పరిశోధనల్లో ప్రగతి సాధించలేమా?

Experiments
Experiments

పరిశోధనల్లో ప్రగతి సాధించలేమా?

భవిష్యత్తులో యుద్ధాలు ఆయుధాలతో కాదు మానవ మెదళ్లతో జరుగుతాయి. ఎవరైతే మేధో నైపుణ్యాలు పెంపొందించుకుంటారో వారే అత్యధిక ప్రయోజనాలు పొంది చివరికి విజేతలుగా నిలుస్తారు అని మాజీ ప్రధాని పి.వి నరసింహరావ్ఞ అన్న మాటలు పదేపదే గుర్తు చేసుకోవడం అవస రం. 1995 నవంబరు 18న కేరళలోని తిరువనంతపురంలో దేశం లోనే మొదటిసారిగా ఎలక్ట్రానిక్‌ టెక్నోపార్కును ప్రారంభించిన సందర్భంగా ఈ మాటలు అన్నారు. ఇది ముమ్మాటికి వాస్తవం. మనదేశంలో డిగ్రీపట్టాలు పుచ్చుకున్న విద్యార్థులు లక్షల్లో ఉన్నారు. కానీ వీరిలో ఎంతమందికి నైపుణ్యం ఉందని పరిశీలిస్తే చాలా తక్కు వ శాతం కనిపిస్తుంది.

దీనికి ఉదాహరణగా 2007లో ఐసిఐసిఐ బ్యాంకు సిబ్బంది నియామకాలను ప్రస్తావించవచ్చు. దరఖాస్తు దారులు సుమారు 7.5 లక్షల మందిలో కేవలం 17,500 మంది నైపుణ్యం ఉన్న యువత మాత్రమే ఎంపికయ్యారు. అలాగే బయో టెక్నాలజీ రంగానికి సంబంధించి నైపుణ్యం లేని యువతే డిగ్రీ పట్టాలు అధికంగా పొందుతున్నారు. మనదేశ సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ పరిశ్రమ కూడా నైపుణ్యం తక్కువగానే ఉంటోంది.ఇవన్నీ పరిశీలించి 2010-2020 దశాబ్దాన్ని మనదేశం ఆవిష్కరణల దశాబ్దంగా ప్రక టించింది. యువతీయువకులు సైన్స్‌,టెక్సాలజీ రంగంలో ఆసక్తితో పరిశోధనలు సాగించేందుకు వీలుగా2010లో క్యూరీ (కన్సాలిడేషన్‌ ఆఫ్‌ యూనివర్శిటీ రీసెర్చి ఇన్నోవేషన్‌ అండ్‌ ఎక్స్‌ప్రెస్‌) అన్న పేరుతో పథకం ప్రారంభించారు. అయినా నేటి యువత కొద్దిపాటి ధైర్యం కూడా లేక సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అభివృద్ధికి పరిశోధనలు చేయడంలో వెనుకాడుతుండడం విచారకరం. ముఖ్యంగా మన భారత దేశ యువతలో మార్పు మరింత రావాలి. ఆనాటి యువత కూడా భయపడి ఉంటే ఈ న్యూక్లియర్‌, సైన్స్‌ టెక్నాలజీని, ఎల క్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్స్‌, కెమికల్‌ అండ్‌ మెడికల్‌ టెక్నాలజీ పరంగా పురోభివృద్ధి ఉండేదికాదు.సివి రామన్‌, బాబా వంటి శాస్త్రవేత్తలు మనదేశానికి పరిశోధనల్లో ఎంతోకీర్తి సాధించి పెట్టారు. మరి ఈనాటి యువతలో ఎందుకు ఆ స్ఫూర్తి కరువయ్యిందో తెలియడం లేదు. మన దేశం లోనే కాదు ప్రపంచ దేశాల్లోఆనాటి యువత శాస్త్రవేత్తలుగా సాధించిన పరిశోధనల కృషిని గమనిద్దాం. జర్మనీకి చెందిన మార్టిన్‌ క్లాప్రోత్‌1798లో యురేనియం మూల కాన్ని కనుగొన్నాడు. జర్మనీకే చెందిన విల్‌హెర్మ్‌ కొన్రాడ్‌ రొంటె జెన్‌ 1895లో ఎక్స్‌రే కనుగొన్నాడు. ఫ్రాన్స్‌కు చెందిన అంటోనీ హెన్రీ బెక్వెరెల్‌ 1896లో యురేనియం మూలకంలో రేడియో ఏక్టివిటీని కనుగొన్నాడు.

