పర్యావరణ కాలుష్య ప్రమాదంలో ప్రజారోగ్యం

pollution
pollution

పర్యావరణ కాలుష్య ప్రమాదంలో ప్రజారోగ్యం

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం మనుషు లకు వచ్చే 102 వ్యాధులలో 85 వ్యాధులు పర్యా వరణ కాలుష్యం వలన వస్తున్నాయి. పర్యావరణ కాలుష్యానికి ఇంధన కాలుష్యం ఒక ప్రధాన కారణం. గాలిలో కార్బ న్‌డైఆక్సైడ్‌ పెరుగుదల గత 30 ఏళ్లలో 84 శాతం పెరిగింది.ఇది 2013 నాటికి 396 పిపిఒకు పెరిగింది. అలాగే మిథేన్‌ సాంద్రత, నైట్రిస్‌ ఆక్సైడ్‌ సాంద్రత కూడా పెరిగింది. ప్రపంచ మెటీరియాల జిక్‌ రీసెర్చ్‌ వారు ఈ తీవ్రతను నమోదు చేశారు.
అంతేకాకుండా భారతదేశంలోని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ఎన్విరాన్‌మెంట్‌ వారి నివేదిక ప్రకారం మనదేశంలో ఒక సంవత్సరానికి ఎనిమిది లక్షల టన్నుల ఎలక్ట్రానిక్‌ వ్యర్థపదార్థాలు పర్యావరణంలోకి వదిలివేయడుతున్నది. ఇందులో లెడ్‌,మెర్కురీ,కాడ్మియం మొదలైనవి ఉండటం వలన మనుషులకు శ్వాస సంబంధిత, నరాల సంబంధిత వ్యాధులు వస్తా యి. ప్రపంచ జల అభివృద్ధి సంస్థ నివేదిక ప్రకారం ‘స్వచ్ఛమైన జలాల లభ్యత పై చేసిన సర్వేలో భారతదేశం 122 దేశాల జాబి తాలో 120వస్థానంలో ఉన్నది.

ప్రపంచ నీటి లభ్యతపై సర్వేప్రకా రం భారతదేశం 180దేశాల వరుసలో 133 స్థానం లో ఉంది. కలుషితనీరు అనేక రోగాలకు కారణమవ్ఞతుంది. మన రాష్ట్రంలో పర్యావరణ కాలుష్యం వలన సంవత్సరానికి 2.0లక్షల మంది చని పోతుంటే అందులో 1.2 లక్షల మంది ప్లాస్టిక్‌ కారణంగా మరణిస్తు న్నారు. వేడి కలిగిన ఆహార పదార్థాలు ప్లాస్టిక్‌ బ్యాగుల్లో ఉంచడం వలన ఆహార పదార్థాలలో హానికర మెటల్స్‌ చేరి అవి శరీరంలోనికి ప్రవేశించి నరాల బలహీనత కలుగచేస్తున్నాయి. ప్లాస్టిక్‌ను మున్సి పాలిటీ వారు పంపింగ్‌ యార్డ్‌లలో కాల్చడం వలన విడుదలయ్యే టైయాక్సిన్‌్‌,ఫ్యూరాక్సిన్‌, ప్యూరాన్‌ వాయువ్ఞలు విడుదలై పర్యా వరణ కాలుష్యం ఏర్పడికాలేయ వ్యాధులు, కేన్సర్‌, మూత్రపిండాల వ్యాధులు వస్తున్నాయి. దేశంలోని కాలుష్య రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ 2వ స్థానంలో ఉంది.పరిశోధనా వివరాల ప్రకారం వాయుకాలుష్యా నికి కారణమయ్యే అతిచిన్న హానికర ఘనపదార్థాలు బొగ్గు,పెట్రో లు, డీజిల్‌ మండించడం వలన విడుదల అవ్ఞతున్నాయని తేలింది.

