పరీక్షల టెన్షన్‌ ఆరంభం

cbse exams
 exams

పరీక్షల టెన్షన్‌ ఆరంభం

విద్యాసంవత్సరానికి సంబంధించి పరీక్షల తేదీ లు ప్రకటించినప్పటి నుండి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో టెన్షన్‌ ప్రారంభమవ్ఞతుంది. తప్పుతడకల తో ప్రశ్నాపత్రాలు ఇవ్వడం, లీక్‌లు సర్వసాధారణమైపో యింది. ఎలాంటి తప్పులు జరగకుండా ప్రశ్నాపత్రాలు రూపొందించి కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పటి ష్టమైనచర్యలు తీసుకుంటామని పాలకులు పదేపదే చెప్తు న్నా ఆచరణలో మాత్రం అమలు చేయలేకపోతున్నారు. అందుకే ఏ పరీక్షలకు తేదీలు ప్రకటించినా అభ్యర్థుల్లో ఈ పరీక్షలు ఎలా నిర్వహిస్తారో అనే ఆందోళన మొదల వ్ఞతున్నది. ఈవిద్యాసంవత్సరానికి సంబంధించి తెలం గాణ ప్రభుత్వం మంగళవారం ఇంటర్మీడియెట్‌ పరీక్షా తేదీలను ప్రకటించింది.

వచ్చే ఏడాది మార్చి ఒక టోతేదీనుంచి ఇరవైతేదీ వరకు ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ పరీక్షలు జరుగుతాయని ప్రకటించింది.అటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా పరీక్షల తేదీలను బుధవారం ప్రకటిం చింది. ఈ పరీక్షలతోపాటు ఎంసెట్‌, డిగ్రీ, తదితర పరీ క్షల తేదీలు కూడా త్వరలో వెలువడనున్నాయి.పరీక్షల నిర్వహణలో అధికారులు అంత సమర్థవంతంగా వ్యవ హరించలేకపోతున్నారనేది గత అనుభవాలు చెప్పకనే చెబుతున్నాయి. తెల్లవారేసరికి లక్ష్మీపుత్రులై కోట్లకు పడ గెత్తాలనే కొందరి దురాశా అన్ని రంగాలతోపాటు విద్యా రంగంలో పెచ్చరిల్లుతుండడంతో లక్షలాదిమంది విద్యా ర్థుల జీవితాలుప్రశ్నార్థకంగా మారుతున్నాయి.ఇది

రాను రాను పెరిగిపోతుండటంతో ఆందోళన కలిగిస్తున్నది. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉప యోగించుకొని పరీక్షల్లో ర్యాంకులు సంపా దించుకోవా లనికొందరు విద్యార్థులను రంగంలోకిదించి కోట్లాది రూ పాయలు దండుకుంటున్న దళారుల అరాచకం అంతకం త కు పెరిగిపోతున్నది.ప్రశ్నాపత్రాలు సంపాదించుకొని కొందరు, వాల్యూయేషన్‌లో మార్కులు వేయించుకొని మరికొందరు,ఏకంగా జవాబు పత్రాలనే మార్చివేసేందు కు ఇంకొందరు ఇలా ఎవరికి ఎక్కడఎలా వీలైతే అక్కడ అలార్యాంకులు సాధించేందుకు ఆరాటపడుతుండడంతో రాత్రింబవళ్లు కష్టపడిఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి చదువ్ఞకుంటున్న విద్యార్థుల భవిష్యత్‌ప్రశ్నార్థకంగా మా రుతున్నది.పరీక్ష నిర్వహణలో పాలకులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా విఫలమవ్ఞతున్నారని చెప్పక తప్పదు.

ఈ పరీక్షా ఆ పరీక్షా అని కాదు. పదోతరగతి నుంచి మొదలుపెడితే ఎంసెట్‌తోపాటు ఉద్యోగాలకుజరిగే పరీక్ష ల్లో కూడా ప్రశ్నాపత్రాలు సంపాదించుకునేందుకు నిరం తరం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న ఏ కంగా యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే పరీక్షలోనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఒక ఐపిఎస్‌ అధికారి పరీక్ష రాస్తూ సిబిఐ అధికారులకు పట్టుబడిన ఉదంతం విస్తుపోయేలా చేస్తున్నది. బహుశా యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలో ఇలాంటి సంఘటన జరగడం మొదటిసారేకావచ్చు.