పోలాండ్‌ దేశస్థులు క్యూరీ దంపతులు 1898 డిసెంబర్‌ 26న రేడియం కనుగొన్నాడు. వీరిద్దరూ హెన్రి బెక్వెరల్‌తో కలిసి నేచురల్‌ రేడియో యాక్రవిటీని కనుగొన్నందుకు 1903లో ఫిజిక్స్‌లో నోబెల్‌ బహుమతి పొందగలిగారు. మేరీక్యూరీ తన భర్త చనిపోయినా అధైర్యపడక పరిశోధనలు కొనసాగించి పోలోనియం, ధోరియం కనుగొన్నారు. దీని ద్వారా ఆమెకు 1911 లో కెమిస్ట్రిలో నోబెల్‌ బహుమతి లభించింది. ఈ విధంగా ఆమె చిన్న వయస్సులోనే 29వ సంవత్సరంలో, అలాగే 44వ సంవత్స రంలో కొత్త మూలకాలను పరిశోధించడం, మరికొన్ని పదార్థాలను ఆవిష్కరించి ఆదర్శమూర్తిగా నిలిచారు. 1932లో బ్రిటన్‌ శాస్త్రవేత్త జేమ్స్‌చార్విక్‌ న్యూట్రాన్‌లను కనుగొన్నారు. 1934లో మేరీక్యూరీ కుమార్తె ఐరెన్‌క్యూరీ, అల్లుడు ఫ్రెడరిక్‌ క్యూరీ ఆర్థిఫిషియల్‌ న్యూక్లియర్‌ ఐసోటోప్‌లను రూపొందించారు. ఈ విధంగా వీరు ఆర్టిఫిషియల్‌ రేడియో యాక్టివిటీని కనుగొన్నందుకు 1935లో కెమిస్ట్రీలో నోబెల్‌ బహుమతి లభించింది. ఎన్రికోఫెర్ని అనే శాస్త్ర వేత్త 1942 డిసెంబర్‌ 2న చికాగో యూనివర్శిటీలో న్యూక్లియర్‌ రియాక్టర్‌ను డిజైన్‌ చేసి చైన్‌రియారక్షన్‌తో సుమారు 30 నిము షాలు రియాక్టర్‌ను పనిచేయించారు. ఈ సంఘటన న్యూక్లియర్‌ టెక్నాలజీ అభివృద్ధికి గొప్ప మలుపుగా చరిత్రలో నిలిచింది. ఇలా ఎందరో శాస్త్రవేత్తలు తమ పరిశోధనలతో భావి తరానికి ఆదర్శం గా నిలిచారు. నేటి యువత కూడా ధైర్యసాహసాలతో పరిశోధ నలు సాగించడానికి ముందడుగు వేయడం అవసరం. ఇతర దేశాల కన్నా మనదేశంలో పరిశోధనలకు ప్రోత్సాహం చాలా తక్కువ. ఎందరో శాస్త్రవేత్తలు తమ పరిశోదనల ద్వారా కొత్త ఆవిష్కరణలు గతంలో వెలుగులోకి తెచ్చి దేశానికి ఎంతో పేరు సంపాదించి పెట్టారు. కానీ ప్రభుత్వాల నిర్వాకంతో పరిశోధనలకు తగిన ప్రోత్సాహం లభించకుండాపోతోంది. అమెరికాలో 13603174 మంది శాస్త్రవేత్తలు తమ పరిశోధనలకు సంబంధించి 72078 పేటెంట్‌( మేధోసంపత్తి) హక్కులు పొందగలిగారు. దీనికి 281 బిలియన్‌ డాలర్లు 2003-04లో అమెరికా వెచ్చించింది. అదే సంవత్సరం చైనాలో 926064 మందిశాస్త్రవేత్తలు 20928 పేటెంట్‌ హక్కులు పొందారు. 80బిలియన్‌ డాలర్లు ఖర్చయింది. జపాన్‌లో 676207 మంది శాస్త్రవేత్తలు 10,9610 పేటెంట్‌ హక్కులు పొందారు. 110 బిలియన్‌ డాలర్లు ఖర్చుపెట్టారు.

