పరిశుద్ధ భావజాలమే స్వచ్ఛభారతికి పునాది

EDT111

పరిశుద్ధ భావజాలమే స్వచ్ఛభారతికి పునాది

తరాలు మారుతున్నాయి. తరతరానికి మధ్యమానసిక స్థితిలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా యువత మానసికంగా పెడత్రోవ పట్టడానికి నేడు ఎన్నో అవకాశాలు ఉద్భవించాయి. వారి మానసిక స్థితిని సన్మార్గంలో మళ్లించే ప్రయత్నాలేవి జరిగినట్టు కానరావ్ఞ. ఇటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని అశ్లీల వెబ్‌సైట్లపై నిషేధం విధించడం ఎంతో హర్షణీయం. స్వచ్ఛభారత్‌ ఎంత అవసరమో స్వచ్ఛ భారతి కూడా అంతే అవసరం. మనం తినే తిండి కల్తీ, తాగే నీరు కల్తీ, పీల్చే గాలి విషమయం ఫలితంగా మానవ్ఞడు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సంతులనాన్ని కోల్పో తున్నాడు. తత్ఫలితమే నేటి సమాజంలో జరుగుతున్న ఆకృత్యా లు, అత్యాచారాలు.నేటి సమాజంలో మానవ జీవితంలో మాన వత్వపు లక్షణాలకు ఉండవలసిన ప్రాధాన్యం లేకపోవడం ధనం, అధికారం, కులం ప్రాబల్యం సంపాదించుకోవడంతో యువతలో పశుప్రవృత్తి పడగవిప్పి క్రూరమృగాలుగా మారుతున్నది.