వీటివలన ఊపి రితిత్తుల, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. భారత దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో దాదాపు 66 శాతం ధర్మల్‌ స్టేషన్లలో ఉత్పత్తి అవ్ఞతున్నాయి. ఈ ప్రక్రియలో విడుదల అయ్యే సల్ఫర్‌ డై ఆక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, కార్బన్‌ డై ఆక్సైడ్‌ కాలుష్యం వలన అస్తమా,ఆయుష్షుతగ్గుట, ఊపి రితిత్తుల వ్యాధులు, కేన్సర్‌, చర్మవ్యాధులు వస్తున్నాయి. 1400 మెగా వాట్ల విద్యుదుత్పత్తిని ఇచ్చే ఒకధర్మల్‌ స్టేషన్‌ వలన ఒక సంవత్సరానికి 1000నుండి 2500 మంది పెద్దలు,2400 నుండి 2700 మంది పిల్లలు ఆస్తమా మొదలైన జబ్బులు సోకి బాధపడు తున్నట్లు తేలింది. అటువంటి ధర్మల్‌స్టేషన్ల నుండి సుమారు 25కి.మీ పరిధి వరకు దాని ప్రభావం ప్రజల ఆరోగ్యం, నీటి వన రులపై ఉంటుంది. సుమారు 80 కి.మీ పరిధి వరకు ఈ కాలుష్య ప్రభా వం పంటలపై ఉంటుంది. పంట దిగుబడులు తగ్గుతాయి. సుమా రు 1000 కోట్ల విలువైన వరి ఉత్పత్తి తగ్గుతుందని ఒక అంచనా. ఆఫీస్‌ రూమ్‌లలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ తీవ్రత 1000 పిపిఎం మించి ఉండరాదు. ఇది 2500 పిపిఎంకు చేరితే పరిస్థితి విషమించి ఆఫీసులోని మనుషులు వ్యాధిగ్రస్తులవ్ఞతారు.

పరిష్కారమార్గాలు

తాగునీరు ఫిల్టర్‌ చేసిన తర్వాతనే వాడాలి. పరిశ్రమల నుండి వెలువడే రసాయనాలు నదులలో కలపడం వలన వాటిలోని లెడ్‌, కాపర్‌, జింక్‌, నైట్రీట్స్‌ నీటిలోకలిసి అవి తాగిన మనుషులకు వ్యా ధులు కలుగచేస్తాయి. కావ్ఞన వాటర్‌ ఫిల్టర్‌ ద్వారా ఫిల్డర్‌ అయిన నీటినే వాడాలి. చెట్లను ఇళ్లకు, రోడ్లకు ఇరువైపులా పెంచాలి. చెట్ల ను పెంచడంద్వారా గాలిలోని వాయుకాలుష్యాన్ని తగ్గించవచ్చును. కానీ దీనితోపాటు ఇంధన కాలుష్యం జనించకుండా చర్యలు చేపట్ట డంచాలా అవసరం.చెట్లు పెరిగి కాలుష్యాన్ని తగ్గిస్తాయన్నది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. కావ్ఞన ప్రభుత్వం ఇంధన కాలుష్యం ఏర్పడకుండా చర్యలు చేపట్టాలి.వాయు కాలుష్యంలో ప్రధానమైనది ఇంధన కాలుష్యం. దీనికోసం ప్రభుత్వం కొన్ని తక్షణ చర్యలు చేప ట్టాలి.పెట్రోల్‌ బంక్‌లు ఉదయం 8గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఉంచాలి. రాత్రిపూట మూసివేయాలి. ఆదివారం సెలవు, వాహనాల వినియోగం బాగా తగ్గించాలి. పట్టణ స్థాయి అధికారి అయినా మున్సిపల్‌ కమిషన్‌ నుండి మండలస్థాయి అధి కారి వరకు నాలుగు చక్రాల వాహనాలను రద్దు చేయాలి. మున్సి పల్‌ కమిషనర్లకు రిక్షాలు సరఫరా చేయాలి.

రెవెన్యూడివిజన్‌ ఆపై అధికారులకు కూడా ఒక్కొక్కొరికి ఒక వాహనం ఇవ్వకుండా అవస రాన్ని బట్టి 2-5 గురు అధికారులకు ఒక వాహనం ఇవ్వాలి. ఆర్‌టిసి బస్సు సౌకర్యం ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు ప్రత్యే క బస్సులను ప్రభుత్వ ఖర్చుతో నడపకూడదు.ఉదా: ఎన్‌హెచ్‌-5 ప్రక్కనగల గుంటూరు జిల్లాలోని నాగార్జునయూనివర్సిటీకి వెళ్ళటా నికి ప్రతి 10నిమిషాలకు గుంటూరు, విజయవాడల నుండి ఒక ఆర్‌టిసిబస్సు ఉంది.కాని యూనివర్సిటీ వారు ప్రత్యేక బస్సు లను నడుపుతున్నారు.ఈవిధంగా దేశంలో అనేక ప్రభుత్వ కార్యాల యా లకు ఉన్న ప్రత్యేక బస్సులను రద్దు చేయాలి. దీనివలన డబ్బు, ఇంధనకాలుష్యం తగ్గుతుంది.బయోడీజిల్‌ ఉత్పత్తిబాగా పెంచాలి. మన దేశంలో పొంగామియ,జట్రోపాను బయోడీజిల్స్‌గా వాడుతుం డగా అమెరికాలో సోయాగింజలను,యూరప్‌లో సన్‌ఫ్లవర్‌ను, థా§్‌ు లాండ్‌లో పామాయిల్‌ను,ఐర్లాండ్‌లో పశువ్ఞలకొవ్ఞ్వను జీవ ఇంధనంగా వాడుతున్నారు. అమెరికాలో సోలార్‌ శక్తితో నడిచే విమానాలున్నాయి

గ్రామాలలో గోబర్‌గ్యాస్‌ యూనిట్లను పెంచాలి. బయోడీ జిల్‌ ఇంధనకాలుష్యాన్ని తగ్గిస్తుంది. సోలార్‌ విద్యు త్‌ ఎక్కు వగా వినియోగించాలి.ప్రపంచ విద్యుదుత్పత్తిలో సోలా ర్‌ విద్యుత్తు 12శాతం ఉన్నది. కాని ఇది మన దేశంలో 2శాతం మాత్ర మే. కావ్ఞన సోలార్‌ విద్యుదుత్పత్తిని గృహఅవసరాలకు, వ్యవసా యానికి, పరిశ్రమలకు కూడా ఉత్పత్తి చేసుకోవాలి.కెనడాలో ఇళ్లకు సోలార్‌ కిట్స్‌ఇచ్చి,దానిద్వారా వచ్చే విద్యుత్‌ను ఇళ్ల అవసరా లకు పోను మిగిలినదాన్ని పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారు. సి.ఎఫ్‌. ఎల్‌ బల్బులు వాడడం వలన విద్యుత్‌ వినియోగం బాగా తగ్గుతుం ది. పెట్రో,డీజిల్‌ పొదుపు చర్యలు చేపట్టాలి. పెట్రోలి యం మంత్రి త్వశాఖ ఆధ్వర్యంలో పెట్రోల్‌ డీజిల్‌,గ్యాస్‌ (ఎల్‌పిజి) కిరోసిన్‌ మొదలైనవి పొదుపుచేయడానికి (20-30శాతం వరకు) శిక్షణ ఇస్తు న్నారు.ఈశిక్షణ గురించి తెలుసుకొని తద్వారా డబ్బును ఆదా చేసు కోవచ్చు.అలాగే డబ్బును, ఆరోగ్యాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలి ప్రతి చిన్నఅవసరానికి ప్లాస్టిక్‌ కవర్లు వాడకూడదు.

గుడ్డ సంచు లు, గొనె సంచులు, పేపర్‌తో తయారు చేసిన సంచులు, టీ,కాఫీ కప్పులు, జ్యూస్‌ గ్లాసులు మొదలైనవి ఉపయోగించాలి. ప్లాస్టిక్‌తో తయారు చేసిన కుర్చీలు, పీటలు కొద్ది కాలానికే పగిలి పోతున్నా యి.కానీ చెక్క, ఇనుముతో తయారు చేసిన పీటలు, కుర్చీలు చాలా కాలం ఉంటున్నాయి. ఈ విషయాన్ని గమనించి చెక్క వస్తువ్ఞలు, మెటల్‌ వస్తువ్ఞలను ఎక్కువగా ఉపయోగించి ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్‌ వినియోగాన్ని తగ్గిం చాలి.అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతినెల వచ్చే కరెంటు బిల్లుకు ఒక పరిమితి పెట్టాలి. అది దాటితే ఆ ధనాన్ని అధికారి లేదా ఆఫీ సు సిబ్బంది తమ జేబులో నుండి తీసి కట్టాలి.

ఈ విధంగా చేస్తే తప్పవినియోగంతగ్గదు.ధర్మల్‌ విద్యుత్‌ మనదేశంలో మొత్తం విద్యు దుత్పత్తిలో 60శాతం పైగా ఉన్నది.కావ్ఞన విద్యుత్‌ వినియోగం తగ్గించకుండా వాయుకాలుష్యం తగ్గించడం అసాధ్యం. మెక్సికోలో మొదటి దశ కాలుష్య హెచ్చరిక వలన 30-40శాతం కాలుష్యా న్ని తగ్గిస్తారు.ప్రభుత్వ వాహనాల వినియోగం 50శాతం తగ్గిస్తారు. 2వదశ హెచ్చరికవలన పాఠశాలలు మూసి వేస్తారు.వాహనాలు 2, 3రోజులు నడపకుండా ఆపుతారు.3వ దశ హెచ్చరిక పరిశ్ర మలు మూతపడతాయి.ఇటువంటివి మనదేశంలోఅమలు చేయాలి.

-కారం పూడి రామకృష్ణ