ఐపిఎస్‌ సెలెక్ట్‌ అయిన ఆ అధికారి ఐఎఎస్‌ కోసం భార్య సహాయంతో ఈ మాల్‌ప్రాక్ట్టీస్‌కు పాల్పడుతూ పట్టుబడ్డాడు. గతంలో రైల్వేరిక్రూట్‌మెంట్‌బోర్డు ఆధ్వర్యంలో జరిగిన పరీక్షల్లో ఏకంగా ప్రశ్నాపత్రాన్నే సంపాదించుకున్న సంఘటనలు వెలుగుచూశాయి. పరీక్షలు రద్దుచేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి.కొన్నిసార్లు బయటకువస్తున్నా మరికొన్ని సార్లు మూడోకంటికి తెలియకుండా జరిగిపోతున్నాయి. ప్రశ్నా పత్రాలు లీక్‌అయినట్లు స్పష్టంగా బయటపడిన సంద ర్భాల్లో ప్రభుత్వపరంగా కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే పరిస్థితి దిగజారుతున్నది.

ఇంటర్మీడియేట్‌ అనేది విద్యార్థులకు ఎంతో కీలకమైంది. అక్కడే వారి భవిష్యత్‌ మార్గనిర్దేశం అవ్ఞతుంది.విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేసే ఎంసెట్‌ పరీక్షలు ఎలా జరిగాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇన్నేళ్లల్లో ఒక్కసారి కూడా తప్పులులేకుం డా ప్రశ్నాపత్రాలు ఇవ్వలేకపోయారంటే ఏమనుకోవాలి? ఎవరిని నిందించాలి? ఇలా ప్రశ్నాపత్రాలు సిలబస్‌లో లేనివో,లేక తప్పులతోనో ఇవ్వడం ఆ తర్వాత సరిదిద్దు కునేందుకు ఆ ప్రశ్నలను తొలగించడం సర్వసాధారణమై పోయింది. అరమార్కుతో విద్యార్థి భవిష్యత్తే మారిపో తుంది. తప్పుడు ప్రశ్నకు ఆ విద్యార్థి జవాబు దొరకక ఎంతటి టెన్షన్‌కు గురవ్ఞతాడో ఊహించుకుంటే అర్థం అవ్ఞతుంది.కానీ ఎప్పటికప్పుడు ఎలాంటితప్పులు జరగ కుండా ప్రశ్నాపత్రాలు రూపొందించి కాపీయింగ్‌కు అవ కాశం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని పాలకులు పదేపదే చెప్తున్నా ఆచరణలో ఏమాత్రం అమ లు చేయకపోవడంతో నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి.

ఈ తప్పుల వల్ల ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారిపోతున్నది. ప్రశ్నాపత్రాలు కొన్న వారు అందలమెక్కిపోతున్నారు. ప్రశ్నాపత్రాల జవాబుల ను కంఠస్తం చేసిన ప్రబుద్ధులు ఎలాంటి కష్టం లేకుండా మేధావ్ఞలుగా పైకి వెళ్లిపోతుంటే సంవత్సరాల తరబడి శ్రద్ధాసక్తులతో కష్టపడి చదివిన మెరికల్లాంటి విద్యార్థులు వెనుకబడిపోతున్నారు. ఇప్పటికైనా పరీక్షా విధానాలనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఏ దశలో లీక్‌ అవ్ఞతున్నాయి? దీనికి బాధ్యులెవరు?ప్రశ్నాపత్రాలు త యారు చేసేవారా? లేక వాటిని సరిచూసి సక్రమంగా ఉన్నాయాలేదా అని నిర్ధారించేవారా?ఈ రహస్యపత్రాలు ముద్రించేందుకు లక్షలాదిరూపాయలు అదనంగాపొందు తున్న ప్రెస్‌ యజమానులా? ట్రాన్స్‌పోర్టలా? లేక పరీ క్షా కేంద్రాలకు చేరిన తర్వాత అది నిర్వహిస్తున్న అధికా రులా? తదితర విషయాలు సమగ్రంగా పరిశీలించి పరిశోధించి పటిష్టమైన నిఘా పెట్టాలి.

– దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