సంకు చితమైన కులతత్వం, మతోన్మాదం, ప్రాంతీయతత్వం వంటి విష భావజాలాలతో తిరుగుబాటు స్వభావం, అసూయ,స్వజాతీయ దుర హంకారం, తలబిరుసు తనంతోతమ చదువ్ఞను, తెలివితేటలను సమాజ వినాశనకారకమయ్యే కార్యక్రమాలకు ఉపయోగించటం విచారకరం. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నా ప్రజలకు స్వచ్ఛమైన భావజాలాన్ని అందించడంలో ప్రభుత్వాలు విఫలమ య్యాయి. పాఠశాలలో శిశువ్ఞలుగా చేరిన పిల్లలు పదేళ్ల తరువాత పశువ్ఞలుగా మారి ఆంబోతుగా అత్యాచారాలు చేస్తున్నారంటే వారి భావజాలం ఎంతగా కుళ్లిపోయిందో అర్థం చేసుకోవచ్చు. కాలుష్యం శారీరకంగానే కాదు మానసికంగా, భావాత్మకంగా, సైద్ధాంతికంగా కూడా వ్ఞంటుంది. ఈ కాలుష్యాన్ని మనం ముందు నిర్మూలించాలి. వివేకానందుడు మొదలుకొని అబ్దుల్‌ కలామ్‌ వరకు ఉద్బోధించింది ‘మన భావనలే మన భవిష్యత్తు అని. మత తలరాతను మార్చు కోలేకపోవచ్చు. కాని మన ఆలోచనలను, అలవాట్లను మార్చుకో వచ్చు. అవే మన భవిష్యత్తును మారుస్తాయి.
ఆంగ్లేయులు భారత దేశాన్ని పరిపాలించేటప్పుడు తమ రాజకీయ ప్రయోజనాల కోసం బుద్ధిపూర్వకంగా భావకాలుష్యాన్ని ప్రవేశపెట్టారు.దానికి మనమంద రం బానిసలమయ్యాం. ఈ రోజున సినిమాలు, టీవీలు, అంతర్జా లంలోని వెబ్‌సైట్లు, ఫేస్‌బుక్‌లు, యూట్యూబ్‌లు, వెదజల్లుతున్న భావ కాలుష్యానికి యువత నిర్వీర్యమవ్ఞతుంది. 125 కోట్ల ప్రజలు వారిలో 60 శాతం యువత కలిగిన ఒక జాతి ఎంతో శక్తివంతంగా ఉండాలి. కాని అంతర్జాతీయ వేదికలపై (ఒలింపిక్స్‌, చలన చిత్రో త్సవాలు) మనవారి ప్రదర్శన పేలవంగా ఉంటుంది. మనదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్ణయింపబడుతుంద న్నాడు ఒక మహానాయకుడు. కాని నేడు ‘మన దేశ భవిష్యత్తు అంతర్జాలపు గదుల్లో నిర్ణయింపబడుతుందనటంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. ఒకప్పుడు ఏ దేశ నాగరికతను పోల్చాలన్నా ‘క్రీస్తుకు ముందు తరువాత అని నిర్వచించే వాళ్లు. కాని నేడు ‘గూగుల్‌కు ముందు, ఆ తరువాత అని చెప్పుకోవలసి వస్తోంది. అంతగా అంతర్జాల ఆధారితసేవల పట్ల యువత ఆధారపడుతోంది. ఫేస్‌బుక్‌లో 1366 మిలియన్ల మంది ఖాతా కలిగి ఉన్నారు. వాట్సప్‌లో 600 మిలియన్ల మందికి అకౌంట్లున్నాయి. 100 మిలి యన్‌ భారతీయులు ఫేస్‌బుక్‌లో పలకరించుకుంటుంటే 33 మిలి యన్ల దేశ ప్రజలు ట్విట్టర్‌లో తమ మనోభావాలు పంచుకుంటు న్నారు. ఈ సేవలు ఇంతగా ప్రాచుర్యం పొందడానికి మనిషిలోని బలహీనతలు, భావజాలాలే కారణం. మన సమాజంలోని మను షులు ఎక్కువ మంది అంతర్ముఖులే. తమ భావనలు, కోరికలు, అభిప్రాయాలను బయటకి చెప్పుకోలేక వీటిని సాధనాలుగా వాడుకుంటున్నారు. అపరిచితులతో పరిచయం పెంచుకుని, తమ కోరికలను సిగ్గువిడిచి పంచుకుంటున్నారు. వీటి ద్వారా యువత తమలో దాగి వ్ఞన్న విశృంఖలత్వానికి తెరతీసి ఆడ,మగ అని తేడా తెలియక వావివరసలు మరచి ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వం అశ్లీల వెబ్‌సైట్లను నిషేధించగానే కొంత మంది సినీపెద్దలు భావస్వేచ్ఛను హరించినట్లు గొంతుచించుకుంటున్నారు. మనిషి అపరిమితమైన స్వేచ్ఛతో విశృంఖలంగా జీవించడం మొదలుపెడితే జంతువ్ఞలకు మనకు తేడా ఉండదు. యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ట్రాఫిక్‌ని నియంత్రించడం వంటిదే అని ఒకాయన ఉవాచ. నిజమే అతివేగంగా వెళ్తున్నప్పుడు నియంత్రించక తప్పదు. అశ్లీల సైట్లను నిషేధించడం గుడి గోపురాలపై బూతు బొమ్మలను కూల్చడం వంటిదే అని ఇంకొకాయన వత్తాసు చివరకు న్యాయమూర్తులు సైతం అశ్లీల సైట్లను చూడవద్దనడం అనేది వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించినట్లు అవ్ఞతుందని చెప్పడం విచారకరం. ఒక మతాన్ని, ఒక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని రెచ్చగొట్టే సాహిత్యం, విద్రో హచర్యలు తప్పయినప్పుడు స్త్రీని ఆటవస్తువ్ఞగా, లైంగిక దాడులను ప్రోత్సహించే సాహిత్యంకాని, సినిమాలుకాని, వెబ్‌సైట్లు కాని నిషే ధించడం ఏ మాత్రం తప్పుకాదు. తీవ్రవాదం, తప్పయితే విశృం ఖల శారీరక సెక్స్‌ను ప్రేరేపించడం కూడా నేరమే. ఇవి మాదక ద్రవ్యాలు, ఉత్ప్రేరకాల కంటే ప్రమాదకరమైనవి. విచక్షణ, వివేచన లేని యువత వీటికి బానిసలై ఆడపిల్లల మీద రాక్షసచర్యలకు దిగుతున్నారంటే ఇవి కారణం కాదా? రుషికేశ్వరి ఉదంతంలో ఎవరో కొంత మందిని నేరస్థులుగా శిక్షించడం జరుగుతుంది. కాని అసలు కారణం, విషపూరితమైన భావజాలం.

ఇటువంటి భావజాలాన్ని ఏ రూపంలో వ్ఞన్నా (వెబ్‌సైట్లు, సాహిత్యం, సినిమాలు) పూర్తిగా నిర్మూలించాలి. ఉప్పెనలా ముంచుకొస్తున్న ఈ భావజాలాన్ని ఆపలేకపోతే రాబోయేతరం పూర్తిగా కుళ్లిపోతుంది. మనవల్ల మన మాటల వలన అభిప్రాయవ్యక్తీకరణ వలన సమాజానికి మంచి జరగకపోయినా ఫర్వాలేదు. కానీ హాని కలిగేలా చేయడం, మానవత్వం ఉన్నవారెవరు చేయరు. మనం కూడా ఎవరి పరిధిలో వారు ఈ భావజాలాన్ని విడనాడుదాం. ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా ఒక అడుగు ముందుకేసింది, తన అరచెయ్యిని అడ్డంపెట్టింది సూర్యోదయాన్ని ఆపడానికి కాదు గ్రహణం బారిన పడకుండా ఉండటానికి. మనమూ చేయిచేయి కలుపుదాం. స్వచ్ఛభారతిని నిర్మిద్దాం.

ఈదర శ్రీనివాసరెడ్డి
(రచయిత: డీన్‌, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం)