ వల్ల హత్యకు గురయ్యాడు. మైలార్‌ దేవ్ఞపల్లిలో ఇది జరిగింది. హత్య తరువాత ఆ బాలుని శవాన్ని రైల్లేట్రాకుపై పడేశారు. ఈ నెల ఏడేళ్ల జి.సాయి ప్రసన్న అనే బాలిక గొంతు కోసి హత్య చేశారు. ఆమె తల్లిదం డ్రులు లేని సమయంలో ఆమె శవం ఇంటిలోని బాత్‌రూపంలో కనిపించింది. హింసకు ఎక్కువగా బాధితులవ్ఞతున్నది పిల్లలే. నరకయాతన అనుభవించడమే కాదు ప్రాణాలను కోల్పుతున్నారు. 2014లో రాష్ట్రంలో చిన్న పిల్లలను హింసించడం హత్య చేయ డం తదితర సంఘటనల శాతం 17.3 శాతం వరకే ఉండేది. 2015లో ఈ సంఖ్య రెట్టింపయి 24.1 శాతానికి చేరుకుంది. కర్ణా టక, తమిళనాడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల కన్నా తెలంగాణలో చిన్న పిల్లలపై దారుణాల నేరాల శాతం పెరిగిందనే చెప్పకతప్పదు. గత ఏడాది 85 మంది పిల్లలు హత్యకు గురయ్యారు. 2014లో 76 మంది హత్యకు గురయ్యారు. ముఖ్యంగా బాలికలే నేరాలకు బలవ్ఞ తున్నారు. హింసకు ఎవరైతే పిల్లలు బాధితులవ్ఞతున్నారో వారిని పోలీస్‌ లు, లేదా ఇతర సేవా సంస్థలు, రక్షించి రక్షక గృహాలకు, పిల్లల భద్రతాగృహాలు (చైల్డ్‌ కేర్‌ హోమ్స్‌)కు పంపబడుతున్నారు. అయితే ఈ రక్షకగృహాల్లో కూడా హింస కొనసాగుతోంది. ప్రయివేట్‌ శరణాలయాలు చాలావరకు ధనార్జన యంత్రాలుగా తయారయ్యా యి. అలాగని ప్రభుత్వ శరణాలయాల పరిస్థితి కూడా మెరుగ్గా లేదు. ఈ ఏడాది జూన్‌లో రంగారెడ్డి జిల్లా చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ (సిడబ్ల్యుసి) సభ్యుడు ప్రభుత్వ శరణాలయాలలోని మైనర్‌ బాలికపై అఘాయి త్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జరిగిన నెల రోజుల తరువాత సంరక్షణ గృహంలోనే 14 ఏళ్లబాలిక సామూహిక మాన భంగానికి గురయింది. దీంతో ఆ సంక్షేమ గృహం అధికారి ఆ తరువాత సస్పెండ్‌ అయ్యాడు.అదే నెలలో 70 మంది బాలకార్మికు లు వరం గల్‌ సిడబ్ల్యుని సంక్షేమ గృహం నుంచి బలవంతంగా వీధిపాలయ్యారు.జూలైలో అనాధశరణాలయం పాస్టర్‌, యజమాని పిల్లలను వీధుల్లో బిచ్చమెత్తడానికి పంపిస్తున్న ఉదంతం బయట పడింది.శరణాలయాలలో తమను వేధించిహింసిస్తున్నారని ఆ పిల్ల లు ఆరోపించారు.బాలల హక్కుల ఉద్యమ నేతలు ఈ సంక్షేమ గృహాలుచాలా దీనాతిదీనంగా తయారయ్యాయని బాలల పునరావా సానికి సంబంధించి కనీస వసతులు,మౌలిక సౌకర్యాలు లేవని ఆరోపించారు.రాష్ట్రప్రభుత్వం పిల్లలసంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వ డం లేదని, ఈ వసతి గృహాల నిర్వహణపై శ్రద్ధచూపడం లేదని చెప్పారు. ప్రభుత్వ నిధుల సహాయంతో నడుస్తున్న పెద్ద పిల్లల సంరక్షణ సంస్థలు, కూడా ప్రభుత్వ పర్యవేక్షణ లేక ఇష్టారాజ్యంగా తయార వ్ఞతున్నాయి. బాలల సంరక్షణ కేంద్రాల్లో జరిగిన కొన్ని దుర్ఘటనల పైనే ఫిర్యాదులు అందుతున్నాయి.బాలల సంరక్షణకు సంబంధించి ప్రభుత్వ స్థాయిలోవిధానాల్లో మార్పులు అవసరమవ్ఞ తున్నాయి. బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించిన జాతీయ కమిషన్‌ చాలా సంఘటనల్లో జోక్యం చేసుకుని చర్యలు తీసుకొనేం దుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. సెప్టెంబర్‌లో కమిషన్‌ తెలంగాణ రాష్ట్ర ముఖ్యకార్యదర్శి రాజీవ్‌ శర్మకు లేఖరాస్తూ ఖమ్మం జిల్లా హాస్టళ్లలో గత రెండేళ్లలో పాము, తేళ్లకాటుకు 28 మంది గిరిజన బాలికలు మృతిచెందారని ఆందోళన వెలిబుచ్చింది.కమిషన్‌ ప్రతిని ధులు ఖమ్మం జిల్లాలోని మూడు హాస్టళ్లను పరిశీలించగా అక్కడి మరొకొందరు విద్యార్థులు ప్రమాదస్థితిలో ఉన్న విషయం బయటప డిందని వెల్లడించారు. ఆ పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తక్షణం తరలించాలని, ఆ రెసిడెన్షియల్‌ స్కూళ్లకు సంబంధించి డాక్టర్‌ను ఏర్పాటు చేయాలని, 24 గంటలూ అందు బాటులో ఉండేలా అంబులెన్స్‌ ఏర్పాటుచేయాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి రాసిన లేఖలో సూచించారు. సెప్టెంబర్‌ 20న మరో లేఖ రాజీవ్‌శర్మకు కమిషన్‌ రాసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అర్థాంతరంగా చదు వ్ఞలను ఆపేస్తున్న పిల్లలను గమనించి వారు స్కూళ్లు మానేయ కుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదే విధంగా 2014 నుంచి కమిషన్‌ 6 లేఖలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్టు రికార్డులు చెబుతున్నాయి. అయినా దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించకపోవడం విచిత్రం.

పెట్ల వెంకటేశం