రష్యా లో 477604 మంది శాస్త్ర వేత్తలు 19427 పేటెంట్‌ హక్కులు పొందారు.16బిలియన్‌ డాలర్లు వెచ్చించారు. ఫ్రాన్సులో 193744 మంది శాస్త్రవేత్తలు 9347 పేటెంట్‌ హక్కులు పొందారు. 34 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారు. దక్షిణ కొరియాలో 151707 మంది శాస్త్రవేత్తలు 52979 పేటెంట్‌ హక్కులు పొందగలిగారు. 24బిలియన్‌ డాలర్లు వెచ్చించారు.భారత్‌లో 129365 శాస్త్రవేత్తలు 1087 పేటెంట్‌ హక్కులు పొందారు. 21.28 బిలియన్‌ డాలర్లు వెచ్చించారు. దీన్ని బట్టి మన భారతదేశంలో శాస్త్రవేత్తల పరిశోధ నలు, వాటికి వెచ్చిస్తున్న ఆర్థికవనరులు ఏవిధంగాఉన్నాయో స్పష్ట మవ్ఞతుంది. పరిశ్రమలకు, విశ్వవిద్యాలయాలకు మధ్య అనుసంధా నం, పరిశోధనలపై విద్యార్థి దశ నుంచే ఆసక్తి కొనసాగడం ఎంతో అవసరం. అలా అయితేనే బహుళజాతి కంపెనీలు మనదేశంలో తమ పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డి)కేంద్రాలను నెలకొల్పడానికి ముందుకువస్తాయి. 2009 నాటికి సుమారు 110సంస్థలు ఈ విధంగా మనదేశంలో వచ్చాయి. అయితే చైనాతో పోల్చుకుంటే మనం ఎంత కిందిస్థాయిలో ఉన్నా మో తెలుస్తుంది. చైనాలో 750 సంస్థలు వచ్చాయి

. పేటెంట్స్‌ (మేధో సంపత్తి హక్కులు) విషయా నికి వస్తే 2002లో మనదేశం 9000 పేటెంట్స్‌ దరఖాస్తులను దాఖలు చేయగా వాటిలో కేవలం 2000 పేటెంట్స్‌కే అంగీకారం లభించింది. అదే చైనాలో 1,80, 000 పేటెంట్స్‌ దరఖాస్తుల్లో 1,00,000 పేటెంట్స్‌ అంగీకారం పొందడం గమనించదగ్గ విషయం. ఇక శాస్త్ర పరిశోదన పత్రాల విషయంలో 1997-2007 మధ్య అంటే పదేళ్ల కాలంలో భారత దేశంలో పరివోధన పత్రాల సంఖ్య 11,177నుంచి 19,448కి పెరిగింది. అదేకాలంలో చైనాలో 10,557 నుంచి 53,513కు సంఖ్య పెరిగింది.2001లో మనదేశం 179 పేటెంట్‌ హక్కులను పొందగా, చైనా 266 పేటెంట్‌ హక్కు లను పొందగలిగింది.జర్మనీ 11,894,జపాన్‌ 34,891, అమెరికా 98,594 పేటెంట్‌ హక్కులను పొందాయి. ఇక ఆ తరువాత కాలంలో ఈ దేశాలు భారీగా విద్యుత్‌ఉత్పత్తితోపాటు ఇతర మౌలిక సదుపాయాలకు పెద్దమొత్తంలో ఏర్పాటు చేసుకున్నాయి. విద్యార్థు లను, శాస్త్రవేత్తలను ప్రోత్సహించాయి.

2006-07లో అమెరికా 4,38,576 పేటెంట్‌ దరఖాస్తులను సమర్పించి 160308 పత్రా లకు ఆమోదంపొందింది. జపాన్‌ 408674 దరఖాస్తుల్లో,29,071 కి , చైనా 210490 దరఖాస్తుల్లో 57,786 దరఖాస్తులకు భారత్‌ 28,882 దరఖాస్తుల్లో 7539 దరఖాస్తులకు ఆమోదం అంటే పేటెంట్‌ హక్కులను పొందగలిగాయి. ఇవన్నీ గమనించే 2025 నాటికి మనదేశం ప్రపంచ శాస్త్ర పరిశోధన రంగంలో అగ్రస్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో 2011లో సైంటిథిక్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ ఆఫ్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ను ఏర్పాటు చేసింది. 2011లో మనదేశం వెలువ రించిన లక్ష్యాల శ్వేతపత్రాన్ని పరిశీలిస్తే 15లక్షల గ్రాడ్యుయేట్లను, మూడు లక్షల పోస్ట్‌ గ్రాడ్యుయేట్లను ఏటా 3000 పిహెచ్‌డి విద్యా ర్థులను తయారు చేయాలన్న సంకల్పాన్ని వెల్లడించింది. అయితే 2005-2006లో పిహెచ్‌డికి సంబంధించి సైన్స్‌ విభాగంలో కేవలం 8420 మంది మాత్రమే పట్టాలు పొందగలిగారు. అదే అమెరికా, చైనాలో మనకన్నా 8 రెట్లు అధికంగా పొందుతున్నారు

. ఇక కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో మనదేశంలో కేవలం 25 కంటే అధికంగా పిహెచ్‌డి పట్టాలు పొందలేకపోవడం విచారకరం. 2010లో విడుదలయిన ఒక నివేదికను పరిశీలిస్తే అత్యంత ఆధు నిక కంపెనీల జాబితాలో అమెరికాకు చెందినకంపెనీలు 24, యూ రోపియన్‌ యూనియన్‌కు చెందినవి 11 కంపెనీలు, జపాన్‌కు చెంది నవి ఐదు కంపెనీలు,చైనా తైవాన్‌ కలిపి5 కంపెనీలు, దక్షిణ కొరి యాకు చెందిన మూడు కంపెనీలు, ఉండగా మన భారత దేశానికి చెందిన కంపెనీలు కేవలం రెండు మాత్రమే ఉన్నాయి.2010కి సం బంధించి అగ్రస్థాన కంపెనీలు అమెరికాకు చెందినవి 515, జపాన్‌ కు చెందినవి 210, కెనడాకు చెందినవి 61, చైనాకు చెందినవి 113 కంపెనీలు ఉండగా మనభారతదేశానికి చెందినవి కేవలం 56 కంపె నీలే ఉన్నాయి. 2011 ఏప్రిల్‌ నాటికి చైనా 121 కంపెనీలు, భారత్‌ 57 కంపెనీలకు పెరిగాయి. ఇక్‌ టాప్‌-100 కంపెనీల్లో మనదేశా నికి సంబంధించి ఒక్క కంపెనీ కూడా లేకపోవడం శోచనీయం. చైనాకు 7, జపాన్‌కు 4 కంపెనీలు ఉన్నాయి అందుకే ఆదేశాలకు చెందిన ఉత్పాదక రంగం ఎంతో అభివృద్ధి చెంది ఉపాధి అవకాశా లు మెరుగుపర్చుకోగలిగాయి. ఉన్నత విద్య, పరిశోదన రంగంలో యువతను ప్రోత్సహిస్తూ ప్రగతిపధంలో నడుస్తున్నాయి.

-కనుకుల యాదగిరిరెడ్డి